Thursday, March 2, 2023

నార్సింగి శ్రీ చైతన్య కళాశాల ముందు MP కోమటిరెడ్డి ధర్నా....!

*నార్సింగి శ్రీ చైతన్య కళాశాల ముందు MP కోమటిరెడ్డి ధర్నా....!


హైదరాబాద్‌: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాత్విక్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాలేజీ వద్ద దీక్ష చేపట్టారు.సాత్విక్ సూసైట్‌ నోట్‌లో పేర్కొన్న నలుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యుల్ని అరెస్ట్ చేసేవరకు తాను దీక్ష చేస్తానని చెప్పారు. కాలేజీ యాజమాన్యం వైఖరికి నిరసనగా ఆందోళకు దిగారు. దీంతో పోలీసులు కాలేజీ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థులకు బోధించేంకు క్వాలిఫైడ్ లెక్చరర్స్ కూడా లేరని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ఐఐటీ పేరుతో విద్యార్థులను మోసం చేసి రూ.లక్షల వసూలు చేసి వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. వీరిపై హెచ్‌ఆర్‌డీకి కూడా ఫిర్యాదు చేశానని, న్యాయపరంగా కూడా పోరాటం చేస్తానని చెప్పారు. కాలేజీలో విద్యార్థులను కొట్టడం, దూషించడం వంటి హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు సున్నితమైన విషయాల్లో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని సూచించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Wednesday, March 1, 2023

కంట తడి పెట్టిస్తున్న సాత్విక్ సూసైడ్ లెటర్

*కంట తడి పెట్టిస్తున్న సాత్విక్ సూసైడ్ లెటర్*

అమ్మానాన్నా క్షమించండి అని పేర్కొన్న సాత్విక్; తనని వేధింపులకు గురిచేసిన వారిపై కీలక సమాచారం....

శ్రీచైతన్య విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్యకు కారణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.సాత్విక్ రాసిన సూసైడ్ నోట్ బయటపడటంతో అతడిని ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితులపై పోలీసులు ఓ అంచనాకు వస్తున్నారు. అమ్మా నాన్నా నన్ను క్షమించండి అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్న సాత్విక్, ఎవరినీ బాధపట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడు. ప్రిన్సిపాల్, కాలేజీ ఇన్ఛార్జ్, లెక్చరర్స్ టార్చర్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వివరించాడు. కాలేజీ సిబ్బంది కృష్ణా రెడ్డి, ఆచార్య, శోభన్, నరేశ్ తనను వేధింపులకు గురిచేసినట్లు వెల్లడించాడు.

వీరందరూ ఏకమైన హాస్టల్ విద్యార్ధులను తీవ్రమైన వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించాడు. ఈ వేధింపులకు తాళలేక తాను ఇంత విపరీత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. తనని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు. స్నేహితులకు తాను వెళ్లిపోతున్నందుకు సారీ చెప్పడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

*సుజీవన్ వావిలాల*🖋️

Tuesday, February 28, 2023

సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర విచారణకు ఆదేశించిన.... మంత్రి సబిత....!

*సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర విచారణకు ఆదేశించిన.... మంత్రి సబిత....!*

హైదరాబాద్: నగరంలోని నార్సింగి కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ఆరా తీశారు.విద్యార్థి ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవాలని, పోలీసులు తమ దర్యాప్తును కొనసాగించాలని స్పష్టం చేశారు. వీలైనంత తొందరగా విచారణ నివేదిక అందించాలని ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌  కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

కాలేజీ స్టూడెంట్ ఆత్మహత్య.....!

*కాలేజీ స్టూడెంట్ ఆత్మహత్య.....!*

హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజ్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎన్.సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 10:30 సమయంలో తన క్లాస్‌రూమ్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాలేజీలో ఒత్తిడి వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెప్తున్నారు. దారుణమైన విషయం ఏమిటంటే.. సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం తెలిసి కూడా కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదు. కనీసం ఆసుపత్రికి కూడా తరలించలేదు. తోటి విద్యార్థులే.. ఓ వెహికల్‌ని లిఫ్ట్ అడిగి, సాత్విక్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే సాత్విక్ మృతిచెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం సాత్విక్ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️

పార్టీ సస్పెన్షన్ ఎత్తివేయకపొతే ఎన్నికల్లో పోటీకి దూరం.... MLA రాజా సింగ్.....!

*పార్టీ సస్పెన్షన్ ఎత్తివేయకపొతే ఎన్నికల్లో పోటీకి దూరం.... MLA రాజా సింగ్.....!*

*హైదరాబాద్.....!*
: తనపై విధించిన సస్పెన్షన్‌ను భాజపా అధిష్ఠానం తొలగిస్తుందన్న నమ్మకం ఉందని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు.సస్పెన్షన్‌ ఎత్తివేయకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఉద్దేశం లేదని తెలిపారు. మంగళవారం ఆయన పలు వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు తాను పెద్ద అభిమానినని, పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భాజపా అగ్రనేతలు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ సహా అందరి ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Monday, February 27, 2023

అశ్రునయనాల మధ్య ప్రీతికీ కన్నీటి వీడ్కోలు

*అశ్రునయనాల మధ్య ప్రీతికీ కన్నీటి వీడ్కోలు*

జనగామ: మెడికో ప్రీతి  అంత్యక్రియలు  స్వగ్రామంలో ముగిశాయి. అశృనయనాల మధ్య ప్రీతికి కుటుంబసభ్యులు, బంధువులు, పార్టీలు, ప్రజాసంఘాల నేతలు కన్నీటి వీడ్కోలు పలికారు.ప్రీతి మృతితో గిర్నితండా కన్నీటి సంద్రంగా మారింది. కాగా... ప్రీతి అంత్యక్రియల్లో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. విపక్ష నేతలను అంత్యక్రియల్లో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రీతి అంత్యక్రియల్లో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆపై గొడవ సర్దుమణిగింది. మందకృష్ణ మాదిగ బీఆర్‌ఎస్  బీజేపీ నేతలు  పాడె పట్టారు. ప్రీతి అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

D. శ్రీనివాస్ కు తీవ్ర స్వస్థత....!

*D. శ్రీనివాస్ కు  తీవ్ర స్వస్థత....!*

హైదరాబాద్ : పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.డీఎస్‌కు ఫిట్స్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు.

తన తండ్రి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారని.. ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని కాబట్టి రెండు రోజుల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేనని ట్విటర్ వేదికగా తన కార్యకర్తలకు తెలిపారు. నేడు రేపు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించారు. ''మా నాన్న డి. శ్రీనివాస్ గారు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు'' అని అరవింద్ తన ట్వీట్‌లో తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️