Saturday, February 19, 2022

నేడు బహుజన బిడ్డ, తెలంగాణ అమర వీరుడు సిరిపురం యాదయ్య వర్దంతి.

*నేడు బహుజన బిడ్డ, తెలంగాణ అమర వీరుడు సిరిపురం యాదయ్య వర్దంతి. ఈ మహనీయుడి గొప్ప త్యాగానికి జోహార్లు తెలువుతుంది ప్రజా సంకల్పం & link Media 🎉🙏. కాని నేడు తెలంగాణలో త్యాగం ఒకరిది. భోజ్యం మరొకరిది. #Telangana ను కాపాడుకోవాలి అంటే గడీల-కుటుంబపాలన నుండి విముక్తి చేయడమే ఈ మహనీయుడికి మనమిచ్చే ఘనమైన నివాళి🙏🏼... Bplkm*                                          

*Copy to Group link Media*                             20/02/2022  prajasankalpam1.blogsot.com

The Election Commission of India ordered the Telangana state Chief Electoral Officer to register an FIR against BJP MLA T. Raja Singh

The Election Commission of India ordered the Telangana state Chief Electoral Officer to register an FIR against BJP MLA T. Raja Singh for his statements threatening voters in UP 

#RajaSingh #caseagainstBJPMLA 

https://t.co/bJ7MyeoxmZ

*Telangana SEC ordered to register FIR against BJP MLA Raja Singh* - https://www.deccanchronicle.com/nation/politics/200222/telangana-sec-ordered-to-register-fir-against-bjp-mla-raja-singh.html

మార్చి 4 వరకు సెలవులో డీజీపీ మహేందర్ రెడ్డి..అప్పటి వరకూ ఏసీబీ డీజీగా ఉన్న అంజనీకుమార్​ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు

*Q న్యూస్*
*ప్రశ్నించే గొంతుక*

మార్చి 4 వరకు సెలవులో డీజీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్​రెడ్డి సెలవుపై వెళ్లారు. ఆరోగ్య కారణాల రీత్యా ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4 వరకు రెండు వారాల పాటు సెలవు పెట్టారు. అప్పటి వరకూ ఏసీబీ డీజీగా ఉన్న అంజనీకుమార్​ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే, అంజనీకుమార్​ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆయన వచ్చేవరకు పూర్తి అదనపు బాధ్యతలను అంజనీకుమార్ చేపట్టనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.
డీజీపీ సెలవు.. కారణం అదేనా?...
ఒకవైపు పోరుగు రాష్ట్రం ఏపీలో సైతం డీజీపీని అనూహ్యంగా మార్చటం.. ఈ సమయంలోనే.. డీజీపీ మహేందర్ రెడ్డి సెలవుపై వెళ్లటంతో.. కారణం ఏమిటి? అసలేం జరిగింది? అన్న అంశంపై ఆరా తీస్తే.. అసలు విషయాలు బయటకు వచ్చాయి. మొన్న గురువారం రాత్రి ఆయన తన ఇంట్లోని బాత్రూంలో జారి పడినట్లుగా విశ్వాసనీయ సమాచారం. దీంతో ఆయన ఎడమ చేయికి గాయమైందని.. డాక్లర్లు కొద్ది రోజులు ఆయన్ను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారని.. అందుకే, ఆయన ఓ పదిహేను రోజుల పాటు మెడికల్ లీవు తీసుకున్నారని పోలీసుల వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అప్పటివరకు
ఆయన స్థానంలో డీజీపీగా అంజనీ కుమార్ కు పూర్తి బాధ్యతల్ని అప్పగిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 

Telangana: SSC students to have 50 per cent choice in questions in public exams in this year

Telangana: SSC students to have 50 per cent choice in questions in public exams in this year

Courtesy by : Roja Mayabrahma
Hans News Service | 18 Feb 2022


The Telangana Board of Secondary Education has decided to provide 50 per cent choice in questions in public exams to the Class 10 students this year. The choices will be provided to the theory sections of the question papers. However, no choice will be given in the objective part. According to an official, there will be a choice of 50 per cent in the questions in this year's SSC Examinations and the students can check the model question papers on the website of the State Council of Educational Research and Training.it has to be noted that the only 70 per cent of syllabus will be given for SSC exams 2022 in all subjects and there will be only six papers instead of the regular 11 papers. The exams will begin with the First Language paper (Group A), First Language Paper-I (Composite course) and First Language Paper-II (Composite course) on May 11 and conclude with Social Studies paper on May 17, the OSSC Main Language Paper-I (Sanskrit & Arabic), OSSC Main Language Paper-II (Sanskrit & Arabic) and SSC Vocational course (theory) will be held on May 18, 19 and 20 respectively.So far, 4.81 lakh Class X students have registered themselves for the exams. Students who have not paid the exam pay can also pay it now with a late fee of Rs 50 and Rs 200 till February 24 and March 4 respectively. The fee will also be accepted with a late fee of Rs 500 up to March 14. Last year, a total of 5.16 lakh students had paid the exam fee last year. However, the exams were not conducted due to the pandemic and all the students were declared as passed.

కాంగ్రెస్ పార్టీని వీడకుండా MLA.జగ్గారెడ్డికి బుజ్జగింపు ప్రయాత్నాలు మొదలయ్యాయి.

*కాంగ్రెస్ పార్టీని వీడకుండా MLA.జగ్గారెడ్డికి బుజ్జగింపు ప్రయాత్నాలు మొదలయ్యాయి.*

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు కలిశారు. కాంగ్రెస్‌కు దూరం కావొద్దని జగ్గారెడ్డికి వీహెచ్‌ విజ్ఞప్తి చేశారు. పార్టీలోనే ఉంటూ అన్యాయాలపై కొట్లాడాలని సూచించారు. కార్యకర్తలతో మాట్లాడి తదుపరి నిర్ణయం వెల్లడిస్తానని జగ్గారెడ్డి ఈ సందర్భంగా వీహెచ్‌కు తెలిపారు. మరోవైపు  పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్‌ జగ్గారెడ్డి కాళ్లు పట్టుకొని బతిమిలాడటం గమనార్హం. పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

‘నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పార్టీలో కొందరు కుట్రలు చేశారు. నేను పార్టీ కోసం ఎంతగానో పనిచేసినా అవమానించారు. తట్టుకోలేకే పార్టీని వీడాలని నిర్ణయం తీసుకుంటున్నా’ అని జగ్గారెడ్డి నిన్న మీడియాకు వివరించారు. ఇవాళ రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి సమర్పిస్తానని చెప్పిన విషయం తెలిసిందే.

మరోవైపు సామాజిక మాధ్యమాల్లో తనపై, జగ్గారెడ్డిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వీహెచ్‌ అన్నారు.

తెరాసలో చేరుతున్నట్లు తమ ఫొటోలు మార్ఫింగ్‌ చేశారని చెప్పారు. తెరాసకు అనుకూలంగా పని చేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసి దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేటట్లు కోరతానని వీహెచ్‌ చెప్పారు. ఈ సందర్భంగా వీహెచ్‌ జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.

*link Media ప్రజల పక్షం🖋️* 

Thursday, February 17, 2022

ఎన్.టి.ఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, శ్రీమతి నారా భువనేశ్వరి పత్రిక ప్రకటన

*హైదరాబాద్*

_*ఎన్.టి.ఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, శ్రీమతి నారా భువనేశ్వరి పత్రిక ప్రకటన వివరాలు..*_

*ప్రతిభ గల ఇంటర్ సెకండియర్ మరియూ CBSC -2 విద్యార్థినులకు ఎన్.టి.ఆర్ ట్రస్ట్ స్కాలర్షిప్ టెస్ట్ NTR GEST (Girls' Education Scholarship Test for Degree Courses) - 2022*

★ ఎన్.టి.ఆర్ విద్యాసంస్థలు డిగ్రీ విద్యార్థినులకు ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం మార్చి 20-03-2022 న NTR GET నిర్వహించనున్నట్లు ఎన్.టి.ఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు తెలియచేశారు. 

★ ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్.టి.ఆర్ విద్యాసంస్థల ద్వారా రూ.34 లక్షల వరకు ఉపకారవేతనం అందజేయబడుతుంది. 

★ ఈ క్రమంలో మొదటి 10 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు 5 వేల రూపాయల చొప్పున, తరువాతి 15 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు 3 వేల రూపాయల చొప్పున ఎన్.టి.ఆర్ బాలికల డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసే వరకు ఇవ్వబడును. 

★ ఈ సదవకాశాన్ని ఇంటర్ సెకండియర్ మరియు CBSC 12వ తరగతి చదువుతున్న బాలికలందరూ వినియోగించుకోవలసినదిగా తెలియజేయడమైనది.

★ ఆసక్తి గల విద్యార్థినులు వెబ్ సైట్ www.ntrtrust.org లో 17.02.2022 నుండి 15.03.2022 వరకు నమోదు చేసుకోవొచ్చును.

★ ఇతర వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించగలరు.

*మొబైల్ నెంబర్:* *7660002627/28*

తెలంగాణ ద్రోహి దివస్.. ట్విట్టర్ లో ట్రెండింగ్..!

తెలంగాణ ద్రోహి దివస్.. ట్విట్టర్ లో ట్రెండింగ్..!

Courtesy by : తొలివెలుగు మీడియా ట్విట్టర్

- ప్రపంచ మోసగాళ్ల దివస్ కూడా!
– కొండా విశ్వేశ్వర్ రెడ్డి హ్యాష్ టాగ్ !
– ఆరంభంలో కేసీఆర్ బర్త్ డేనే ఫస్ట్…
– రెండో స్థానంలో ద్రోహి దివస్
– క్రమంగా ఐదో స్థానానికి బర్త్ డే ట్యాగ్
– రగిలిపోయిన తెలంగాణ నిరుద్యోగులు
– గులాబీ ఫ్లెక్సీలమయంగా తెలంగాణ
– కాంగ్రెస్ నిరసనలు..నిరుద్యోగుల మద్దతు
– ఎక్కడికక్కడ అరెస్టులు, గృహనిర్బంధాలు

టీఆర్ఎస్ నాయకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన వారి అధినాయకుడి జన్మదిన వేడుకలు..తెలంగాణవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి.ఏడేళ్ పాలనలో జనాన్నిమోసం తప్ప మరేమీ చేయని కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భారీ ఎత్తున నిరసనలు తెలియచేయాలన్నపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపుమేరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ వీలైతే అక్కడ నిరసనలకు దిగారు. కొన్నిచోట్ల గాడిదలతో కేక్ కట్ చేయించే సీన్ లు ఏర్పాటుచేశారు.అటు.. ఉద్యోగాల్లేక, నోటిఫికేషన్లు రాక కడుపుమంటతో రగిలిపోతున్న నిరుద్యోగులు,విద్యార్థులు ..ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా సహా రాష్ట్రమంతటా కేసీఆర్ దిష్టిబొమ్మల్నిదగ్ధం చేసే ప్రయత్నం చేశారు.అటు..రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలను, కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు

రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలను, కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.

మరోవైపు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్ని ఎంతో అట్టహాసంగా జరుపుకున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. రాజధాని హైదరాబాద్ లోని ప్రతీ జంక్షన్ లో పెద్ద పెద్ద కటౌట్స్, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జిల్లాల్లోనూ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఇటు సోషల్ మీడియాలోనూ కేసీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువ కొనసాగింది.దీంతో హ్యాపీ బర్త్ డే కేసీఆర్ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నిలిచింది.అయితే..దీనికి పోటీగా తెలంగాణ ద్రోహి దివస్ అనే హాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ అయింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి..కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.తెలంగాణ ద్రోహి దివస్,ప్రపంచ మోసగాళ్ల దినోత్సవం అంటూ రెండు హాష్ ట్యాగ్స్ ను పెట్టి.. ప్రజలే నిర్ణయించండి అని కేసీఆర్ ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఎక్కువమంది తెలంగాణ ద్రోహి దివస్ కే జై కొట్టారు.దీంతో అది ట్రెండింగ్ లో నిలిచింది.