Thursday, June 10, 2021

తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి జ‌ర్న‌లిస్ ర‌ఘు భార్య లేఖ‌

హైదరాబాద్ : 10/06/2021

తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి జ‌ర్న‌లిస్ ర‌ఘు భార్య లేఖ‌

తొలివెలుగు మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)

గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ తెలంగాణ గారికి…

విషయం- నా భర్త గంజి రఘును అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా కిడ్నాప్ చేసి… అధికార పార్టీ ఒత్తిళ్లతో అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవటంతో పాటు, రఘును హత మార్చే కుట్రలపై వెంటనే మీ జోక్యం గురించి.

గౌరవ న్యాయమూర్తి గారు..
నా భర్త సీనియర్ జర్నలిస్టుగా ఎందరో రాజకీయ నాయకుల అవినీతి, ప్రభుత్వ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నల పాలకపక్ష నేతల సన్నిహితుల వల్ల ఇబ్బందులకు గురవుతున్న వారి బాధలను వెలుగులోకి తెస్తున్నాడు. దానిలో భాగంగానే నల్గొండ జిల్లా హుజుర్ నగర్ లో బాధితులు నిర్వహిస్తున్న కొన్ని కార్యక్రమాల కవరేజ్ చేశాడు.
అయితే, ఈనెల 3న ఉదయం 9గంటలకు నా భర్త నిత్యావసరాలు, పండ్ల కోసం మల్కాజ్ గిరిలో బయటకు వెళ్లాడు. మల్కాజ్ గిరిలో రోడ్డు పక్కన ఉదయం 9.46నిమిషాలకు మామిడి పండ్లు కొనుగోలు చేస్తున్న సమయంలో సివిల్ దుస్తుల్లో ఉన్న కొందరుఉ గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి మాస్కులు పెట్టుకొని నా భర్తను దౌర్జన్యంగా కారులోకి ఎక్కించుకొని వెళ్లిపోయారు. గంట దాటినా రఘు ఇంకా ఇంటికి రాకపోవటంతో నేను ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో రఘుకు ఏమైందో అన్న భయం పట్టుకుంది. నా కూతురు, నేను రఘు కోసం టెన్షన్ పడుతున్న సమయంలో నా భర్త స్నేహితుడు వచ్చి రఘును మెయిన్ రోడ్డుపై ఎవరో కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లినట్లు తెలిసిందని షాక్ కు గురిచేసే విషయం చెప్పాడు.

నా భర్తకు చాలా రోజుల నుండి అధికార పార్టీ నేతలు, పెద్ద మనుషులుగా చలామణిలో ఉన్న వారి తరఫు వారి నుండి బెదిరింపులు కాల్స్ వస్తుండేవి. దీంతో నా భర్త ప్రాణాలకు హాని ఉందని నా బంధుమిత్రులకు విషయం చెప్పాను. ఇంతకుముందు, పుప్పాలగూడ లో జరిగిన భూ ఆక్రమణలు, ఐడీపీఎల్-హిందుజా-గల్ఫ్ ఆయిల్స్ కు చెందిన దాదాపు 500ఎకరాల భూముల ఆక్రమణ, ఐకియాకు ఎదురుగా ఉన్న 43ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా వంటి విషయాలపై … నా భర్త ఆధారాలతో సహ బయటపెట్టే క్రమంలోనూ ఇలా బెదిరింపులు వచ్చాయి. ప్రజల సొమ్మును కాపాడే ప్రయత్నం చేసిన రఘును చంపేస్తామంటూ కొన్ని నెలలుగా బెదిరింపులు వచ్చినా రఘు ధైర్యంగా ముందుకు సాగాడు. హుజుర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి భూఆక్రమణల బాధితులుగా ఉన్న కొందరు గిరిజనుల కోసం రఘు పనిచేయటంపై రఘు పేరెత్తకుండానే… ఎమ్మెల్యే సైదిరెడ్డి మీడియా ముఖంగానే తీవ్రమైన హెచ్చరికలు చేశారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకవస్తున్నాను.

గౌరవ న్యాయమూర్తి గారు… నా భర్త కిడ్నాప్ అయ్యారని తెలియగానే తన జర్నలిస్టు మిత్రులంతా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. రఘు కిడ్నాప్ విషయం సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అయ్యింది. దీంతో మధ్యాహ్నం 1.30గంటలకు కొందరు పోలీసు అధికారులు మా ఇంటికి వచ్చి రఘును మఠంపల్లి పోలీసు స్టేషన్ లో నమోదైన క్రైం. నెం 20/2021లో అరెస్ట్ చేశామని, నల్గొండ జిల్లా మఠంపల్లి స్టేషన్ కు తరలించామని తెలిపారు. అయితే, ఈ నెల 8న బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నా భర్తను అడ్డగించి, బలవంతంగా కారులోకి ఎక్కించుకొని పోయినట్లు స్పష్టంగా కనపడింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో నా భర్త రఘు పండ్లు కొనుగోలు చేస్తున్న దృశ్యాలు, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రెడ్ టీషర్టులో ఒకరు, మరో టీషర్టులో ఒకరు ముఖానికి మాస్కులు పెట్టుకొని వచ్చి రఘు వెనుక నిలబడ్డారు. ఓ కారులో తనను ఎక్కించేందుకు ప్లాన్ చేయగా కుదరలేదు. ఆ వెంటనే మరో కారు వచ్చింది. దీంతో రఘు భుజాలను పట్టుకొని లాక్కెళ్లి, కారులో పడేసే ప్రయత్నం చేయటం… రఘు ప్రతిఘటిస్తున్న సమయంలో మరో వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకొని వారిక సహకరించినట్లు స్పష్టంగా కనపడింది. ఆ తర్వాత రెడ్ టీ షర్టులో ఉన్న వ్యక్తి రోడ్డుకు అటు వైపు ఉన్న కారులోకి ఎక్కి వెళ్లిపోయాడు. ఆ కిడ్నాప్ జరిగినప్పుడు ఉదయం 9.46 గంటలుగా టైం రికార్డయింది. వారు పోలీసులని తెలిసి నేను షాక్ అయ్యాను. వారిలో ఒక్కరు కూడా పోలీసు డ్రెస్సులో లేరు. పైగా ఆ రెండు కార్లు ఏపీ నెంబర్ ప్లేట్లతో ఉన్నాయి. పోలీసు వాహనాలు కూడా కాదు.

కిడ్నాప్ సమయంలో రికార్డయిన సీసీటీవీ ఫుటేజ్ కు సంబంధించిన ఫోటోలు, మీడియాలో వచ్చిన వీడియాలను కూడా జత చేస్తున్నాను. ఈ వీడియోలు చూస్తే దీన్ని అరెస్ట్ అని ఎవరూ అనరు అనే విషయం తెలిసిపోతుంది. దీన్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ అని ఎలా అంటారో… మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా బనానా రిపబ్లిక్ లో ఉన్నామో అన్న అనుమానం కలుగుతుంది. ఇలాంటి చట్టవ్యతిరేక పనులను అరెస్ట్ అంటూ చెప్తున్నారు.

గౌరవ న్యాయమూర్తి గారు… నా భర్త యొక్క జీవించే హక్కును, తన భావ ప్రకటన స్వేచ్ఛను హరించటం, జర్నలిస్టుగా తన ప్రశ్నించే హక్కును ఈ పోలీసులు, అధికార పార్టీ నాయకులు హరించి వేయలేరు. భూ కబ్జా దారులు, అధికార పార్టీ నాయకుల అవినీతిని వెలికితీస్తున్నందునే ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కాపాడాల్సిన వారే గుండాలుగా, దౌర్జన్యం చేస్తుండటంతో నా భర్త ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉంది. నా భర్తకు వారి నుండి ప్రాణహని ఉందని మీకు విన్నవించుకుంటున్నాను. పోలీసులు నమోదు చేసిన కేసు 07.02.2021లో దాదాపు నాలుగు నెలల పాటు ఆ కేసులో ఎలాంటి చర్య తీసుకోకుండా… ఇప్పుడు పట్టపగలు ప్రజలు చూస్తుండగా అపహరించారు. ఆ కేసును చూస్తే నా భర్తను కావాలనే కేసులో ఇరికించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. సీఆర్పీసీ 41బీ ప్రకారం పోలీసులు రూల్స్ కు విరుద్దంగా వ్యవహరించారు. అసలు వారు పోలీసులే అని గుర్తు పట్టేలా లేరు. వారు వాడిన వాహనాలు కూడా పోలీసు అధికారిక వాహనాలు కావు. పైగా సోషల్ మీడియాలో కిడ్నాప్ వ్యవహరం వైరల్ అయ్యే వరకు నాకు కానీ, మా కుటుంబ సభ్యులకు కానీ అరెస్ట్ విషయం చెప్పలేదు. నా భర్తను ఉదయం9.46కు ఎత్తుకెళ్లినట్లు స్పష్టంగా కనపడుతుండగా, మధ్యాహ్నం 1.30 గంటలకు మా ఇంటికి వచ్చిన పోలీసులు సీఆర్పీసీ 50(1) ప్రకారం మధ్యాహ్నం 12.45గంటలకు అరెస్ట్ చేశామని స్టేషన్ హౌజ్ ఆఫీసర్, మఠంపల్లి పేరుతో నోటీసులు ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహరంలో గతంలో సుప్రీంకోర్టు డీ.కే బసు వర్సెస్ బెంగాల్ రాష్ట్ర్రం కేసులో ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కారు. ఉదయం 10.30గంటలకు అరెస్ట్ అయిన వ్యక్తిని మధ్యాహ్నం 12.45గంటలకు అరెస్ట్ చేసినట్లు చూపటం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రసాదించిన ప్రాథమిక హక్కుకు భంగం కలిగించటమేనని స్పష్టంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను.

నా భర్త జీవించే హక్కును, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తుంది. ఓ జర్నలిస్టు గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. మరిన్ని కేసులు నమోదు చేసి ఎక్కువ కాలం జైల్లో ఉండేలా అక్రమ కేసులు నమోదు చేసే కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఈ చర్యల వల్ల మా కుటుంబం తీవ్ర మనోవేదనతో ఉంది.

