సూపర్‌కాప్ వర్సెస్ సుపీరియర్.. టీఎస్ఆర్టీసీలో ప్రొటోకాల్ రచ్చ?!
!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!
గాడిన పడుతోందనుకుంటున్న వేళ.. టీఎస్ఆర్జీసీలో కొత్త రచ్చ మొదలైనట్టుగా కనిపిస్తోంది. కొత్త ఎండీ సజ్జనార్, కొత్త చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది. తనకు ఏ సమాచారం ఇవ్వకుండానే.. తన ప్రమేయం లేకుండానే సజ్జనార్ నిర్ణయాలు తీసుకుంటున్నారని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఆయన వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు కూడా చేసినట్టుగా చర్చ జరుగుతోంది.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, సూపర్ కాప్‌గా పేరు సంపాదించుకున్న సజ్జనార్‌ను ఆగస్టు 26న అనూహ్యంగా టీఎస్ ఆర్టీసీ ఎండీగా బదిలీ చేశారు. ఆ తర్వాత 20 రోజులకు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని చైర్మన్‌గా నియమించారు. ప్రోటోకాల్ ప్రకారం.. సజ్జనార్‌కు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి సుపీరియర్. అలాంటిది తనను ఏ మాత్రం పట్టించుకోకుండా, అసలు లెక్కే చేయకుండా సజ్జనారే ఆర్టీసికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారని బాజిరెడ్డి గుస్సా అవుతున్నారని తెలుస్తోంది.
అటు సజ్జనార్ తీసుకుంటున్న నిర్ణయాలను.. ఆయనే స్వయంగా తీసుకుంటున్నారన్న అర్థం వచ్చేలా పీఆర్వో టీం మీడియాకు సమాచారం అందిస్తోంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ అవకాశమైనా, పండగ వేళ ఆర్టీసీ బస్సులో అధిక ఛార్జీలు వసూలు చేయడం లేదన్న విషయమైనా ఆయన పేరుతోనే చేరవేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు ఇకపై నెల మొదటి రోజునే వేతనాలు వేస్తామనే విషయాన్ని సజ్జనారే స్వయంగా ప్రకటించారు. కానీ సెప్టెంబర్ 20 న TSRTC ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం మినహా బాజిరెడ్డి ఎక్కడా కనిపించలేదు. దీంతో సజ్జనార్ ప్రోటోకాల్ పాటించకపోవడం , తన దృష్టికి తీసుకురాకుండానే ఆర్టీసీపై నిర్ణయాలు తనంతట తానుగా తీసుకోవడంపై బాజీరెడ్డి గరం గరంగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment