Saturday, April 2, 2022

పోలీస్ అవుతారా..... రాచకొండకు...... రండి

*పోలీస్ అవుతారా..... రాచకొండకు...... రండి*

*ఉచిత శిక్షణ కేంద్రాలకు ఏర్పాట్లు*

హైదరాబాద్‌: పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు పొందాలనుకునే యువతీ, యువకులకు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ సారథ్యంలో శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.రంగారెడ్డి, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు, స్వచ్చంద సంస్థలు, దాతల సహాయంతో ఉచిత కోచింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. మల్కాజిగిరి, కుషాయిగూడ, భువనగిరి, చౌటుప్పల్‌, ఎల్‌.బి.నగర్‌, ఇబ్రహీంపట్నం ప్రాంతాలలో శిక్షణ కేంద్రాలు తెరవనున్నారు. గతంలో రాచకొండ పోలీస్‌ ద్వారా కోచింగ్‌ తీసుకొని 588మంది పోలీస్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్‌ 5 సాయంత్రం 6 గంటల్లోపు తమ సమీప పోలీస్‌ స్టేషన్‌లోనూ పేర్లను నమోదు చేసుకోవచ్ఛు పదోతరగతి, ఇంటర్మీడియట్‌ మార్కుల మెమోలు, ఆధార్‌ కార్డు, నివాస, కుల ధ్రువీకరణ పత్రాలను తీసుకెళ్లాలి. పురుషులు 167.6 సెం.మీ, మహిళలు 152.5 సెం.మీ ఎత్తు ఉన్నవారు మాత్రమే పేర్లను నమోదు చేసుకోవాలి. స్థానికులకు ప్రాధాన్యం ఉంటుంది.

link Media ప్రజల పక్షం🖋️ 

రాష్ట్రపతితో మైనారిటీ కమిషన్ ప్రతినిధి బృందం భేటీ –

రాష్ట్రపతితో మైనారిటీ కమిషన్ ప్రతినిధి బృందం భేటీ – మైనార్టీలకు సంబంధించిన అంశాలపై చర్చ

జాతీయ మైనారిటీ కమిషన్ ప్రతినిధి బృందం ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయింది. చైర్ పర్సన్ సయ్యద్ షెహజాదితో పాటు కమిషన్ సభ్యులు కెర్సీ దెబూ, ధన్యకుమార్ జినప్ప, రించెన్ లామో రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లోని మైనారిటీలకు సంబంధించిన పలు అంశాలపై కోవింద్ తో చర్చించినట్టు కమిషన్ చైర్ పర్సన్ షెహజాదీ మీడియోకు తెలిపారు.


సాహసోపేతమైన నిర్ణయాలు కెసిఆర్ ప్రకటిస్తారు..... సంతోష్ కుమార్ శాస్త్రి

*సాహసోపేతమైన  నిర్ణయాలు కెసిఆర్ ప్రకటిస్తారు..... సంతోష్ కుమార్ శాస్త్రి.....!*

హైదరాబాద్: ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయాలు ప్రకటిస్తారని బాచుపల్లి సంతోష్ కుమార శాస్త్రి తెలిపారు. శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి.ఈ సందర్భంగా బాచుపల్లి సంతోష్ కుమార శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ఇది ఉద్యోగ నామ సంవత్సరమని, 75 శాతం మంచి ఫలితాలు కనిపిస్తుండగా... 25 శాతం వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపారు. క్రీడా, రాజకీయాలలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. అన్ని చోట్లా మహిళలు కీలకంగా మారబోతున్నారని అన్నారు. తెలంగాణ ఐఏఎస్‌లలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.

ముఖ్య నేతలకు భద్రత పెరుగుతుందని, దేశంలో అలజడులు ఉంటాయని శాస్త్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం ప్రపంచాన్ని శాసించే విధంగా ఎదుగుతుందని చెప్పుకొచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దూసుకెళ్తుందన్నారు. కొన్ని చోట్ల రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు పొదుపు పాటించకపోతే శ్రీలంక పరిస్థితి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. కేసీఆర్ ది కర్కాటక రాశి అని...సీఎం జాతకం గత సంవత్సరం కంటే బాగుంటుందని తెలిపారు. ప్రత్యర్ధులు ఇబ్బందులు పెట్టినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని బాచుపల్లి సంతోష్ కుమార శాస్త్రి వెల్లడించారు.

link Media ప్రజల పక్షం🖋️ 

గాంధీ భవన్ పంచాంగ పఠనం లో సంచలన విషయాలు.... కేంద్రంలో ఒక నాయకుడు మరణిస్తారట

*గాంధీ భవన్ పంచాంగ పఠనం లో  సంచలన విషయాలు.... కేంద్రంలో ఒక నాయకుడు మరణిస్తారట .....*

హైదరాబాద్ : గాంధీభవన్ పంచాంగ పఠనంలో పలు సంచలన విషయాలను వేద పండితులు శ్రీనివాస మూర్తి వెల్లడించారు. కేంద్రంలో ఓ నాయకుడి మరణ వార్త దిగ్భ్రాంతి కలిగిస్తుందని ఆయన వెల్లడించారు.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిరంకుశ పాలనతో ప్రజాగ్రహాన్నీ చవిచూస్తాయన్నారు. కేంద్రం.. రాష్ట్రాల హక్కులను కాల రాస్తోందన్నారు. అక్టోబర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విశ్వరూపం చూపుతారని శ్రీనివాసమూర్తి తెలిపారు.

పంచాంగ శ్రవణం అనంతరం రేవంత్ తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల తరపున సమరోత్సహంతో పని చేస్తామన్నారు. 42లక్షల మెంబర్ షిప్ చేసుకున్నామని వెల్లడించారు. 80లక్షల ఓట్లు తెచ్చుకుంటే 90 సీట్లు వస్తాయని రేవంత్ తెలిపారు. ఇందిరమ్మ, సోనియమ్మ రాజ్యం తేవాలన్నారు. పార్లమెంట్‌లో సోనియమ్మ, మీరాకుమార్, సుష్మాస్వరాజ్‌తో తెలంగాణ వచ్చిందన్నారు. అలాంటి తెలంగాణలో మహిళలకు గౌరవం లేదని రేవంత్ వాపోయారు.

link Media ప్రజల పక్షం 

 

Friday, April 1, 2022

రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు.... హాజరైన రాజకీయ ప్రముఖులు

*రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు.... హాజరైన రాజకీయ ప్రముఖులు*

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శ్రీశుభకృత్‌ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు ప్రజలందరూ ఉగాది పండుగను ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. శ్రీశుభకృత్ నామ సంవత్సరం తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని.. ఆ వెలుగు ప్రజలకు శుభప్రదంగా, సంతోషమయంగా ఉండాలని కోరుకున్నారు. తెలుగు వారికి ప్రత్యేకమైన ఉగాది పండుగను కుటుంబసభ్యులతో కలిసి అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు.

రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. రాజ్‌భవన్‌లో వేడుకలకు సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు గైర్హాజరయ్యారు. ఉగాది వేడుకలకు రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు, భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి వేడుకలకు హాజరయ్యారు.

link Media ప్రజల పక్షం🖋️ 

Tuesday, March 29, 2022

వాట్సాప్ కంటే టెలిగ్రాం ఎందుకు బెస్ట్…?

వాట్సాప్ కంటే టెలిగ్రాం ఎందుకు బెస్ట్…?

Courtesy by : తొలివెలుగు మీడియా website

ఈ రోజుల్లో వాట్సాప్ లేని ఫోన్ లేదు అనే మాట వాస్తవం. కేవలం వాట్సాప్ కోసమే ఫోన్ కొనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో వాట్సాప్ వాడకం తగ్గడం టెలిగ్రాం సహా మరికొన్ని యాప్స్ వాడకం అనేది క్రమంగా పెరిగింది. అయితే వాట్సాప్ కంటే టెలిగ్రాం చాలా బెస్ట్ అనే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఏంటీ అనేది ఒకసారి చూద్దాం.

Telegram Now Lets You Transfer WhatsApp Chat History Without Losing Photos & Videos

ప్రైవసీ విషయంలో వాట్సాప్ కంటే కూడా పటిష్టంగా ఉంటుంది ఈ యాప్. మీ ఫోన్ నంబర్ ఎవరికీ కనపడకుండా కూడా ఇది వాడుకునే అవకాశం ఉంది. గ్రూప్స్ లో నెంబర్ కనపడటం అనేది ఎప్పటికి అయినా ప్రమాదమే. కాని ఈ యాప్ లో గ్రూప్స్ లో నెంబర్ లు కనపడకుండా కంట్రోల్ చేయవచ్చు. ఒక గ్రూప్ లో జాయిన్ అయితే మాత్రం గత మెసేజ్ లు చూడవచ్చు. గ్రూప్ లో గరిష్ట సభ్యుల సంఖ్య 2,00,000 మంది ఉండవచ్చు.

WhatsApp vs Telegram feature by feature comparison - Dignited

కాని వాట్సాప్‌లో మాత్రం 256. గ్రూప్ లో మన నెంబర్ కనపడకుండా కంట్రోల్ చేయవచ్చు. గ్రూప్ లో పంపిన మెసేజ్ లు ఎప్పుడైనా ఎడిట్ చేయవచ్చు లేదా రిమూవ్ చేయవచ్చు. మెసేజ్ ను పిన్ చేసే ఆప్షన్ గ్రూప్స్ లో ఉంటుంది. 1.5 GB వీడియో లు పంపే అవకాశం ఉంది. ఇంటర్నెట్ లింక్స్ ను అందులోనే ఓపెన్ చేయవచ్చు. పోల్స్ కూడా ఇందులో పెట్టె అవకాశం ఉంది. ఇక టెలిగ్రాం పూర్తిగా ఉచితం. వాట్సాప్ మాదిరిగా అమ్ముడుపోలేదు అంటారు నిపుణులు

వెంకయ్యే కాబోయే రాష్ట్రపతి అంటూ వార్తలు – వదంతులేనని ఖండించిన ఉపరాష్ట్ర పతి కార్యాలయం

వెంకయ్యే కాబోయే రాష్ట్రపతి అంటూ వార్తలు – వదంతులేనని ఖండించిన ఉపరాష్ట్ర పతి కార్యాలయం

రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరును ప్రతిపాదించారంటూ వస్తున్న వార్తల్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ఖండించింది. ఉదయం నుంచి సోషల్మీడియాలోనూ, పలు మీడియా చానళ్లలోనూ ఈ వార్త హల్ చల్ చేసింది. అయితే అవన్నీ వదంతులేనని ఉపరాష్ట్రపతి కార్యాలయం ఖండించింది. 2022 నాటికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. దీంతో తదుపరి రాష్ట్రపతి ఎవరనేదానిపై చర్చ నడుస్తోంది. శరద్ పవార్, మాయావతి, గులాంనబీ ఆజాద్ లు రాష్ట్రపతి రేసులో ఉన్నారని మొన్నటివరకు చర్చ నడిచింది.