గౌరవ న్యాయస్థానం, న్యాయమూర్తిగా మీరే మాకు న్యాయం చేయాలి. మీపై పూర్తి నమ్మకంతోనే ఈ లేఖ రాస్తున్నాను. నా భర్తను పోలీసులు, అధికార పార్టీ నేతల నుండి కాపాడాలని వేడుకుంటున్నాను. ఆరు సంవత్సరాల పాపతో ఇంట్లోనే ఉండే నాకు నా భర్తను కాపాడేందుకు మీరు తప్ప మరో దారి లేదు. మీరు వెంటనే జోక్యం చేసుకోకపోతే నా భర్త ప్రాణాలతో పాటు నాకు, నా పాపకు కూడా ప్రాణహని తలపెట్టే అవకాశం కూడా ఉంది. మీపై ఎన్నో ఆశలతో… ఈ లేఖ రాస్తున్నాను.

ధన్యవాదములు
ఇట్లు
గంజి లక్ష్మీ ప్రవీణ
w/o గంజి రఘు
మల్కాజ్ గిరి, హైదరాబాద్

Wednesday, June 9, 2021

`No superstitions please': Solar eclipse to occur on June 10, experts debunk unscientific theories

Hyderabad : 10/06/2021

`No superstitions please': Solar eclipse to occur on June 10, experts debunk unscientific theories

The first solar eclipse of the year will occur on June 10. However, this eclipse will not be visible in India. It will be visible in regions covering North America, Europe, northern Asia & the North Atlantic Ocean.


 (Twitter)

`No superstitions please: Solar eclipse to occur on June 10, experts debunk unscientific theories

Hyderabad: The first solar eclipse of the year will occur on June 10. However, this eclipse will not be visible in India. It will be visible in regions covering North America, Europe, northern Asia & the North Atlantic Ocean.

The last `Annual Solar Eclipse', which was visible in India, occurred on June 21, 2020. The partial solar eclipse will occur on Oct 25, 2022. It will be visible in India. As per Indian Standard Time, the eclipse shall begin at 1.42 p.m. and end at 6.41 p.m. The maximum phase of the eclipse will be at 4.12 p.m.

Earlier on May 26, 2021, there was a total lunar eclipse, On November 19, there will be a partial lunar eclipse and on December 4, 2021, there will be a total solar eclipse.

There are different superstitions associated with eclipses

During Eclipse events various rituals have been followed in India traditionally. Particularly when an eclipse is visible, pregnant women are restricted from certain chores and rituals. However, though eclipse June 10 will not visible in India, social media is abuzz with the restrictions to be followed by expecting mothers.

Fear of harm to an unborn child leading to Cleft Palate and other kinds of deformities are being promoted unscientifically.

"Cleft palate is known as भंग तालुin Hindi గ్రహణం మొరర్ ి in Telugu is an opening or split in the roof of the mouth that occurs when the tissue doesn't fuse together during development in the womb," said N Raghunandhan Kumar- Secretary planetary society of India.

He further added, a cleft palate often includes a split (cleft) in the upper lip (cleft lip) but can occur without affecting the lip. It's interesting to note World Health Organization (WHO) never in the past declared Eclipse as a Pandemic or Disease-causing event or never issued any health notification for women in India or across the world to follow during the eclipse. Similarly, the health department never said eclipse can endanger an unborn child.

Planetary Society of India said cleft pallet is a health disorder and solar or lunar eclipses do not cause this defect. In fact, not taking food or medicine on time, restricting a woman from attending natural calls, and subjecting her to stay put in the same pose/position throughout the duration of the eclipse may lead to complications. During the eclipse, pregnant women should conduct their activities like any other day and not believe in unscientific theories.

On May 26, the lunar eclipse occurred in India. What is interesting is though the lunar eclipse was visible in various parts of the country no traditions like the closure of temples were followed.

Nor Astrologers/Pandits prescribed any rituals to follow by the general public. Lunar Eclipse was visible ranging from 2 minutes in Puri to 45 Minutes in Port Blair. Hence, asking pregnant women to follow unscientific practices during the eclipse is completely wrong

తెలంగాణ మానవ హక్కుల కమీషన్ లో.....జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్‌పై విచారణ జరిపించాలి

హైదరాబాద్ : 09/06/2021

*Q News* (తీన్మార్ మల్లన్న)

*జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్‌పై విచారణ జరిపించాలి*
హైదరాబాద్: జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్ వ్యవహారంపై మానవహక్కులను ఉల్లంఘించిన పోలీసులపై విచారణ జరిపించాలని కోరుతూ టీ. జ‌ర్న‌లిస్టుల ఫోరం(టీజేఎఫ్), టీడబ్ల్యూజేఎఫ్ సంఘాల జ‌ర్న‌లిస్టులు *మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యకి విజ్ఞ‌ప్తి చేశారు*. ఈ మేర‌కు టీజేఎఫ్ అధ్యక్షుడు పల్లె రవి కుమార్, *సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి*, టీడబ్లుజేఎఫ్ అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య తదితరులు మానవహక్కుల కమిషన్ సెక్ర‌ట‌రీ విద్యాధ‌ర్ భ‌ట్ చ‌క్ర‌హ‌రికి లేఖ అందజేశారు. హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన తొలి వెలుగు జర్నలిస్ట్ గంజి రఘును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, రఘు కుటుంబానికి న్యాయం చేయాలని ఈ విషయంలో జోక్యం కోరుతూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన జర్నలిస్టులం తీవ్ర ఆవేదనతో ఈ లేఖ రాస్తున్న‌ట్టు తెలిపారు. "ప్రజల పక్షాన నిలిచి అవినీతి అక్రమాలను వెలుగులోకి తెచ్చిన పాపానికి జర్నలిస్ట్ రఘును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. జర్నలిస్ట్ రఘు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చాలా అమానుషంగా ఉంది. జూన్ 3వ తేదీన మార్కెట్లో పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇంటి నుండి వెళ్ళిన రఘును మఫ్టీలో వచ్చిన పోలీసులు వెంబడించి బలవంతంగా అరెస్ట్ చేసి కారులో తీసుకు వెళ్లారు. రఘును ఎవరు తీసుకు వెళ్లారో ఎక్కడికి తీసుకెళ్లారో తెలియకపోవడంతో తోటి జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సూర్యాపేట జిల్లా గుర్రంపోడు భూముల వ్యవహారంలో బాధితుల పక్షాన నిలిచి జర్నలిస్టుగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడమే రఘు చేసిన నేరమనుకుంటే చట్టపరంగా అరెస్ట్ చేయాల్సి ఉండేది. రఘుకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అసలు వచ్చిన వారు పోలీసులా? లేకా? ప్రైవేట్ గుండాలా? అనేది తెలియకుండా మఫ్టీలో వచ్చి నడి రోడ్ పై అందరూ చూస్తుండగా బలవంతంగా ఎత్తుకెళ్లిన దృశ్యాలకు సంబంధించిన ఫూటేజీలు కూడా ఉన్నాయి. గుర్రంపోడు భూముల విషయంలో రఘుపై మోపిన కేసులు పూర్తిగా అక్రమమైనవి. జర్నలిస్టుపై తప్పుడు కేసులు పెట్టి కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వకుండా పట్టుకెళ్లడం పూర్తిగా అమానుషం. చట్టం పరిధిలో చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు చట్టాన్ని పాటించకుండా అన్యాయంగా అక్రమంగా రఘును అరెస్ట్ చేసి మానవ హక్కులకు విఘాతం కల్పించారు. రఘు అక్రమ అరెస్ట్ రాష్ట్రంలో జర్నలిస్టులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. రఘు అక్రమ అరెస్ట్ వ్యవహారంపై మానవహక్కులను ఉల్లంఘించిన పోలీసులపై విచారణ జరిపించాలని అక్రమంగా అరెస్ట్ అయిన జర్నలిస్ట్ రఘుకు న్యాయం చేయాలని కోరుతున్నాము." అంటూ లేఖ రాసి మానవహక్కుల కమిషన్‌కు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు పాశం యాదగిరి, టీ-జ‌ర్న‌లిస్టుల ఫోరం అధ్య‌క్షుడు పల్లె రవి కుమార్, ఉపాధ్యక్షుడు స‌తీష్ క‌మ‌ల్, రాష్ట్ర కార్యదర్శి కోడికంటి శ్రీ‌నివాస్, తెలంగాణ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టు ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు మామిడి సోమ‌య్య‌, ప్రధానకార్యదర్శి బ‌స‌వ పున్న‌య్య‌, జ‌ర్న‌లిస్టు నేతలు స్వామి ముద్దం, పోగుల ప్ర‌కాశ్, పాల‌కూరి రాజు, పిల్లి రాంచంద‌ర్,
త‌దిత‌రులు పాల్గొన్నారు.

ప్ర‌ధాని మోడీకి జ‌ర్న‌లిస్ట్ ర‌ఘు భార్య లేఖ‌

హైదరాబాద్ : 09/06/2021

Q News సౌజన్యంతో (తీన్మార్ మల్లన్న)

ప్ర‌ధాని మోడీకి జ‌ర్న‌లిస్ట్ ర‌ఘు భార్య లేఖ‌
మాన్యశ్రీ నరేంద్రమోదీజీ,

గౌరవనీయ భారత ప్రధానమంత్రి, న్యూఢిల్లీ

ఆదరణీయ మోదీజీ,

విషయం: నా భర్త రఘు గంజి, జర్నలిస్ట్ కిడ్నాప్ మరియు హత్యాయత్నం గురించి
…….
జర్నలిస్ట్ అయిన నా భర్త రఘు గంజి ని, జూన్ 3వ తేదీన కొందరు గుర్తు తెలియని దుండగులు హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి ప్రాంతం నుంచి బలవంతంగా అపహరించారు.
పట్టపగలే అందరూ చూస్తుండగానే ఆ దుండగులు నా భర్తను దౌర్జన్యంగా లాక్కెళ్లి ఒక కారులోకి తోసేశారు. అంతేగాకుండా ముఖానికి ముసుగేసి కాళ్లూ చేతులూ బంధించారు.
కేవలం సెకన్ల వ్యవధిలోనే రఘును కిడ్నాప్ చేసిన ఆ గుర్తు తెలియని వ్యక్తులు, అంతే వేగంతో కారును మల్కాజ్ గిరి ప్రాంతం నుంచి వేరే చోటుకు తీసుకెళ్లారు. కొద్దిసేపట్లోనే రఘును మరో కారులోకి తరలించారు. నల్గొండ జిల్లా పోలీసుల ప్రోద్బలంతోనే కిడ్నాపర్లు ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్టు ఆ తర్వాత అర్థమైంది.

అదృష్టవశాత్తూ ఆ సమయంలో, ఆ చుట్టుపక్కలే వున్న మల్కాజ్ గిరి స్థానికులు తక్షణమే స్పందించటంతో రఘుకు పెనుముప్పు తప్పింది. స్థానికుల సమాచారంతో రఘు కిడ్నాప్ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో కంగుతిన్న నల్గొండ పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో నా భర్తను అదేరోజు సాయంత్రం హుజూర్ నగర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాల్సి వచ్చింది.
( కిడ్నాప్ నకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు ఈ దురాగతాన్ని కళ్లకు కడతాయని, ఈ విజ్ఞప్తికి ఆ దృశ్యాలు జతచేశాను)
ఇక హైదరాబాద్ నుంచి హుజూర్ నగర్ వెళ్లే దారిలో కిడ్నాపర్లు రఘును పదేపదే కొన్ని విషయాలపై తీవ్రంగా బెదిరించటం జరిగింది. వాటిలో ప్రధానమైంది ఇకపై ఎప్పుడూ తెలంగాణలోని భూఆక్రమణలకు సంబధించిన వార్తలు కవర్ చేయొద్దనటం, అంతేకాదు రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న పెద్దలు, వారి అడుగులకు మడుగులొత్తే వ్యక్తుల ప్రోద్బలంతో… ఎప్పటికప్పుడు అంచనాలు పెంచుతూ పోతున్న వేల కోట్ల ప్రాజెక్టుల అక్రమాలపై ఇకపై కథనాలిస్తే ప్రాణాలు దక్కవంటూ హెచ్చరించారు.

నా భర్తను ప్రమాదంలోకి నెట్టిన పరిశోధనాత్మక కథనాలివే :

హైదరాబాద్ లో చట్ట విరుద్దంగా ఆక్రమించిన భూములకు సంబంధించి ప్రధానంగా.. పుప్పాల గూడలో వేల ఎకరాల నిర్వాసితుల భూముల ఆక్రమణ, కూకట్ పల్లి ప్రాంతంలోని ఐడిపిఎల్/ హిందూజా/ గల్ఫ్ ఆయిల్ భూముల్లో 500 ఎకరాల దురాక్రమణ, హైదరాబాద్ హైటెక్ సిటీలో ఐకియా సమీపంలో 43 ఎకరాల ఆక్రమణ, వివిధ ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలు దోపిడీ. వీటితో పాటు కొవిడ్ పేరుతో సామాన్యుల నుంచి లక్షల్లో ఫీజులు గుంజి, వారిని పీల్చి పిప్పి చేసిన వ్యవహారంపై రఘు చేసిన పరిశోధన. ఒక్కమాటలో చెప్పాలంటే, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి, అధికార దుర్వినియోగానికి రఘు కిడ్నాప్ ఉదంతం చిన్న ఉదాహరణ మాత్రమే.

నా భర్తను హుజూర్ నగర్ జైల్లో పెట్టడంతో ఆగని పోలీసులు, ఆ తర్వాత మరికొన్ని అక్రమ కేసులు బనాయించి అతన్ని చెప్పాపెట్టకుండా నల్గొండ జిల్లా జైలుకు తరలించారు. అంటే ఒక కేసులో బెయిల్ వచ్చినా, నా భర్తను జైల్లోనే వుంచేందుకు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై అతన్ని నోరు విప్పకుండా చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఇదంతా అని అర్థమవుతోంది.
నా భర్తపై వీళ్లు చేసే ఆరోపణలు సక్రమమే అయితే, అతను అందించిన కథనాలపై పరువునష్టం దావా వేసుకోవచ్చు. కానీ అలా చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగా లేనిపోని క్రిమినల్ కేసుల్లో ఇరికించటం, పైగా బెయిల్ రాని విధంగా సంబంధంలేని సెక్షన్లు పెట్టడం గమనిస్తే, ఒక్క నా భర్త మాత్రమే కాదు ఇకపై ఈ రాష్ట్రంలో ఏ జర్నలిస్ట్ లేదా ఏ పౌరుడూ నిజం మాట్లాడే ధైర్యం చేయకుండా భయభ్రాంతులకు గురిచేసే కుట్ర జరుగుతోందనేది సుస్పష్టం.

జర్నలిస్టులు మాత్రమే కాదు, సాధారణ పౌరులకు సైతం కనీస పౌరహక్కులు లేని తెలంగాణ రాష్ట్రంలో, నిజాలను నిర్భయంగా చెప్పే నా భర్త రఘు ప్రాణానికి రక్షణ లేదనిపిస్తోంది. భూకబ్జాకోరులు, బడా కాంట్రాక్టర్లు, ఇంకా వీళ్ల కొమ్ము కాసే పాలకపక్షంలోని కొన్ని పెద్దతలకాయలు .. వీళ్లందరి ఒక అక్రమ కలయిక తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేసింది. అందుకు ఇవాళ రఘుకు పట్టిన గతే ఒక ప్రత్యక్ష ఉదాహరణ.

