Sunday, October 10, 2021

హెటిరో..ఎన్ని కట్టలో ! 6 రాష్ట్రాలు..50 ప్రాంతాలు..550 కోట్లు

హైదరాబాద్ : 10/10/2021

హెటిరో..ఎన్ని కట్టలో ! 6 రాష్ట్రాలు..50 ప్రాంతాలు..550 కోట్లు

హెటిరో..ఎన్ని కట్టలో ! 6 రాష్ట్రాలు..50 ప్రాంతాలు..550 కోట్లు

!! తొలివెలుగు మీడియా ట్విట్టర్ సౌజన్యంతో !!

– లాకర్లలో వందల కోట్ల నోట్ల కట్టలు
– లెక్కలు చెప్పని డబ్బే రూ.550 కోట్లు
– విదేశాల్లో వ్యాపారాలు..లెక్కల్లో తేడాలు
– సోదాల్లో రూ.200 కోట్లు లభ్యం
– బయటపడుతున్నహెటిరో బాగోతం
– అడ్డగోలు నగదుపై ఈడీ నజర్..?

కరోనా పుణ్యమా అని బాగా లాభపడింది ఎవరంటే..ఫార్మాకంపెనీలని ఎవరిని అడిగినా ఠక్కున చెప్పేస్తారు.అనుమానంతో కొందరు..భయంతో ఇంకొందరు..ఇష్టం వచ్చినట్లు మెడిసిన్స్ మింగేశారు.ఫలితంగా ఫార్మా కంపెనీల్లో కనక వర్షం కురిసింది.తెలుగు రాష్ట్రాల్లో దివీస్ లాబోరేటరీ తర్వాత రూ.26 వేల కోట్ల టర్నోవర్ తో రెండో స్థానంలో నిలిచింది హెటిరో. ఈ సంస్థ గత ప్రభుత్వాల దగ్గర సెజ్ ల్లో పెద్దఎత్తున భూములు తీసుకొని..కంపెనీలు ఏర్పాటు చేసింది.దానికి తగిన ప్రతిఫలం కావాల్సిన వారికి అందిందనే ఆరోపణలు లేకపోలేదు. ఈక్రమంలోనే మెడిసిన్ తయారీలో మేటిగా ఎదిగారు బండి పార్ధసారథిరెడ్డి.

ఏపీలో జగన్ సర్కార్ వచ్చాక ఈ రెండున్నరేళ్లలో ఆర్ధికంగా హెటిరోకు మరింత లాభాలు వచ్చాయని వినికిడి.కరోనా సమయంలో అమెరికా,యూరప్,దుబాయ్ తో పాటు దక్షిణాప్రికా దేశాలకు మందులు పెద్దఎత్తున సప్లై జరిగింది.సాప్ సాప్ట్ వేర్ లో అన్నీనమోదు చేసినా..జీఎస్టీలు చెల్లించలేదు.తక్కువ అదాయం చూపించినట్లు ఆడిటింగ్ జరిగనట్లు తెలుస్తోంది.ఈ విషయాలన్నీ తెలుసుకున్న ఐటీ అధికారులు ఎంట్రీ ఇచ్చి ఐదు రోజులుగా 50 బృందాల్లో 6 రాష్ట్రాల్లో సోదాలు చేస్తున్నారు. శనివారం ఉదయం వరకు రూ.140 కోట్ల నగదును గుర్తించారు.ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.అలాగే రూ.200 కోట్లు లాకర్లలో కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి.ఈ మొత్తం అంతా ఏపీలోని సెజ్ ల్లో దొరికినట్లు సమాచారం.ఆ మొత్తాన్ని హైదరాబాద్ లోని ఎస్బీఐ అబిడ్స్ కి మూడు కంటైనర్లలో తీసుకొచ్చారు.

16 బ్యాంకు లాక‌ర్లలో ఏముంది..?

బ్యాంకు లాకర్లలో డబ్బుతోపాటు భూమి పత్రాలు, నగలు ఉన్నట్లు తేల్చారు అధికారులు.అయితే ఎప్పటినుంచో రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చేందుకు అసక్తిగా ఉన్న హెటిరో..అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది.మార్కెట్ రేటు కంటే..రిజిస్ట్రేషన్ రేటు తక్కువగా ఉండటంతో లెక్కల్లో చూపని డబ్బంతా తరలించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకే వందల కోట్లు డ్రా చేసుకున్నామని చెప్పుకుంటోంది.అధికారులు కూడా ఇదే జరిగిందని గుర్తించారు.ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాద్ లో చేద్దామనుకున్నట్లుగా ఉన్నకొన్ని అగ్రిమెంట్లను కూడా ఐటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.రియల్ ఎస్టేట్ ద్వారా బ్లాక్ మనీని వైట్ గా మార్చాలని..సిస్టర్ సంస్థకు మళ్లించాలనే ఉద్దేశం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.

ఈడీ.. కేసు న‌మోదు చేయ‌బోతోందా..?

సాధార‌ణ ఐటీ దాడుల్లో డ‌బ్బులు ప‌ట్టుకున్నా ఫైన్ చెల్లించి వ‌దిలేస్తారు. కానీ.. ఈడీ ఎంట‌ర‌యితే ఫెమా యాక్ట్ ఉల్లంఘ‌న జ‌రిగిందా..? విదేశాల్లో బిజినెస్ చేస్తున్న హెటిరో డ్ర‌గ్స్.. హవాలా రూపంలో ఇండియాకు నగదు తీసుకొచ్చిందా..? లేదా సూటుకేసు కంపెనీలకు మ‌ళ్లించిందా అనేది కోణాల్లో విచారణ ఉంటుంది. ఐటీ దాడుల్లో రూ.100 కోట్ల న‌గ‌దు ఉంటేనే ఈడీ న‌జ‌ర్ వేస్తుంది. దీన్నిబట్టి.. ఈ కేసులో కీల‌క ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకుని సుమోటోగా కేసు న‌మోదు చేసే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ఇక్క‌డ ఫెమా యాక్ట్ ఉల్లంఘించారా..? అనేది తేలాలి. అదే జ‌రిగితే అరెస్టులు కూడా చేసే అవ‌కాశాలు లేక‌పోలేదని స‌మాచారం.

No comments:

Post a Comment