Friday, July 28, 2023

_అప్రజాస్వామ్య బద్దంగా విద్యాశాఖ నోటీసులు_

ప్రచురణార్ధం/ప్రసారర్ధం:
తేదీ: 28-07-2023

విషయం:- అప్రజాస్వామ్య బద్దంగా విద్యాశాఖ నోటీసులు..
- సమస్యలు పరిష్కారం చేయకుండా బయట వ్యక్తులు రావొద్దని నోటిసులు ఇవ్వడం సరికాదు.
- రాష్ట్ర,జిల్లా వ్యాప్తంగా ఉద్యమం లో కూడా ఇలాంటి నిర్ణయాలు చేయలే.
 - ఎక్కడ సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రశ్నించోద్దని నిర్బంధం 
- తక్షణమే నోటీసులు వెనక్కి తీసుకోవాలి. లేకుంటే రాష్ట్ర,జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తాం.
-ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్.

*ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ*..... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో ప్రభుత్వ పాఠశాలల్లో,గురుకుల,కెజీబివిలో,మోడల్ స్కూల్స్ లోకి డిఇఓ అనుమతి లేకుండా లోపలికి రావడానికి అనుమతి లేదని విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన గారు ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ.జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది.
- రాష్ట్ర,జిల్లాలో విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటీకీ యూనిఫామ్ ఇవ్వలేదు, ఆశ్రమ పాఠశాలల, కెజిబివిలు పాఠ్యపుస్తకాలు రాలేదు. మధ్యాహ్నం భోజనం నిధులు లేవు,టీచర్ పోస్టులు భర్తీ లేదు, ఇన్ని సమస్యలు ఉంటే పరిష్కారం చేయకుండా సమస్యలు గురించి తెలుసు కోని పోరాడేవారిని రావోద్దని ఆంక్షలు పెట్టడం సమంజసం కాదన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో సంక్షేమ హాస్టల్ లో ఇక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఎక్కడున్నా సమస్యలు వంకరనే ఉన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మరుగుదొడ్లు, నాణ్యమైన భోజనం, కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులతో గురవుతున్నారు. సమస్యలు ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తే బాగుండేదేమో అని హెచ్చరించారు. గురుకుల పాఠశాలలు,కళాశాలలు అద్దె భవనంలో నడుపుతున్నారు. అరకొర సౌకర్యాలతో విద్యార్థినీ విద్యార్థులు అనేక బాధలు పడుతున్నారు. గురుకులాలకు సొంత భవనం నిర్మించేటట్టు చర్యలు చేపడితే బాగుండేదని తెలియజేశారు.
-సాక్షతూ సిఎం మనుమడే గచ్చిబౌలి బాలికల పాఠశాల గురించి వివరించి టాయిలెట్స్ లేకపోవడంతో కోన్ని నిధులు పెట్టి మరమ్మతులు చేశారు. ఆలాంటి దుస్థితి రాష్ట్ర,జిల్లాలో ఉందన్నారు. కెజిబివిలను కళాశాలకు ఆఫ్ గ్రేడ్ చేసి కనీసం భవనాలు లేకుండా పాఠశాలలోనే తరగతులు, డార్మెటరి నిర్వహిస్తున్న ఈ దేవసేవ గారు ఎక్కడ పర్యటించలేదు. కనీసం పట్టించుకున్న సందర్భం లేదు. 
- మోడల్ పాఠశాలలో కనీసం టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే ఉన్న  జిల్లాలో మోడల్ పాఠశాలలో ఉండాల్సిన టీచర్లు సంఖ్య కంటే చాలా తక్కువగా ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కారం చేయరు. కానీ నిర్బందాలు పెట్టి పోరాడే వారిని మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
- 24 వేల టీచర్స్ పోస్టులు భర్తీ లేదు, 30 లక్షల మందికి మధ్యాహ్న భోజనం నిధులు పెంచలేదు, కెజిబివిలలో సరైన సదుపాయాలు కల్పన ఉండదు, టాయిలెట్స్, బాత్ రూమ్స్ నిర్మాణం ఉండదు. "మన ఊరు-మన బస్తీ-మన బడి" పేరుతో వచ్చిన నిధులు గుత్తేదారులు యధేచ్చగా బిల్లులు పెట్టి దోచుకుంటుటే చోద్యం చూశారు తప్ప కనీసం విచారణ లేదు. విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన గారు తక్షణమే మన ఊరు, మనబస్తీ, మన బడి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలి.
- ఈ మద్యనే విడుదల అయినా పిజీఐ రిపోర్ట్ నివేదికలే చెబుతున్నాయని  విద్యాభివృద్ధి ఎలా ఉందో తెలుస్తుంది.
- రాష్ట్ర, జిల్లా లో ఉద్యమంలో ఇలానే నోటిసులు ఇచ్చి, సర్య్కూలర్స్ జారీ చేస్తే రాష్ట్రం సాధించేవారమా మరి తెలంగాణ వచ్చిన తర్వాత అప్రజాస్వామిక చర్యలు ఎందుకు అని తక్షణమే ఈ చర్యలు విద్యాశాఖ వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాము.

ధన్యవాదములతో...

ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్ 
9618604620

No comments:

Post a Comment