ప్రజల పక్షాన గళం వినిపించే రఘు గంజి లాంటి జర్నలిస్ట్ లకు రక్షణ కల్పించాలని, ముఖ్యంగా అక్రమ కేసుల్లో అనవసరంగా జైలుపాలైన రఘుకు తక్షణం విముక్తి కలిగేలా అవసరమైన చర్యలను వేగంగా తీసుకోవాలని తమరిని వేడుకుంటున్నాను.

గౌరవ ప్రధానిగా మీరు తీసుకునే ఈ చర్యతో తెలంగాణలో నియంతృత్వ ధోరణులకు తెరపడుతుందనే గట్టి నమ్మకం, ఆశ మాకున్నాయి. కేవలం రఘు విడుదల మాత్రమే కాకుండా, ఇకపై తెలంగాణలో జర్నలిస్టులు జనం పక్షాన నిజం మాట్లాడే పరిస్థితులు కల్పిస్తారని, అధికార దుర్వినియోగాన్ని అరికట్టి, తెలంగాణలో పౌరహక్కులకు ఊపిరి పోస్తారని ఆకాంక్షిస్తూ, విన్నవిస్తున్నాను.

కృతజ్ఞతలతో

లక్ష్మీ ప్రవీణ
 

Tuesday, June 8, 2021

బాబోయ్‌ పెట్రోల్‌.. భవిష్యత్తు హైపర్‌ ఛార్జర్లదే

హైదరాబాద్ : 09/06/2021

బాబోయ్‌ పెట్రోల్‌.. భవిష్యత్తు హైపర్‌ ఛార్జర్లదే

సాక్షి మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)

వెబ్‌డెస్క్‌ : పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు సామాన్యులకు షాక్‌ ఇస్తున్నాయి. పైకి వెళ్లడమే తప్ప కిందికి రానంట్ను ఫ్యూయల్‌ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో పెట్రోలు పోయించాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంటోంది. మరోవైపు అనేక కంపెనీలు ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ (ఈవీ)కి  అనుగుణంగా ఛార్జింగ్‌ స్టేషన్లను అందుబాబులోకి తెస్తున్నాయి. ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లు పెట్రోల్‌ బంకులకు ప్రత్యామ్నయం కానున్నాయా?

ఛార్జింగ్‌ సమస్య
పెట్రోమంటతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యులు పెట్రోల్‌ బండ్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఈవీ)కి మారుదామంటే,  వాటి ఛార్జింగ్‌ అంశం సమస్యగా మారింది. ఈవీ వెహికల్స్‌కి ప్రభుత్వం నుంచి పన్ను రాయితీ, ఇతర ప్రోత్సహకాలు లభిస్తున్నా ఛార్జింగ్‌ అనేదే ప్రధాన సమస్యగా మారింది. ఇప్పుడీ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఆటోమొబైల్‌ సంస్థలే స్వయంగా ముందుకు వస్తున్నాయి.

టీవీఎస్‌ ఎంఓయూ
ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం సంస్థ టీవీఎస్‌ కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. ఎంపిక చేసిన నగరాల్లో సొంతంగా ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది ఈ మేరకు 2020 మార్చి నాటికి దేశంలోని 20 నగరాల్లో ఈవీ వెహికల్స్‌ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.  టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ పేరుతో 2020లోనే ఈవీ వెహికల్‌ని టీవీఎస్‌ మార్కెట్‌లోకి తెచ్చింది. అయితే ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌ సమస్య కారణంగా కేవలం ఢిల్లీ, బెంగళూరు నగరాలకే పరిమితమైంది.

ఓలా టార్గెట్‌ లక్ష ఛార్జింగ్‌ పాయింట్లు
క్యాబ్‌ సర్వీసులు అందిస్తున్న ఓలా సైతం హైపర్‌ ఛార్జింగ్‌ స్టేషన్లపై దృష్టి పెట్టింది. భారీ ఎత్తున ఓలా స్కూటర్లను ఈ కంపెనీ తయారు చేస్తోంది. దీంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాబోయే రోజుల్లో 400 నగరాల్లో లక్షలకు పైగా హైపర్‌ ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇళ్లు, పబ్లిక్‌ ప్లేసేస్‌తో పాటు ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ ఛార్జింగ్‌ పాయింట్లు అందుబాటులో ఉంటాయి. తొలి విడతలో వంద నగరాల్లో ఐదు వేల ఛార్జింగ్‌ పాయింట్లు నిర్మిస్తామని ప్రకటించింది. మరోవైపు ఛార్జింగ్‌ సమస్య పరిష్కారానికి హీరో సంస్థ ఏకంగా రూ. 10,000 కోట్ల రూపాయలను రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌పై ఖర్చు చేస్తోంది. అంతేకాకుండా బ్యాటరీ స్వాపింగ్‌ టెక్నాలజీపై తైవాన్‌కి చెందిన గోగోరో సంస్థతో ఒప్పందం కూడా చేసుకుంది

Fuel prices go up again; petrol nearing Rs.100 a litre mark in Hyderabad

Hyderabad : 09/06/2021

Fuel prices go up again; petrol nearing Rs.100 a litre mark in Hyderabad

Incidentally, the price of premium petrol has crossed 100 in the city

By Author  e-paper (twitter)
Fuel prices go up again; petrol nearing Rs.100 a litre mark in Hyderabad

Hyderabad: The price of petrol is just a few paise away from the Rs.100 mark, with the latest fuel price hike pegging it at Rs.98.95 per litre in Hyderabad on Tuesday. The current price of diesel in the capital city is Rs.93.90 per litre.

