Wednesday, July 19, 2023

కొంచెం బుర్ర పెట్టీ ఆలోచించండి ..

కొంచెం బుర్ర పెట్టీ ఆలోచించండి ..

👉 ఒకడేమో 2030 కల్లా భారతదేశాన్ని హిందూ దేశంగా చేస్తాం అంటాడు...

👉 ఇంకొకడేమో 2035 కల్లా భారతదేశం ఇస్లాం దేశం అయిపోతుంది అని భయపెడతాడు...

👉 ఇంకొకడేమో 2వ రాకడ, రక్షకుడే శిక్షకుడై వస్తున్నాడు, 2030 కల్లా మొత్తం క్రైస్తవంతో నిండిపోతుంది అంటాడు...

బుర్ర తక్కువ స్వార్థపరుల్లారా రానున్న కాలంలో భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి... 

2030 - 2040 కల్లా 

ఈ భూమి ఉష్ణోగ్రత 58 - 60 డిగ్రీలకి చేరబోతుంది.. మీ హైందవ వీరులు, మీ క్రైస్తవ వీరులు, మీ ఇస్లాం వీరులు, మీ మత రాజ్యాలు ఏర్పాటు చేయడానికి .. శవాల కుప్పలు తప్ప, మనుషులు మిగిలే పరిస్థితి లేదు.. 

ఇప్పటికే

-- పీల్చుకోడానికి స్వచ్ఛమైన గాలి లేదు

-- కొనుక్కుని తాగితే తప్ప తాగగలిగే నీరు మిగలలేదు

-- అయితే అతి వర్షాలు, లేకపోతే వర్షాభావ పరిస్థితులు

-- భగభగ మండే ఎండలో నిలబడడానికి, నీడనిచ్చే చెట్టు మిగలలేదు

-- తినే తిండి మొత్తం పురుగుల మందుల మయం 

-- భూమి మీద ప్లాస్టిక్ పొరలు పొరలు పేరుకుపోతున్నాయి

-- నదులు మొత్తం మురుగు కాల్వలుగా మారుతున్నాయి

-- సముద్రాలు అన్నీ మృత్యు కుహరాలుగా మారుతున్నాయి

-- కొత్త కొత్త జబ్బులు, క్యాన్సర్లు, వైరస్లు

ఇంకో పది సంవత్సరాల్లో ఈ దేశమే కాదు, ధ్రువ ప్రాంతాల్లో మంచుకొండలు కరిగి ఈ భూమ్మీద  40% నాగరికత అంతరించబోతుంది..

తుఫానులు, భూకంపాలు, పేదరికం,ఆకలి అంటురోగాలు ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేయబోతున్నాయి.. 

అంతా నాశనం అయ్యాక...
అందరూ చచ్చాక.... 
ఇంకెక్కడ ఏర్పాటు చేస్తారు మీ మత రాజ్యాలు... 
ఇంకా ఎవడికోసం మీ దేవుడి రాజ్యాలు...

మన బిడ్డలు, వాళ్ళ బిడ్డలు
హాయిగా సుఖంగా బ్రతకాలంటే
కావలసింది ..
ఈ దేవుళ్ళు, మతాలు కాదు 

*  వ్యర్ధాలు లేని భూమి కావాలి

*  స్వచ్ఛమైన గాలి కావాలి

*  కలుషితాలు లేని నీరు కావాలి

మీ తరువాతి తరాల మనసుల్లో విద్వేషపు  విష బీజాలు నాటడం మాని ... అందరూ కలిసి కనీసం తలోక చిన్న మొక్క నాటండి 

స్మశానాల మీద మతరాజ్యాల నిర్మాణం కోసం కాదు .. 
సాటి మనిషిపట్ల, ప్రేమభావం, సమభావం గల నవనాగరికతను నిర్మించడం కోసం ఆలోచించండి

మతాలకు పుట్టిన వాళ్ళలాగా కాకుండా,
మనుషులకు పుట్టినవాళ్లుగా జీవించండి.... 

- ఒక పర్యావరణ ప్రేమికుడైన మిత్రుడు పంపించాడు.
మీరు కూడా అన్ని గ్రూపులకు పంపించండి. 

దేశాలను మానవజాతిని కాపాడుకుందాం🙏

Courtesy by : social media 

No comments:

Post a Comment