Tuesday, February 2, 2021

మెట్రోరైలు అధికారులకు కేటీఆర్ సారు అభినందనలు తెలిపారు .....!

*మెట్రోరైలు అధికారులకు కేటీఆర్ అభినందనలు.....!*

హైదరాబాద్‌: గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేసి గుండె తరలింపునకు సహకరించిన మెట్రో అధికారులను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన అవయవదాత నర్సిరెడ్డి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. నిన్న మెట్రోరైలులో నాగోల్‌ నుంచి జూబ్లిహిల్స్‌కు మెట్రోలో గుండె తరలించిన విషయం తెలిసిందే.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన వరకాంతం నర్సిరెడ్డిది పేదకుటుంబం. బోరు డ్రిల్లర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆదివారం మోత్కూరులో పెట్రోలు బంకుకు వెళ్లిన నర్సిరెడ్డి హైబీపీతో పడిపోయారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఈయన్ను ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు మెదడులో రక్త స్రావమైందని చెప్పారు. సోమవారం ఆయన బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు ధ్రువీకరించారు. జీవన్‌దాన్‌ ట్రస్టుకు సమాచారం అందడంతో వారు అవయవదానం కోసం కుటుంబ సభ్యులను సంప్రదించారు. 'మీ భర్త ప్రాణాలు తిరిగి రాకపోయినా.. మరికొందరిని రక్షించవచ్చని' వారు చెప్పడంతో నర్సిరెడ్డి భార్య నిర్మల ఇందుకు అంగీకరించారు. ఆయన నుంచి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయం సేకరించారు. గుండెను ప్రత్యేకంగా మెట్రో రైలులో అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతున్న ఓ 44 ఏళ్ల వ్యక్తికి వైద్యులు అమర్చాలని నిర్ణయించారు. మిగతా అవయవాలను గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ఇతర ఆసుపత్రులకు తరలించిన విషయం తెలిసిందే.

*link Media*

బాపట్ల కృష్ణమోహన్

prajasankalpam1@gmail.com

@Praja_Snklpm (ట్విట్టర్)

prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)

prajasankalpam1 (యూట్యూబ్)


https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment