*తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు*
తెలంగాణకు పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.ఆదివారంనాడు మహబూబ్ నగర్ లో నిర్వహించిన సభలో ప్రధాని ఈ విషయాన్ని ప్రకటించారు. తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా తర్వాత పసుపుపై పరిశోధనలు పెరిగాయని మోడీ పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్ర పసుపు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మోడీ పేర్కొన్నారు.ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సమ్మక్క, సారలమ్మ పేరుతో గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామన్నారు. రూ. 900 కోట్లతో యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
అంతకు ముందు హైద్రాబాద్ నుండి రాయిచూర్, రాయిచూర్ నుండి హైద్రాబాద్ కు తొలి రైలు సర్వీస్ ను ప్రధాని ప్రారంభించారు. హైద్రాబాద్ యూనివర్శిటీకి ఐదు కొత్త భవనాలను ప్రధాని ప్రారంభించారు. చర్లపల్లికి గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టకు శంకుస్థాపన చేశారు. రూ. 500 కోట్లతో 37 కి.మీ. నిర్మించిన జక్లేర్-కృష్ణా న్యూ రైల్వే లైన్ ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఖమ్మం నుండి విజయవాడకు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహాదారి పనులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మోడీ తన పర్యటనలో రూ. 6,404 కోట్ల విలువైన జాతీయ రహదారులకు శంకుస్థాపన చేశారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment