Tuesday, February 2, 2021

హైదరాబాద్ లో తొలిసారిగా గ్రీన్ ఛానల్

హైదరాబాద్ : 02/02/2021

*హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు.....!*

*తొలిసారిగా గ్రీన్‌ ఛానల్‌..*

హైదరాబాద్‌ మెట్రో తొలిసారిగా ఓ గుండెమార్పిడి శస్త్రచికిత్సలో తన వంతు సాయం చేయనుంది. నగరంలో విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్‌ నేపథ్యంలో గుండె తరలింపునకు వైద్యులు హైదరాబాద్‌ను మెట్రోను ఎంచుకున్నారు. దీంతో నగరంలో మొదటిసారిగా మెట్రోతో గ్రీన్‌ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు.
జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. డాక్టర్‌ గోకులే నేతృత్వంలో ఈ శస్త్ర చికిత్స జరగనుంది. దీంతో తొలిసారిగా హైదరాబాద్‌ మెట్రోలో గుండె తరలింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రి సిబ్బంది మెట్రో రైలు అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలు అధికారులు అప్రమత్తమయ్యారు.
*నాగోల్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు నాన్‌స్టాప్‌..*
ఎల్బీనగర్‌ కామినేని నుంచి జూబ్లీహిల్స్‌ అపోలోకు గుండెను ఎలాంటి ఆటంకాలు లేకుండా తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం నాగోలు నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకూ మెట్రో సర్వీస్‌ను నాన్‌స్టాప్‌గా నడపనున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి అపోలో ఆసుపత్రి వరకు కూడా రోడ్డుపై గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించనున్నారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు వైద్యులు మెట్రోను ఎంచుకున్నారు.

*link Media 🖋️*

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment