Saturday, March 19, 2022

తెగిన బంధం - ఆపరేషన్ కమలం ఆట....మైహోం, కేసీఆర్ లడాయిమధ్యలో చిన్నజీయర్

Courtesy by : Q Group Media (తీన్మార్ మల్లన్న)

తెగిన బంధం - ఆపరేషన్ కమలం ఆట....మైహోం, కేసీఆర్ లడాయి
మధ్యలో చిన్నజీయర్
ఆపరేషన్ కమలం ఆట
మోడీ దెబ్బకు కేసీఆర్ విలవిల
ప్రెస్ మీట్ తో బట్టబయలు
త్వరలో మై హోంకు రాజ్యసభ
బ్యాక్ స్టెప్ లో ప్రశాంత్ కిషోర్
శనార్తి తెలంగాణ: ఒక్క టూర్ తో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టారు మోడీ షాల జోడి.. ముచ్చింతల్ సమతామూర్తి ఓపెనింగ్ టూర్ తో కేసీఆర్ మైహోంల బంధం దాదాపుగా తెగిపోయింది.. ఇన్నిరోజులు ఆధ్యాత్మిక ఆత్మియుడిగా ఉన్న చిన్నజీయర్ సైతం కేసీఆర్ తో కయ్యానికి దిగిపోయాడు.. కేసీఆర్ కు పవర్ ఫుల్ సెంటర్లుగా ఉన్న మై హోం.. చిన్నజీయర్లు దూరం కావడంతో కేసీఆర్ ప్రతిక్షణం ఆందోళన పడుతున్నట్టు తెలుస్తుంది.. కేసీఆర్ కు సంపదను కొల్లగొట్టడం తెలిస్తే.. ఆ కొల్లగొట్టిన సంపద ఏ రూంలో దాచారో ఆ రూంకు తాళం వేయడం మోడీషాలకు తెలిసిన జిమ్మిక్కు..

ఇంతకీ ఏమైంది..?
సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మోడీని.. వేడుకలకు రావలసిందిగా అమీత్ షాను ఆహ్వానించారు మైహోం రామేశ్వర్ రావు, చిన్నజీయర్ ఉమ్మడిగా.. ఈ కార్యక్రమానికి ఓకే చెప్పిన మోడీషా ఉద్దండులు వేడుకను సరిగ్గా వాడేసుకున్నారు.. సమతామూర్తి ఓపెనింగ్ శిలాఫలకంపై కేసీఆర్ పేరు ఉండొద్దు అని అమీత్ షా చేసిన సూచనను కాదనలేకపోయిన జీయర్.. మోడీ మరియు తన పేరుతో సరిపెట్టాడు.. అప్పటివరకు విగ్రహ ఏర్పాట్లు మంచి చెడూ చూస్తూ వచ్చిన కేసీఆర్ కు కోపం తెప్పించింది.. ఆక్షణం నుండి ముచ్చింతల్ కు వెళ్లడం బందు పెట్టాడు కేసీఆర్.. ఒక్క ప్లాన్ తో మై హోం, జీయర్ లకు కేసీఆర్ ను దూరం చేశాడు.. విషయం తెలిసిన వెంటనే బడ్జెట్ పేరుతో ప్రెస్ మీట్ పెట్టినా అసలు విషయం మాత్రం ఈ వ్యవహారమే అనేది కొందరికి మాత్రమే తెలుసు.. తన అధికార పీఠానికి మూల స్థంభాలుగా భావించిన జీయర్, మై హోంలను కేసీఆర్ కు దూరం చేశారు.. యాదాద్రి ఆయల నిర్మాణం.. పేరు మార్పు దగ్గరి నుండి పర్యవేక్షించిన జీయర్ ను ఏకంగా యాదాద్రి ఓపెనింగ్ కే పిలవకుండా దూరం పెట్టేశాడు.. ఇదే అంశంపై జీయర్ ను విలేకరులు ప్రశ్నించగా దూరం ఉండేవాళ్ల ఖర్మ అంటూ కుండబద్దలు కొట్టాడు..

మోడీ దెబ్బకు కేసీఆర్ విలవిల
తెలంగాణ రాష్ట్రంలో పాగావేయాలని తహతహగా ఉన్న బీజేపీ ఆటను ఎప్పుడో మొదలు పెట్టింది.. కేసీఆర్ ప్రధాన వనరులపై దృష్టి పెట్టి ఆట ప్రారంభించింది.. కేసీఆర్ శక్తులు ఎక్కడున్నాయో కనుక్కోని మరీ వేట ప్రారంభించింది.. కేసీఆర్ బినామీ ఆస్తులపై ఓవైపు ఐటీ సోదాలు జరుగుతుండగా ఆప్తుల మధ్య గ్యాప్ పెంచింది.. దేశంలో మోడీషాల జోడీని ఎదుర్కోని వాళ్ల వ్యూహాలను కనిపెట్టడంలో కేసీఆర్ ఇంకా మెర్చ్యూర్ కాలేదు.. తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ ను డీలా చేసి బీజేపీని డెవలప్ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్లీ గట్టెక్కుతాననుకున్న కేసీఆర్ వ్యూహానికి ఈ రకంగా చెక్ పెట్టారు మోడీషా.. కేసీఆర్ నమ్మకున్నవారిని ఒక్కొక్కరిని బుట్టలో వేసుకుంటూ వస్తున్నారు..

త్వరలో మైహోం రాజ్యసభకు
మైహోం చేత టీవీ9 గ్రూప్.. ఎన్టీవీ, టెన్ టీవీ ఛానెళ్లను కొనిపిచ్చిన కేసీఆర్ వాటి ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాలని కళకన్నాడు.. కానీ ఈ విషయాన్ని ముందే పసిగట్టిన కేంద్రం మాయల ఫకీరు ప్రాణాలు చిలుకలో ఉన్నట్టు.. కేసీఆర్ ప్రాణాలు మై హోంలో ఉన్న విషయం గమనించి మై హోంకు బీజేపీ తీర్థం తాగించే పని మొదలు పెట్టారని తెలిసింది.. ఇందుకోసం మై హోంకు రాజ్యసభ సీటు ఆఫర్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.. ఇక మై హోం కూడా రాజ్యసభ వ్యవహారాన్ని చూడాల్సిందిగా.. టీవీ9 భరత్ వర్ష్ డైరెక్టర్ గా పనిచేస్తున్న హేమంత్ శర్మకు అప్పగించినట్టు సమాచారం.. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలనే భేటీ అయిన హేమంత్ శర్మ.. సీటు కన్ఫర్మేషన్ విషయాన్ని మై హోంకు చెప్పినట్టు అత్యంత కీలక సమాచారం..

ఏకు మేకైంది
ఏలు పెట్టె సందిస్తే కాలు పెట్టే బ్యాచ్ మోడీ, అమీత్ షాది అలాంటి వారిని కూడా ఫూల్స్ ను చేయాలని ప్రయత్నించిన కేసీఆర్ బొక్కబోర్లా పడ్డాడు.. రాష్ట్రంలో అధికారంనేను తీసుకుంట కేంద్రంలో మీకు సహకరిస్తా అనే సూత్రాలు ఇంటర్నల్ మీటింగ్ లో చెప్తూ వస్తున్న కేసీఆర్ కు పూర్తిగా చదివేశారు మోడీ షాలు.. వలలో చిక్కేవరకు రానిచ్చారు.. అక్వేరియంలో పెంచుతారని ఆశపడ్డ కేసీఆర్ కు.. అది కర్రీకి సిద్దమైన సంగతి ఇటీవలే బోధపడింది.. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ కంపెనీకి చెక్ పెట్టి కుర్చింది బీజేపీ..

చేతులెత్తేశిన ప్రశాంత్ కిషోర్
ఎలాగైనా గట్టెక్కిస్తాడనుకున్న ప్రశాంత్ కిషోర్ సైతం మోడీ షాల దెబ్బకు గిలగిల కొట్టుకుంటున్నాడు.. ఓ వైపు ఉద్యోగాల భర్తీ , అభివృద్ధి పనుల డ్రామాకు తెరలేపినా.. మోడీ షాలు మొదళ్ల నుండి నరుక్కుంటూ వస్తుండడంతో ప్రశాంత్ కిషోర్ సైతం చేతులెత్తేశినట్టు తెలుస్తుంది.. కేంద్రం సహకరిస్తుంది.. నిలువరించాల్సింది కాంగ్రెస్ నే అంటూ ఇన్నాళ్లు పీకేకు చెప్పుకుంటూ వచ్చిన కేసీఆర్.. తీరా బీజేపీ ఫ్లెట్ ఫిరాయించడంతో పీకే కూడా కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.. ఇటీవల ఒక నేషనల్ మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన పీకే టీఆర్ఎస్ అసైన్ మెంట్ కు సంబంధించి ఇంకా కుదరలేదన్న వ్యాఖ్యలు చేశారు.. మొత్తానికి మోడీ, షా సైలెంట్ గా వాయ్ లెంట్ స్టార్ట్ చేశారు.. ఇది జనానికంటే ముందు.. కేసీఆర్ అండ్ కంపెనీకి అర్థమైంది గంతే.. జనానికి తెలియడానికి మరికొన్నిరోజులు సమయం పట్టే అవకాశం ఉంది.
 

Friday, March 18, 2022

అమెరికా టూర్ కు..... KTR

*అమెరికా టూర్ కు..... KTR*

హైదరాబాద్‌: రాష్ట్రానికి ఐటీ, పారిశ్రామిక పెట్టుబడుల సాధన కోసం మంత్రి కేటీఆర్‌ 10 రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు.శనివారం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలు దేరుతున్న కేటీఆర్‌ బృందం ఈ నెల 29 వరకు అమెరికాలోని తూర్పు, పశ్చిమ కోస్తా ప్రాంతాల్లో పర్యటించనుంద. కేటీఆర్‌ బృం దంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి నాగప్పన్, ఎలక్ట్రానిక్స్‌ డైరెక్టర్‌ సుజయ్‌ కారంపూరి ఉన్నారు.

లాస్‌ ఎంజిలెస్‌తో మొదలయ్యే కేటీఆర్‌ పర్యటన 20న శాండియాగో, 21న శాన్‌జోస్, 24న బోస్టన్, 25న న్యూయార్క్‌లో కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ప్రముఖ సంస్థల అధిపతులు, సీఈవో లతో కేటీఆర్‌ భేటీ అవుతారు

link Media ప్రజల పక్షం🖋️ 

ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించనున్న....... కేజ్రీవాల్

*ఏప్రిల్ 14  అంబేద్కర్ జయంతి రోజున తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించనున్న....... కేజ్రీవాల్!*

*ఢిల్లీ....!*
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి మంచి ఉత్సాహంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ  ఇప్పుడు ఇతర రాష్ట్రాలపైదృష్టి పెట్టింది. ఈ ఏడాది చివర్లో జరిగే  అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది.ఇదే సమయంలో దక్షిణాదిలోనూ పార్టీని విస్తరించాలని భావిస్తుంది. త్వరలోనే ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో కేజ్రీవాల్ హైదరాబాద్ కు రానున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పాదయాత్ర ప్రారంభించనున్నట్లు పేర్కొన్నాయి.

తెలంగాణ యువతతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల మద్దతు ఆప్ కు ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కార్యక్రమం కోసం ఆప్ ఇప్పటికే తెలంగాణా సెర్చ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోఆమ్ ఆద్మీ పాదయాత్రలు చేపట్టనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. తెలంగాణ లో వచ్చే ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలతోనే ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణాదిలో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. ఆప్ తెలంగాణ ఇన్చార్జిగా సోమనాథ్ భారతిని నియమించారు. త్వరలోనే ఆయన రాష్ట్రానికి వచ్చి పాదయాత్ర ఏర్పాట్లు చూడనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

link Media ప్రజల పక్షం🖋️ 

Thursday, March 17, 2022

హిందూ మారణహోమం – కాశ్మీర్ ఫైల్స్ – ప్రజల చలనచిత్రం

హిందూ మారణహోమం – కాశ్మీర్ ఫైల్స్ – ప్రజల చలనచిత్రం

Wednesday, March 16, 2022

24 గంటల్లో.. 4 లక్షల కేసులు: కరోనా మళ్లీ..!!

