*రిఫండ్ రూ. లక్ష దాటితే.... నోటిస్*
*తప్పుడు క్లెయిమ్‌ల కుంభకోణంలో ఐటీశాఖ తాజా కార్యాచరణ*
హైదరాబాద్: సంచలనం సృష్టిస్తున్న రిఫండ్ కుంభకోణంపై ఐటీ శాఖ లోతుగా దర్యాప్తు చేస్తోంది.దేశంలో అత్యధికంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే తప్పుడు క్లెయిమ్‌లతో రూ.కోట్ల రిఫండ్ స్వాహా అయినట్లు తేలడంతో.. అలాంటి వారి బాగోతాల్ని రట్టు చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఒక్క మదింపు సంవత్సరంలో రూ.లక్ష కంటే ఎక్కువగా రిఫండ్ పొందిన పన్ను చెల్లింపుదారులకు త్వరలో ఈ-మెయిల్ ద్వారా నోటీస్ జారీ చేయనున్నట్లు సమాచారం. రిఫండ్ పొందేందుకు ఐటీ శాఖకు అందజేసిన క్లెయిమ్‌ల్లోని వివరాలకు సంబంధించిన పూర్తి ఆధారాల్ని సమర్పించాలని కోరనుంది. వాటిని విశ్లేషించిన అనంతరం తప్పుడు ఆధారాలున్నట్లు గుర్తిస్తే కఠినచర్యలకు దిగనుంది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం అంతకంటే తక్కువ రిఫండ్‌లు పొందిన క్లెయిమ్‌ల్లో అనుమానిత లావాదేవీలపై దృష్టి సారించనుంది. ఇలా తప్పుడు క్లెయిమ్‌లు చేసిన పన్ను చెల్లింపుదారులు లక్షల్లోనే ఉంటారని.. అలాగే ఆ తరహాలో కొట్టేసిన రిఫండ్ విలువ రూ.వందల కోట్లలోనే ఉంటుందని అనుమానిస్తోంది.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment