Monday, August 3, 2020

శవాన్ని,అప్పగించేలా చర్యలు,తీసుకోండి

*శవాన్ని, అప్పగించేలా చర్యలు,  తీసుకోండి*

హైదరాబాద్ : బిల్లుకడితేనే శవాన్ని అప్పగిస్తామంటూ మొండికేసిన సన్‌షైన్‌ ఆసుపత్రి తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా తో సన్‌షైన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన మాజీ సైనికుడు రామ్‌కుమార్‌ శర్మ మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని రాంగోపాల్‌పేట పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ను సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. ఆసుపత్రి చట్టబద్ధంగానే బిల్లులు వేసిందా లేదా అన్నదానిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, ఎక్కువ బిల్లులు వసూలు చేసినట్లుగా ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

తన తండ్రి శవాన్ని ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలంటూ మృతుడి కుమారుడు నవీన్‌కుమార్‌ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను రాఖీపౌర్ణమి సందర్భంగా సెలవు దినమైనా న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ హౌస్‌ మోషన్‌ రూపంలో సోమవారం అత్యవసరంగా విచారించారు. రామ్‌కుమార్‌శర్మను కరోనాతో గతనెల 24న సన్‌షైన్‌ ఆసుపత్రిలో చేర్చారని, ఆదివారం (2న) సాయంత్రం 4.40 ఆయన చనిపోయినట్లు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రతాప్‌ నారాయణ్‌ సంఘీ నివేదించారు.
8 రోజులకు రూ.8.68 లక్షలు బిల్లు వేశారని, రూ.4 లక్షలు చెల్లించినా మొత్తం డబ్బు కడితేనే శవాన్ని ఇస్తామంటున్నారని తెలిపారు. ఈ మేరకు న్యాయమూర్తి స్పందిస్తూ... అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు వెంటనే మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని రాంగోపాల్‌పేట పోలీసులను ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్‌ 11కు వాయిదా వేశారు.


Sunday, August 2, 2020

మంచి సంకల్పంతో పోరాటం

హైదరాబాద్ : 02/08/2020

*ఒక్కనివే ఉన్నావా?పోరాటం సాగించాలనుకుంటున్నావా?*
*ధైర్యం సరిపోవట్లేదా?*

*కుటుంభం అడ్డం వస్తుందా?*
*సమస్య పై పోరాటాలనుకుంటున్నావా?*
*సమాజం లో మార్పు తేవాలనుకుంటాన్నావా?*

*ఈ దోపిడీ దొంగలను ఎదిరించాలనుకుంటున్నావా?*
*ఈ లంచగొండిలను చీల్చి చెండాడాలనుకుంటున్నావా?*
*దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం తో పోరాడాలనుందా?*

*లంచగొండి వేదిస్తున్నాడా?*

*అన్యాయాన్ని చూస్తున్నావా? ప్రశ్నిచాలనుందా? వెనకడుగు వేస్తున్నావా?*

*మేము మీకు అండగా ఉంటాము. మేము సాగించాలనుకుంటున్న పోరాటం లో మీరు చేరండి.*

*ఒక మంచి సంకల్పం తో చేయి కలపండి. మాకు మీ సమస్యను తెలియజేయండి.*

*ఇట్లు*

---------------------------

*మీ శ్రేయోభిలాషి*

*ప్రజా సంకల్పం*

https://prajasankalpam1.blogspot.com/

Saturday, August 1, 2020

🙏పింగళి వెంకయ్య గారు 🙏

హైదరాబాద్ : 02/08/2020

మ‌న జాతీయ ప‌తాక రూప‌శిల్పి.. పోరాట యోధుడు పింగ‌ళి వెంక‌య్య‌గారు. ప్ర‌తి భార‌తీయుడు గ‌ర్వ‌ప‌డేలా ప‌తాకాన్ని రూపొందించిన పింగ‌ళి తెలుగువారు కావ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం. నేడు ఆయ‌న జయంతి ‌సందర్బంగా నివాళులు.
#PingaliVenkayya

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

RescueMissingChildren

Hyderabad : 01/08/2020

#ChildSafety #RescueMissingChildren 
Today @uppalps_ while on #patrol duty found 2 kids roaming on #Kendriya_Vidyalaya-2 road & on asking they didn’t give any reply except their school address. #Immediately team #contacted the school, #identified the parents & #handed over them. 

Source : @RachakondaCop

Bapatla Krishnamohan 
Praja Sankalpam 

https://prajasankalpam1.blogspot.com/

Friday, July 31, 2020

ఈద్ ముబారక్

హైదరాబాద్ : 01/07/2020

*ముస్లిం సోదరసోదరీమణులకు బక్రీద్‌ శుభాకాంక్షలు.త్యాగం, సహనం బక్రీద్‌ పండుగ ఇచ్చే సందేశాలు.*

#BakridGreetings 

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

చెరువులు పరిరక్షణ

హైదరాబాద్ : 31/07/2020

*బ్రేకింగ్ న్యూస్ **

*ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ చిన్న మరియు పెద్ద చెరువుల విషయంలో ప్రజా సంకల్పం & link Media ఇచ్చినటువంటి కంప్లైంట్ కు (కంప్లైంట్ నెంబర్ : 0102210 Dt: 14/07/2020) EVDM (ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మానేజిమెంట్) అధికారులు P.సతీష్ కుమార్ గారు బృందం  ఈరోజు విచారణ నిమిత్తము  రామంతాపూర్ చెరువులను పర్యవేక్షించి స్థానికులతో వివరాలు సేకరించి వెళ్లడం  జరిగింది.*

గంగపుత్ర సంఘము అధ్యక్షులు కాపర్తి మోహన్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి భాస్కర్ & సభ్యులు, మరియు  జగన్, రామకృష్ణ కూడా పాల్గొన్నారు 

Bapatla Krishnamohan 
 *ప్రజా సంకల్పం & link Media* 

https://prajasankalpam1.blogspot.com/

బంగారు తెలంగాణా లో బతుకు భారం

హైదరాబాద్ : 31/07/2020

*బంగారు తెలంగాణలో బ్రతుకు భారం*

*ఇసుక మాఫియా ని అడ్డుకున్నందుకు రైతు హత్య*

*తన పట్టా భూమిని ఇవ్వనందుకు దళిత రైతు ఆత్మహత్య*

*ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబం*

*ముమ్మాటికీ ఈ మరణాలు అన్ని ప్రభుత్వ నిర్లక్ష్య వల్ల జరిగిన హత్యలే!*

*వీటికి అంతం ఎప్పుడు..??*
*మనిషి ప్రాణం కంటే ఇసుక డబ్బులు ఎక్కువయ్యాయా? ఎంత డబ్బుతో ఇప్పుడు ఈ రైతు ప్రాణం తిరిగి పోయగలరు? **

*తన పొలంపై తనకే హక్కు లేదా?*
*మన తెలంగాణ నిజమైన సంపద అయిన ప్రకృతిని , రైతుని చంపి ఈ డబ్బుతో ఎక్కడికి పోదామని? **

Source :
@GayathriBandar7

#Farmer #Killed by #SandMafia in #Telangana -

 @DrTamilisaiGuv @narendramodi

Bapatla Krishnamohan 
ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/