24 గంటల్లో.. 4 లక్షల కేసులు: కరోనా మళ్లీ..!!

దక్షిణ కొరియాలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్క రోజులోనే 4,00,741 కొవిడ్ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,629,275 కు చేరినట్టు అధికారులు తెలిపారు.

అంతకు ముందు రోజు కొవిడ్ కేసుల సంఖ్య 362,329గా ఉందని అధికారులు తెలిపారు. ఒక్క రోజులో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదుకావడం పట్ల అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ వల్ల సియోల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇటీవల కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్నట్టు అధికారలు వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసుల్లో 81,395 సియోల్ నుంచే నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది.

ఇక కొత్తగా జియోంగ్గీ ప్రావిన్స్ లో 94,806, పశ్చిమ ఓడరేవు నగరమైన ఇంచియాన్‌లో 28,453 కొవిడ్ కేసులు నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. తాజాగా వైరస్ బారిన పడి 293 మంది మరణించడం అధికారులను కలవర పెడుతోంది.

Osmansagar, Himayatsagar may meet the same fate of Hussainsagar, fear officials

Osmansagar, Himayatsagar may meet the same fate of Hussainsagar, fear officials

If GO 111 is scrapped, the twin reservoirs are likely to meet the fate of Hussainsagar which has become completely polluted and its water unfit for consumption.

Courtesy by : THE NEW INDIAN EXPRESS Twitter By S Bachan Jeet Singh

HYDERABAD: With Chief Minister K Chandrasekhar Rao announcing in the Assembly that GO 111 would be scrapped as it has become redundant, both serving and retired officials expressed concern over the serious impact on the 100-year-old twin reservoirs Osmansagar and Himayatsagar due to the imminent large-scale urbanisation within the 10 km buffer zone. 

About 1,32,000 acres covering 84 villages in the mandals of Shamshabad, Shabad, Rajendranagar, Chevella, Moinabad and Shankarapally, which hold huge real estate potential owing to their proximity to IT corridors, come under the purview of GO 111, issued on March 8, 1996. If GO 111 is scrapped, the twin reservoirs are likely to meet the fate of Hussainsagar which has become completely polluted and its water unfit for consumption. The GO was issued mainly to stop construction activities like industries, major hotels, residential colonies and other polluting establishments within the 10 km radius of the reservoirs.

The reservoirs are the major drinking water source for the people of the twin cities even today as Hyderabad Metropolitan Water Supply and Sewerage Board (HMSW&SB) draws 30 million gallons of water per day (MGD) from them through gravity. 

Constructions will also block flow of rainwater from catchment areas into the reservoirs. Lifting of the ban on constructions would also increase commercial engagements, transform the residential projects in the nearby villages and chances are that it would threaten the ecological balance through encroachments and pollution.

A retired officer said that Bharat Ratna awardee Mokshagundam Visvesvaraya had designed these reservoirs as Flood Protection Reservoirs to deal with floods in Musi and later used as drinking water sources for the city. The government should drop the idea of scrapping the GO 111, he said.

భగవంత్ మాన్ అనే నేను..!

భగవంత్ మాన్ అనే నేను..!

Courtesy by : తొలివెలుగు మీడియా website

పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవత్ మాన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేయించారు.
సీఎం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం ఖట్కాడ్ కలాన్ లో ఘనంగా ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఇతర సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు.
మీరంతా (కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు) అహంకారాన్ని ప్రదర్శించవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు ఓటు వేయని వారిని సైతం మనం గౌరవించాలి. మీ అందరికీ నా ధన్యవాదాలు” అని అన్నారు.