ప్రెస్ నోట్
-------------
పాలకుల మాటలు కోటలు దాటుచున్నాయ్ కానీ కాలు బడుల గడప దాటడం లేదు
బడుల గాథలు పట్టించు కోని సర్కార్ ఒక్కక్క బడిది ఒక్కొక కథ
Courtesy by : నారగోని ప్రవీణ్ కుమార్
అద్యక్షులు,ఉచిత విద్య వైద్య సాధన సమితి
మన ఊరు మన బడి నత్త నడక నడుస్తుంది,రైతు బంధు,దళిత బంధు బీసీ బంధు,లాగ బడి బంధు పెట్టీ ఒక కోటి రూపాయలు ప్రతి బడికి ఇవ్వండి, విద్యార్థులకు ఓటు హక్కు లేదు కదూ వుంటే ఇచ్చే వాడివే కదా కెసిఆర్ సారు, మీలాంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడే నాయకులు ఉంటారు అనుకుంటే విద్యార్థులకు కూడా ఓటు హక్కు కల్పించే వారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు
అది వికారాబాద్ జిల్లా పరిగి నియోజక వర్గం విద్యారణ్య పురి లో సాంఘీక సంక్షేమ పాఠశాల స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి పాలన లో 1984 లో 19 ఎకరాలలో నిర్మాణం అయినది, ఎంతో మంది విద్యార్థులను విజ్ఞానులుగా తీర్చిదిద్దింది,
బంగారు తెలంగాణ లో అన్ని బడులు ఆగమైనట్లే ఇది కూడా ఆగమైంది,
బిల్డింగ్ పెచ్చులు ఊడి పిల్లలపై పడుచున్నవి క్షణం క్షణం బయం బయం వాన వస్తె క్లాస్ రూం లకు హాస్టల్ గదులకు నీళ్ళు వస్తాయి కిటికీ అద్దాలు లేవు చలికి వనికి పోతున్నప్పుడు పిల్లలు కిటికీలకు దుప్పట్లు కట్టుకుంటున్నారు బిల్డింగ్ ప్రక్కన మోరి ఉన్నది మోరిలో ఉన్న బురద లో పందులు ఆడుచుంటాయి, దోమలను చేతితో పట్టుకోవచ్చు దుర్గంధం వస్తున్నా బ్లీచింగ్ పౌడర్ చల్లే నాథుడు లేడు
పేరుకు నలబై వాష్ రూమ్ లు ఉన్నాయి అన్ని వాష్ రూమ్ లు పని చేయడం లేదు
వాటికి వాటర్ కనెక్షన్ లేదు నీళ్ళు రావు చుట్టూ గడ్డి పెరిగి ఉంది పాముల సంచారం పిల్లలు దిన దిన గండంగా గడుపుచున్నారు, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి BRS పార్టీ నాయకుడు కనీసం ఒక్క సారైనా అటు తొంగి చూసిన పాపాన పోలేదు తన నియోజక వర్గం లో సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల ఉన్నదనే విషయము ఆయనకు తెలుసో లేదో దేవుడికే తెలియాలి, విద్యాశాఖ మంత్రి గారికి అసలే తెలియదు 600 వందల మంది విద్యార్థులు ఉండే పాఠశాలల పై ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉన్నదో ఈ గురుకుల పాఠశాలను చూస్తే తెలుస్తుంది కనీసం 20 లక్షల రూపాయలు ఖర్చు పెడితే బాగు చేయవచ్చు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ అన్ని శాఖలను చూసే కెసిఆర్ కేటీఆర్ గార్లు కానీ వెంటనే సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించి పాఠశాలను బాగు చేపించాలని ఉచిత విద్య వైద్య సాధన సమితి కోరుకున్నది
No comments:
Post a Comment