Tuesday, February 2, 2021

మెట్రోరైలు అధికారులకు కేటీఆర్ సారు అభినందనలు తెలిపారు .....!

*మెట్రోరైలు అధికారులకు కేటీఆర్ అభినందనలు.....!*

హైదరాబాద్‌: గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేసి గుండె తరలింపునకు సహకరించిన మెట్రో అధికారులను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన అవయవదాత నర్సిరెడ్డి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. నిన్న మెట్రోరైలులో నాగోల్‌ నుంచి జూబ్లిహిల్స్‌కు మెట్రోలో గుండె తరలించిన విషయం తెలిసిందే.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన వరకాంతం నర్సిరెడ్డిది పేదకుటుంబం. బోరు డ్రిల్లర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆదివారం మోత్కూరులో పెట్రోలు బంకుకు వెళ్లిన నర్సిరెడ్డి హైబీపీతో పడిపోయారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఈయన్ను ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు మెదడులో రక్త స్రావమైందని చెప్పారు. సోమవారం ఆయన బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు ధ్రువీకరించారు. జీవన్‌దాన్‌ ట్రస్టుకు సమాచారం అందడంతో వారు అవయవదానం కోసం కుటుంబ సభ్యులను సంప్రదించారు. 'మీ భర్త ప్రాణాలు తిరిగి రాకపోయినా.. మరికొందరిని రక్షించవచ్చని' వారు చెప్పడంతో నర్సిరెడ్డి భార్య నిర్మల ఇందుకు అంగీకరించారు. ఆయన నుంచి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయం సేకరించారు. గుండెను ప్రత్యేకంగా మెట్రో రైలులో అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతున్న ఓ 44 ఏళ్ల వ్యక్తికి వైద్యులు అమర్చాలని నిర్ణయించారు. మిగతా అవయవాలను గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ఇతర ఆసుపత్రులకు తరలించిన విషయం తెలిసిందే.

*link Media*

బాపట్ల కృష్ణమోహన్

prajasankalpam1@gmail.com

@Praja_Snklpm (ట్విట్టర్)

prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)

prajasankalpam1 (యూట్యూబ్)


https://prajasankalpam1.blogspot.com/

We are Proud of you... @IPS_Association

Hyderabad : 02/02/2021

The khaki is here to serve. We salute SI Kotturu Sirisha of Srikakulam Police , AP for the excellent humane gesture. We are proud of you. #khaki
@IPS_Association 

https://t.co/A44fEY3vts

హైదరాబాద్ లో తొలిసారిగా గ్రీన్ ఛానల్

హైదరాబాద్ : 02/02/2021

*హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు.....!*

*తొలిసారిగా గ్రీన్‌ ఛానల్‌..*

హైదరాబాద్‌ మెట్రో తొలిసారిగా ఓ గుండెమార్పిడి శస్త్రచికిత్సలో తన వంతు సాయం చేయనుంది. నగరంలో విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్‌ నేపథ్యంలో గుండె తరలింపునకు వైద్యులు హైదరాబాద్‌ను మెట్రోను ఎంచుకున్నారు. దీంతో నగరంలో మొదటిసారిగా మెట్రోతో గ్రీన్‌ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు.
జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. డాక్టర్‌ గోకులే నేతృత్వంలో ఈ శస్త్ర చికిత్స జరగనుంది. దీంతో తొలిసారిగా హైదరాబాద్‌ మెట్రోలో గుండె తరలింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రి సిబ్బంది మెట్రో రైలు అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలు అధికారులు అప్రమత్తమయ్యారు.
*నాగోల్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు నాన్‌స్టాప్‌..*
ఎల్బీనగర్‌ కామినేని నుంచి జూబ్లీహిల్స్‌ అపోలోకు గుండెను ఎలాంటి ఆటంకాలు లేకుండా తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం నాగోలు నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకూ మెట్రో సర్వీస్‌ను నాన్‌స్టాప్‌గా నడపనున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి అపోలో ఆసుపత్రి వరకు కూడా రోడ్డుపై గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించనున్నారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు వైద్యులు మెట్రోను ఎంచుకున్నారు.

*link Media 🖋️*

https://prajasankalpam1.blogspot.com/

Monday, February 1, 2021

పోలీస్ శాఖకు విశిష్ట సేవలందించిన లక్కీ

హైదరాబాద్ : 01/02/2021

*పోలీస్ శాఖకు విశిష్ట సేవలందించిన లక్కీ*

*అది ఒక శునకం.... శిక్షణ పొందిన సుశిక్షతమైన శునకం.... అందుకే పోలీసులతో సమానంగా ఎన్నో కేసులను చేధించడంలో కీలకంగా పని చేసి నల్లగొండ జిల్లా పోలీసుల కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటి ఉన్నతాధికారులతో *శభాష్*అనిపించుకుంది*

*ఈరోజు ఈ లోకం నుండి దూరంగా వెళ్ళిపోయిన సందర్బంగా😔*

@నల్లగొండ పోలీస్

https://prajasankalpam1.blogspot.com/

Saturday, January 30, 2021

పల్స్ పోలియో - 2021

హైదరాబాద్ : 31/01/2021

*ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతాపూర్ డివిజన్ RTC కాలనీ E - సేవ వద్ద పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం హెల్త్ అసిస్టెంట్ మంగ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుచున్నది.*

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Friday, January 29, 2021

జాతిపిత మహాత్మాగాంధి గారి వర్ధంతి

హైదరాబాద్ : 30/01/2021

" నిజాయితీ, సత్యం, అహింస, శాంతి, సహనం.. " ఇవన్నీ ఎంత గొప్పవో, శక్తివంతమైనవో ఆచరించి చూపిన గొప్ప దార్శనికులు జాతిపిత మహాత్మా గాంధీ గారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ప్రజా సంకల్పం & link Media ఘన నివాళులు అర్పిస్తుంది.

బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam1@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)

https://prajasankalpam1.blogspot.com/

Thursday, January 28, 2021

ఆంధ్రాబ్యాంక్ ఇప్పుడు యూనియన్ బ్యాంక్

హైదరాబాద్ : 29/01/2021

*ఆంధ్ర బ్యాంక్ ఖాతాదారులకు తెలియజేయునది ఏమనగా జనవరి నుండి పూర్తిగా యూనియన్ బ్యాంక్ లోకి మార్చడం జరిగింది.*

1. అకౌంట్ నంబర్ పాతదే ఉంటుంది.

2. కస్టమర్ ఐడి పాతదే ఉంటుంది.

3. కొత్త పాస్ బుక్ యూనియన్ బ్యాంకు ముద్ర తో వస్తుంది.

4. ఆంధ్ర బ్యాంక్ చెక్ బుక్ లో 31/03/2021తారీఖు వరకు మాత్రమే పనిచేస్తాయి తరువాత పని చేయివు. ఏప్రిల్ 1 నుండి యూనియన్ బ్యాంకు చెక్కు బుక్కులు కొత్తవి తీసుకోవాలి.

5.ఆంధ్ర బ్యాంక్ ifsc కోడ్ 31/03/ 2021 వరకు మాత్రమే పని చేస్తది. ఏప్రిల్ 1 నుండి యూనియన్ బ్యాంక్ IFSC కొత్త  కోడ్ మీ దగ్గరి లో యూనియన్ బ్యాంక్ లేదా (ఆంధ్రబ్యాంక్)తెలుసుకోవలెను.
ఇంకా ఏమైనా నా సందేహాలు ఉంటే యూనియన్ బాంక్ కస్టమర్ కేర్ నెంబర్ కి1800 208 2244 ఫోన్ చేయగలరు.

6.మొబైల్ బ్యాంకింగ్ వాడేవారు U-mobile app అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ Install చేసుకోవాలి పాత (App ab tej) పని చేయదు కాబట్టి.

@PulseTelangana

https://prajasankalpam1.blogspot.com/