Thursday, July 27, 2023

_ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ప్రధాన లక్ష్యం.... మంత్రి KTR_

*ప్రాణ నష్టం  జరగకుండా చూడటమే ప్రధాన లక్ష్యం.... మంత్రి KTR*

హైదదరాబాద్: గత కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌ నగరం అతలాకుతలమవుతోంది. ఇవాళ మూసారాంబాగ్‌ వద్ద వరద పరిస్థితి, మూసీపై లో లెవెల్‌ వంతెనను కేటీఆర్‌ పరిశీలించారు.ఇవాళ అసాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచన నేపథ్యంలో.. నగరవాసులకు భారాస శ్రేణులు అండగా నిలవాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ''ముంపు ప్రాంతాల్లో చేపట్టే సహాయక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలి. ప్రజలకు నిత్యావసరాల పంపిణీ, ఇతర సాయం అందించాలి. పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజలకు పార్టీ శ్రేణులు అండగా నిలవాలి'' అని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

*సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు..*
సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. పురపాలకశాఖ అధికారులతోనూ సీఎం ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలిపారు. వర్షాల కారణంగా ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రాథమిక ప్రాధాన్యతగా పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పట్టణాల్లో ఉన్న పరిస్థితులపైనా సమీక్షించిన కేటీఆర్‌.. హైదరాబాద్‌ నుంచి పురపాలక అధికారులు, అడిషినల్‌ కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.అనంతరం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా హుస్సేన్‌సాగర్‌ వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment