Friday, July 21, 2023

మేడ్చల్ జిల్లాలోని అద్దె భవనంలో ఉన్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలను సొంత భవనం నిర్మించాలి.. SFI

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ

పత్రిక ప్రకటన
తేదీ:- 20-07-2023


విషయం:- అద్దె భవనంలో ఉన్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలను సొంత భవనం నిర్మించాలి. సంక్షేమ,గురుకుల హాస్టల్ విద్యార్థిని,విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కేటాయించాలి- SFI జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్...

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ.... జిల్లా వ్యాప్తంగా గురుకుల పాఠశాల కళాశాలలు అద్దె భవనంలో నడుపుతున్నారు,కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకుండా నడుపుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ బిల్డింగ్ ఖాళీ అయితే అక్కడ తీసుకెళ్లి గురుకుల పాఠశాల కళాశాలలో పెట్టడం వల్ల విద్యార్థులకు కనీస మరుగుదొడ్లు, స్నానం చేసుకోనికే, కూర్చొని భోజనం చేయడం కూడా లేకపోవడం, సిగ్గుచేటు అన్నారు. ఖాళీగైనా ఇంజనీరింగ్ కళాశాల బిల్డింగ్, ఇతర ఖాళీగా ఉన్న బిల్డింగ్లలో పెట్టడం వల్ల విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ మాత్రం మేము గురుకుల విద్యాసంస్థలు పెట్టామని చెప్పుకుంటుంది. పేద, బడుగు బలహీనత విద్యార్థులు బాగా చదువుకుంటున్నారని గొప్పలు చెప్పుకుంటుంది. గొప్పలు చెప్పుకోవడం కాదు అద్దె భవనంలో ఉన్న గురుకుల పాఠశాలలను సొంత భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. హాస్టల్లో భోజనం పెట్టే దాంట్లో కూడా నాణ్యత లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. గురుకుల లో భోజనం పెడితే నీలాచారు రాలల అన్నం పెట్టడం ఎంత కరెక్ట్ అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నము. కెసిఆర్ మనుమడు తినే భోజనమే విద్యార్థులకు పెడుతున్న కేసీఆర్ మాట తప్పాడ. కెసిఆర్  మనుమడు స్టార్ హోటల్లో భోజనం చేస్తుంటే, పేద విద్యార్థులు మాత్రం పురుగుల అన్నం తినవలసిన పరిస్థితి వచ్చింది. గురుకుల హాస్టల్స్ పెట్టడమే కాదు గురుకుల హాస్టల్ పై అధికారుల పర్యవేక్షణ ఉండాలని కోరుతున్నాం. సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ధరల కనుగుణంగా కాస్మోటిక్ చార్జీలు పెంచాలి, అదేవిధంగా ధరలకు అనుగుణంగా నాణ్యమైన భోజనం అయ్యేటట్టు మెనూ అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. సంక్షేమ గురుకుల హాస్టల్ పై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేద బడుగు బలహీన విద్యార్థులు అనేక సమస్యలతో కూటమిటలాడుతున్నారని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సంక్షేమ గురుకుల హాస్టల్ లో సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.

ఇట్లు

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్
9618604620

No comments:

Post a Comment