Incidentally, the price of premium petrol, the fuel with additives that is sold under different names by various petroleum companies, has crossed 100 in the city and was Rs.102.52 per litre on Tuesday, while that of premium diesel was Rs.97.33 per litre.

According to G Vinay Kumar, former general secretary, Telangana Petroleum Dealers Association, there was actually no reason why the fuel prices should be going up now. But ever since the dynamic pricing system began and the government gave up control, oil companies were deciding matters, he said.

“The prices of regular petrol could cross Rs.100 a litre this week itself,” he added.

From May 1, the fuel price hikes have been sharp, with that of petrol going up from Rs.93.83 by Rs.5.12 and that of diesel, from Rs.87.89 by Rs.6.01.

జ‌ర్న‌లిస్టు ర‌ఘుది కిడ్నాపే- ఇదిగో సాక్ష్యం- డీజీపీ గారూ ఇప్పుడేమంటారు?

హైదరాబాద్ : 08/06/2021

జ‌ర్న‌లిస్టు ర‌ఘుది కిడ్నాపే- ఇదిగో సాక్ష్యం- డీజీపీ గారూ ఇప్పుడేమంటారు?

తొలివెలుగు మీడియా సౌజన్యంతో (ట్విట్టర్)

జ‌ర్నలిస్ట్ ర‌ఘు అరెస్ట్ వ్య‌వ‌హ‌రానికి ముందు భారీ కుట్రే జ‌రిగిందా…? అధిక ఫీజుల స్టోరీల‌పై ర‌ఘుపై ఆగ్ర‌హంగా ఉన్న‌ మెడిక‌ల్ మాఫియా, కొంత మంది ఎమ్మెల్యేలు క‌లిసి ర‌ఘును అంత‌మొందించేందుకు కిడ్నాప్ కు ప్ర‌య‌త్నించారా…? ర‌ఘును ఎత్తుకెళ్లిన ఏపీకి చెందిన ఫ్యాన్సీ నెంబ‌ర్ కార్లు ఎవ‌రివి…? ర‌ఘు కిడ్నాప్ వ్య‌వ‌హ‌రం కాస్త ఆల‌స్యం అయినా తెలంగాణ బార్డ‌ర్ దాటించే వారా…? కిడ్నాప్ వ్య‌వ‌హ‌రం బెడిసి కొట్ట‌డంతోనే అరెస్ట్ చూపించారా…?

ఇప్పుడు ప్ర‌శ్న‌ల‌న్నింటికి ర‌ఘును కిడ్నాప్ చేసే స‌మ‌యంలో రికార్డ‌యిన సీసీటీవీ ఫుటేజ్ అవున‌నే స‌మాధానం ఇస్తోంది. జ‌ర్న‌లిస్టుగా ర‌ఘు ఏక‌కాలంలో మెడిక‌ల్ మాఫియా, ల్యాండ్ మాఫియాపై ఆధారాల‌తో స‌హ పోరాటం చేస్తున్నాడు. క‌రోనా క‌ష్టకాలంలో ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ఫీజులు వ‌సూలు చేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేల అండ ఉన్న ఆసుప‌త్రుల బండారాన్ని బ‌య‌ట‌పెట్టాడు. గిరిజ‌నులు ఏం చేయ‌గ‌ల‌రులే… అన్న ధీమాతో ఎమ్మెల్యేలు చేస్తున్న భూ ఆక్ర‌మ‌ణ‌ల‌ను, మంత్రి మ‌ల్లారెడ్డి మెడిక‌ల్ కాలేజ్ భూ భాగోతాన్ని ప్ర‌జ‌ల ముందుంచాడు. ఈ క‌థ‌నాలు ఆపాల‌ని బెదిరింపులు వ‌చ్చినా ర‌ఘు వెన‌క్కి త‌గ్గ‌లేదు. అందుకే ర‌ఘును అంత‌మొందించేందుకు కిడ్నాప్ కు తెర‌తీశార‌ని ముందు నుండి ర‌ఘు సన్నిహిత జ‌ర్న‌లిస్టులు అనుమానిస్తున్నారు.

ఫ్యాన్సీ నెంబ‌ర్లున్న ఏపీకి చెందిన‌ ప్రైవేటు కారుల్లో కిడ్నాప్?-

రెండు కార్ల‌లో వ‌చ్చిన న‌లుగురైదుగురు కిరాయి రౌడీలు… రోడ్డు ప‌క్క‌న పండ్లు కొనుగోలు చేస్తున్న ర‌ఘును ఎత్తుకెళ్లారు. మొద‌ట ఇద్ద‌రు వ్య‌క్తులు వెన‌క‌నుండి వ‌చ్చి ర‌ఘును కారెక్కించే ప్ర‌య‌త్నం చేయ‌గా, ర‌ఘు ప్ర‌తిఘ‌టించాడు. దీంతో మ‌రో ఇద్ద‌రు వ‌చ్చి ర‌ఘును కారులోకి ఎక్కించి తీసుకెళ్లిన‌ట్లు సీసీటీవీలో క్లియ‌ర్ గా రికార్డు అయ్యింది. ఈ కిడ్నాప్ లో ఉప‌యోగించిన రెండు కార్లు ప్రైవేటువే కాగా, ఏపీకి చెందిన ఫ్యాన్సీ నెంబ‌ర్లున్న కార్లు.

