Monday, July 24, 2023
_సమాచారకమిషనర్ల పోస్టు కొరకు దరఖాస్తు_
మిత్రులకు,సమాచార కార్యకర్తలకు, శుభోదయం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార కమిషన్ నందు ఖాళీగా ఉన్న 6 రాష్ట్ర సమాచార కమీషనర్ల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది దరఖాస్తులకు చివరి తేదీ. 04-08-2023. కావున సమాచార హక్కు చట్టంపై పనిచేస్తున్న మిత్రులు, వివిధ రంగాల్లోని వారు కమిషనర్ల పోస్టు కొరకు దరఖాస్తు దాఖలు చేసుకోగలరు. *(నేను దరఖాస్తు చేస్తున్నాను.)*. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ హైదరాబాద్ కు.రిజిస్టర్ పోస్ట్ చెయ్యగలరు. దరఖాస్తు దాఖలు చేసినట్లు పత్రికలకు వార్త,PRESS NOTE కూడా ఇవ్వండి. పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన కమీషనర్ల నియామకాలు కావాలని కోరుకుందాం. నియామకాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిన పక్షంలో రేపు మనం ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుంది. అవసరమైతే (హైకోర్టు) న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు అవకాశం కూడా ఉంటుంది. సమాచార హక్కు చట్టంపై అవగాహన లేని, వ్యతిరేక భావంతో ఉన్నవారు, రాజకీయ పునరావాసంగా సమాచార కమిషనర్లుగా నియామకం జరిగితే సమాచార హక్కు చట్టం అమలు విఫలం అయ్యే పరిస్థితి వుంటుంది. కావున అవకాశం ఉన్న మిత్రులు తప్పకుండా మీ దరఖాస్తును దాఖలు చేయండి. నోటిఫికేషన్ ,దరఖాస్తు మోడల్ కొరకు 9949649766 కు మీ పేరు,జిల్లా పేరు, REQUEST TO RTI COMMISANER POST NOTIFICATION అని SEND చెయ్యగలరు. సదా ప్రజా చైతన్యం కోసం పారదర్శకత పాలన కోసం,, జవాబుదారితనం కోసం. మీ డాక్టర్ యర్రమాధ కృష్ణారెడ్డి. MA,MCJ,(LLB). వ్యవస్థాపకులు - సమాచార హక్కు వికాస సమితి. 9949649766..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment