Wednesday, February 22, 2023

శంషాబాద్ లో భారీగా బంగారం పట్టివేత...!

*శంషాబాద్ లో భారీగా బంగారం పట్టివేత...!*

శంషాబాద్‌: నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షూ కింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు.సూడాన్‌ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికుల నుంచి సుమారు 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారు రూ. 7.90 కోట్లు ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు నలుగురు నిందితులను అరెస్టు చేసి మిగతా వారిని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ మధ్యకాలంలో సీజ్‌ చేసిన బంగారంలో ఇదే అత్యధికమని హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

జర్నలిస్ట్ - ఓ జర్నలిస్ట్ మిత్రమా ఇది నీకే

*జర్నలిస్ట్ - ఓ జర్నలిస్ట్ మిత్రమా ఇది నీకే*

*వార్త అంటే నిజాలను, దోపిడీ దారులనుండి, దొంగల నుండి ఈ దేశాన్ని, ప్రజలను ఎలా కాపాడుకోవాలో, ఈ కీచక రాజకీయనాకుల చేతుల్లో సమాజం, ప్రజలు ఎలా నలిగిపోతున్నారో, ప్రపంచమంలో జరిగిన సంగతులను చూపిస్తూ, వాటి వల్ల మనపై ప్రభావం ఎలా ఉంటుందో, అలాగే వాస్తవాలను విశ్లేషించి చెప్పడమే వార్త*

*కొందరి మెప్పు కోసమో,అండకోసమో,అవసరాల కోసమో మీ రాతను,మీ జీవితాన్ని, రేపటి తరాల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు*

*నిజానిజాలను నిర్భయంగ ప్రజల ముందు అందించే నివేదికనే వార్త*

*అన్యాయాలను, అక్రమాలను ఎదిరిస్తూ సత్యఅసత్యాలను ఎప్పుడు ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళను జాగరుకులను చేసే వ్యవస్థే వార్త*

*సమాజాన్ని సరియైన పంథాలో, అభివృద్ధిలో నడపడంలో ముఖ్యమయిన దిక్సుచియే ఈ వార్త*

*సమాజ నాల్గవ మూల స్థంభంగా సమాజ మార్పు కోసం,ప్రజల చైతన్యం కోసం,రేపటి తరాల భవిష్యత్తు కోసం,ఉన్నతవిలువలతో ఉన్నతశిఖరాలలో,నిలిచే అత్యున్నత వ్యవస్థయే వార్త*

*ఔను అదే వార్త....అలా చేయడమే వార్త*

*Q గ్రూప్ మీడియా*



ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్.... కేంద్రం.....!

*ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్.... కేంద్రం.....!*

ఢిల్లీ: విద్యార్థుల అడ్మిషన్లపై కేంద్రం కొత్త రూల్‌ తీసుకురానుంది. విద్యార్థుల వయసు ఆరు ఏళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో అడ్మిషన్‌ ఉండాలని నిర్ణయించింది.
ఈ మేరకు.. ఈ నిబంధనను పాటించేలా చూడాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర విద్యాశాఖ ఉత్వర్వులు జారీ చేసింది.

కొత్త జాతీయ విద్యా విధానం (NEP) ప్రకారం, పునాది దశలో పిల్లలందరికీ (3 నుండి 8 సంవత్సరాల మధ్య) ఐదు సంవత్సరాల అభ్యాస అవకాశాలను కలిగి ఉంటుంది, ఇందులో మూడు సంవత్సరాల ప్రీస్కూల్ విద్య(నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ) తర్వాత.. 1, 2 తరగతులు ఉంటాయి.

పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా చిన్న వయస్సులో పాఠశాలలకు పంపరాదని గత ఏడాది సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది.

