ఇంకోసారి.. వరవరరావు బెయిల్ పొడిగింపు..!
కవి వరవరరావుకు మళ్లీ బెయిల్ గడువును పొడిగించింది బాంబే హైకోర్టు. నవంబర్ 18 వరకు లొంగిపోవాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే హైదరాబాద్ కు తరలింపు అంశాన్ని మాత్రం కోర్టు వాయిదా వేసింది. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా హైదరాబాద్ కు తరలించే అంశంపై ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలని బాంబే హైకోర్టు సూచించింది. ఎల్గార్ పరిషత్, మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడుగా ఉన్నారు వరవరరావు.
82 ఏళ్ల వయస్సులో వరవరరావు పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించగా.. ఎన్‌ఐఏ మాత్రం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని హైదరాబాద్ కు పంపాల్సిన అవసరం లేదని హైకోర్టుకు వివరించింది. ఫిబ్రవరి లో కండిషనల్ బెయిల్ మీద బయటకొచ్చారు వరవరరావు. ఇప్పటివరకు రెండుసార్లు ఆయన బెయిల్ ను పొడిగించింది న్యాయస్థానం. తాజాగా నవంబర్ 18 వరకు బెయిల్ కొనసాగుతుందని తెలిపింది.
No comments:
Post a Comment