Wednesday, July 5, 2023

సరూర్ నగర్ లో జీఎస్టీ అధికారుల కిడ్నాప్... పోలీసుల అదుపులో నిందితులు...!

*సరూర్ నగర్ లో జీఎస్టీ అధికారుల కిడ్నాప్... పోలీసుల అదుపులో నిందితులు...!*

సరూర్ నగర్ : హైదరాబాద్..సరూర్‌నగర్‌ ఠాణా పరిధిలో కిడ్నాప్‌ ఘటన కలకలం రేగింది. ఇద్దరు సీజీఎస్టీ అధికారులను ఓ దుకాణం యజమానితో పాటు ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు.కృష్ణా నగర్‌లో జీఎస్టీ కట్టని ఓ షాప్‌ను సీజ్‌ చేసేందుకు జీఎస్టీ అధికారులు మణిశర్మ, ఆనంద్‌ వెళ్లారు. అదే సమయంలో షాపు యజమానితో పాటు ఫార్చ్యునర్‌ కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు .. వారిని కిడ్నాప్‌ చేసి దాడి చేసినట్లు ఎల్బీ నగర్‌ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని.. జీఎస్టీ అధికారులను కాపాడినట్లు వెల్లడించారు.

''కేంద్ర జీఎస్టీ అధికారులను కిడ్నాప్ చేసినట్టు ఇవాళ ఉదయం 10:30 నిమిషాలకు ఫిర్యాదు అందింది. ఫేక్ జీఎస్టీ కేసులకు సంబంధించి తనిఖీల్లో భాగంగా మణిశర్మ, ఆనంద్.. ఇవాళ కృష్ణానగర్‌లో స్క్రాప్, వెల్డింగ్ షాప్‌ తనిఖీకి వెళ్లారు. ఆ సమయంలో స్క్రాప్ గోడౌన్ నిర్వాహకులు జీఎస్టీ అధికారుల ఐడీ కార్డులు లాక్కున్నారు. అనంతరం వారిని వాహనంలో ఎక్కించుకొని వెళ్లారు. అధికారుల ఇద్దరిపై దాడి చేయడంతోపాటు రూ.5 లక్షలు డిమాండ్ చేశారు.మణిశర్మ వెంటనే రూ.5 లక్షల గురించి ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమై వాహనాల తనిఖీ చేపట్టాం. ఘటనాస్థలికి 4 కి.మీ. లోపలే కిడ్నాపర్ల వాహనం ఉన్నట్లు గుర్తించాం. రాజీవ్ చౌక్ వద్ద నలుగురిని అదుపులోకి తీసుకొని సీజీఎస్టీ ఇన్‌స్టెక్లర్లు మణిశర్మ, ఆనంద్‌లను రక్షించాం. ఖయ్యూం అనే మరో నిందితుడు పరారీలో ఉండగా, నిందితులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నాం. నిందితులకు నేర చరిత్ర ఏమైనా ఉందా? అని ఆరా తీస్తున్నాం'' అని డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment