ఈ బాదుడు.. ఆపేదెవడు?
వాహనదారులను చమురు మార్కెటింగ్ కంపెనీలు చావబాదుతున్నాయి. ఏ మాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా లూటీ చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లెం ఎప్పుడు పడుతుందా అని అందరూ ఎదురుచూస్తోంటే.. అందుకు విరుద్దంగా మోత మోగిస్తున్నాయి. తాజాగా మరోసారి ఛార్జీలను పెంచాయి.
!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!
వరుసగా నాలుగో రోజూ లీటరు పెట్రోల్, డిజిల్‌పై 35 పైసల చొప్పున వడ్డించాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.107.24కు పెరిగింది. డీజిల్ ధర రూ.95.97కు చేరింది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.113.12 పలుకుతుండగా.. డీజిల్ రూ.104కు పెరిగింది. చెన్నైలో పెట్రోల్ రూ.104.22గా ఉండగా.. డీజిల్ రూ.100.25కి చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.107.78, డీజిల్ రూ.99.08గా ఉన్నాయి.
ఇక హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 37 పైసలు పెరగగా.. రూ.111.55కి పెరిగింది. డీజిల్‌పై 38 పైసలు పెంచగా రూ.104.70కు ధర చేరింది. వరుసగా నాలుగు రోజులుగా ధరలు పెరుగుతుండటంతో.. ఈ నాలుగు రోజల్లోనే రూపాయిన్నర అధికమైంది.
No comments:
Post a Comment