*సుజీవన్ వావిలాల*🖋️

Sunday, February 19, 2023

జర్నలిస్టు డైరీ....**ప్రతిపక్షాలారా.. మీకు ప్రశ్నించే దమ్ము ఉందా..?*

*Q న్యూస్ (QGroup Media)*

*జర్నలిస్టు డైరీ....*
*ప్రతిపక్షాలారా.. మీకు ప్రశ్నించే దమ్ము ఉందా..?*
------------------------------------
కేంద్ర, రాష్ట్ర పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులకు ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఉందాని ప్రజలు సవాల్ విసురుతున్నారు. మన దేశం 75ఏళ్ల స్వతంత్ర మైలురాయి దాటుతున్న ఇంకా దేశంలో అనేక మంది ప్రజలు వలస జీవులుగా, యాచాకులుగా మరికొందరు రెక్కాడితే డొక్కాడని జీవులు జీవన పోరాటం చేయాల్సిన దుస్థితి ఎందుకు మిగిలిందనీ పాలకులను ఏనాడైనా ఈ ప్రతిపక్షాలు నిలదీశాయా...! లేదే..? ఎకరం భూమి లేనివాళ్లు వేల ఎకరాలు ఎలా వచ్చాయని, రబ్బర్ చెప్పులే గతిలేనివారు కోట్లకు ఎలాపడగాలేత్తారని, అప్పులు చేసి కొప్పులు పెడుతున్నారని, ఇలా నోటికీ తలుపు తాళం లేకుండా విమర్శలు ఆరోపణలు రాజకీయ నాయకులు చేసుకుంటున్న తీరును ప్రజలు గురివిందా గింజ తనకున్న నలుపు ఎరగదనట్టు ఉన్నాయని ప్రజలు హేళన చేస్తున్నారు.
----------------------------------
*సమస్యల సాధనకా మీ పోరాటం.. ఆరాటం..*
----------------------------------=
ప్రజా సమస్యల సాధనపై మీ పోరాటం ఆరాటమైతే ప్రతిపక్ష నాయకులారా మీరు పోరాటం చేయాల్సినది, ప్రధాని క్యాంప్ ఆఫీస్, పార్లమెంట్ ముందు, రాష్ట్రాలలో ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్, శాసనసభల ముందు చేయాలి ఎందుకు చేయడం లేదో... ప్రజలకు చెప్పాలి. కేవలం మీరు చేస్తున్న ఆరోపణలు నిందా ఆరోపణలే అని ప్రజలు భావించడమే కాక. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా గొచరిస్తున్నాయని ప్రజలు ఎద్దెవా చేస్తున్నారు.
-------------------------------------
*సుద్దపూసలమే కానీ... దగ్గరకు రానియ్యం..?*
-------------------------------------
ఏ రాజకీయ నాయకులు సుద్దపూసలమే కానీ దగ్గరకు రానియ్యం అనే ధోరణిలో ఉన్నారని ప్రజలు బల్లగుద్ది వాదిస్తున్నారు. అధికారంలో ఉంటే ఓ తీరు, ప్రతిపక్షంలో ఉంటే మరో తీరు ఉన్నట్లుగా ఈ ఇరువర్గ నాయకులు నటనలతో ప్రజలను బురిడీ కొట్టిస్తారని ప్రజలు విమర్శిస్తున్నారు. రాజకీయ నాయకుల పోకడ నేడు ఇలావుందని ప్రజలు గుర్తు చేయడం గమనార్హం. పగలు కాళ్ళు కొట్లాడుకుంటాయి.. రాత్రుల్లో మూతులు ముద్దాడుకుంటాయన్న సామెతను గుర్తు చేయడాన్ని ప్రతి పక్షాలు సిగ్గుపడాలి.
------------------------------------
*దోచుకొని దాచుకోవడమే..!*
-----------------------------------
దోచుకొని దాచుకోవడంలో ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ఒకర్ని మించి ఒకరు పోటీపడినట్టుగానే జాతి సంపదను దోచుకుతింటున్నది వాస్తవమేగా..! జాతీయ స్థాయిలో అధికారపార్టీ అదానీకి దోచిపెడుతుందని ప్రతిపక్షాలు, తెలంగాణాలో మైహోం, మెగా, సత్యం రామలింగరాజు బినామీలుగా దోచి పెడుతున్నారని ఇక్కడా ప్రతిపక్షాల గగ్గోలు... ఏ రాజకీయ నాయకుడు ఎంత సొమ్ము దిగమింగి వెనుకేసుకున్నది ప్రజల వద్దా లెక్కలు ఉన్నాయి. ప్రజలు అమాయకులు అనుకుంటే నాయకులను "అడుసు తొక్కనేలా కాళ్ళు కడగానేలా"ను చవిచూపిస్తారు.
---------------------------------------
*అబద్దాల బరువుకే రోడ్లు కుంగుతున్నాయి..*
----------------------------------------
పాలనలో ఉన్నా నాయకులు రోజు మాట్లాడే అబద్దాల బరువుకే నగర రోడ్డులు కుంగుతున్నాయని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఇది మన మహానగరం హైద్రాబాద్ లో రోడ్లు కుంగిపోతున్న తీరు అద్దం పడుతుంది.
వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు, ప్రగతి పనులు, పరిశీలించడానికి ప్రతిపక్షాలు, ప్రగతి కాముకులు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ముందస్తు అరెస్టులు లేదా గృహ నిర్భందాలు ఎందుకు అని ప్రజలు పాలకులను ప్రశ్నిస్తున్నారు.? పనులలో పారదర్శకత ఉన్నప్పుడు పాలకులకి భయం ఎందుకని ప్రజలు నిలదీస్తున్నారు.! ఇతర ప్రాంతాల వారు వాటిని సందర్శించి కితాబులు ఇచ్చినపుడు మనవాళ్ళు వెళితే "లా అండ్ ఆర్డర్" సమస్య అని పేచీ ఎందుకు పెడుతున్నారు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-----------------------------------
*రానున్నది ఎన్నికల కాలం...*
----------------------------------
రానున్న కాలం ఎన్నికల కాలం పాలకులారా! మీ పాలనా! నిజాయితీని నిలబెట్టుకోవాలి లేకుంటే? మీ డోల్లా తనం ఎండగట్టి ఓట్లతో గుణపాఠం నేర్పుతాం అని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

*సకినాల సుధాకర్ పటేల్*
*సీనియర్ జర్నలిస్టు*

Saturday, February 18, 2023

వైఎస్ షర్మిల అరెస్ట్..... హైదరాబాద్ తరలింపు

*వైఎస్ షర్మిల అరెస్ట్..... హైదరాబాద్ తరలింపు*

మహబూబాబాద్‌: వైతెపా(YSRTP) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో మహబూబాబాద్‌ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు.షర్మిల పాదయాత్రను రద్దు చేసి ఆమెను అరెస్ట్‌ చేసిన అనంతరం హైదరాబాద్‌ తరలిస్తున్నారు.

శనివారం సాయంత్రం మహబూబాబాద్‌లో వైతెపా ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారంటూ మహబూబాబాద్‌ శాసనసభ్యుడు బానోతు శంకర్‌నాయక్‌ను పరుష పదజాలంతో షర్మిల దూషించారని భారాస మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లూనావత్‌ అశోక్‌ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆదివారం షర్మిలను అరెస్ట్‌ చేశారు.

*సుజీవన్ వావిలాల*🖋️

నందమూరి తారకరత్న కన్నుమూత

*నందమూరి తారకరత్న కన్నుమూత,*

గత 23  రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.

తారక రత్న మృతదేహాన్ని రేపు ఉదయానికి మోకిల లోని తన నివాసానికి తరలిస్తారు.

ఎల్లుండి (సోమవారం) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.

సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు

GHMC ఉప్పల్ సర్కిల్ లో చెరువులు