ఉద‌యం 9.45నిమిషాల‌కు ర‌ఘును కిడ్నాప‌ర్లు ఎత్తుకెళ్లారు. దీంతో ర‌ఘు కిడ్నాప్ పై జ‌ర్న‌లిస్టులు, జ‌ర్న‌లిస్టు సంఘాలు, మేధావులు, ప్ర‌జా సంఘాలు, రాజ‌కీయ పార్టీల నాయ‌కులు ఘాటుగా స్పందించారు. ప్ర‌శ్నిస్తే చంపేస్తారా…? కిడ్నాప్ పై డీజీపీ స‌మాధానం చెప్పాలి, వెంట‌నే పోలీసులు కిడ్నాపర్ల చెర నుండి ర‌ఘును కాపాడాలి, ర‌ఘును ఎత్తుకెళ్లింది మెడిక‌ల్, భూ మాఫియాలో ఉన్న నేత‌లే అంటూ మండిప‌డ్డారు. ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది. జ‌ర్న‌లిస్టులంతా రోడ్లపైకి వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో మ‌ఠంప‌ల్లి పోలీసులం 12.45నిమిషాల‌కు అరెస్ట్ చేశాం అంటూ ర‌ఘు భార్య‌కు స‌మాచారం ఇచ్చారు.

కిడ్నాప‌ర్లు పోలీసులెప్పుడయ్యారు…?

తెలంగాణ‌లో పోలీసులు కిరాయి గుండాల అవ‌తారం ఎత్తారా…? లేదా కిరాయి గుండాల‌నే ఏర్పాటు చేసుకొని అరెస్టులు చేస్తున్నారా…? లేదా కిడ్నాప‌ర్లు పోలీసులు అయ్యారా…? జ‌ర్న‌లిస్టు ర‌ఘు అరెస్ట్ స‌మ‌యంలో బ‌య‌ట‌కొచ్చిన సీసీటీవీ ఫుటేజ్ చూసిన ప్ర‌తి ఒక్కరికి క‌లిగే ప్ర‌శ్న ఇదే. ర‌ఘును కిడ్నాప్ చేస్తున్న స‌మ‌యంలో అక్క‌డ ఎవ‌రికీ పోలీస్ డ్రెస్ లేదు. పోలీసుల అధికారిక వాహ‌నాలు లేవు. స్థానిక పోలీసులు క‌నిపించ‌లేదు. ఫ్యాక్ష‌నిస్టులు ఎత్తుకెళ్లిన‌ట్లు ఎత్తుకెళ్లారు. మ‌ఠం ప‌ల్లి పోలీసులు చెప్పిందే నిజం అయితే వారి అధికారిక వాహ‌నాలు ఏమ‌య్యాయి, పోలీసు డ్రెస్సులు ఏమ‌య్యాయి, ప్రైవేటు వాహ‌నాలు ఎవ‌రిచ్చారు, రోడ్డుపై ఎందుకు ఎత్తుకెళ్లిన‌ట్లు అనే అనుమానాలు జ‌ర్న‌లిస్టుల్లో వ్యక్తం అవుతున్నాయి.

అయితే, కిడ్నాప్ ను నిశితంగా ప‌రిశీలిస్తే… ర‌ఘును కిడ్నాప్ చేసింది అధికార నేత‌లున్న మాఫియానే అని, ర‌ఘును తెలంగాణ బార్డ‌ర్ దాటించే ప్ర‌య‌త్నం చేశార‌ని, కానీ ఈలోపు మీడియాలో ర‌ఘు కిడ్నాప్ వ్య‌వ‌హ‌రం ర‌చ్చ రచ్చ కావ‌టంతో చేసేదేమీ లేక త‌న‌పై ఉన్న పాత కేసులో అరెస్ట్ చూపించార‌ని జర్న‌లిస్టులు అనుమానిస్తున్నారు. ఈ కిడ్నాప్ వ్య‌వ‌హ‌రంపై డీజీపీ ఏం స‌మాధానం చెప్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. డీజీపీ గారు… ఎత్తుకెళ్లింది కిడ్నాప‌ర్లు కాద‌ని చెప్ప‌గ‌ల‌రా, వారు పోలీసులే అయితే ఎలా కిడ్నాప్ చేయాలో చూపించారా అని మండిప‌డుతున్నారు. మీరు అరెస్ట్ చేసింది నిజ‌మే అయితే… ఇలా కూడా అరెస్ట్ చేయ‌టం మీ రూల్ బుక్ లో ఉందా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఓ నిఖార్సైన జ‌ర్న‌లిస్టుపై మీ రాక్ష‌స క్రీడ ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మో జ‌వాబు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు.