Sunday, February 19, 2023

జర్నలిస్టు డైరీ....**ప్రతిపక్షాలారా.. మీకు ప్రశ్నించే దమ్ము ఉందా..?*

*Q న్యూస్ (QGroup Media)*

*జర్నలిస్టు డైరీ....*
*ప్రతిపక్షాలారా.. మీకు ప్రశ్నించే దమ్ము ఉందా..?*
------------------------------------
కేంద్ర, రాష్ట్ర పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులకు ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఉందాని ప్రజలు సవాల్ విసురుతున్నారు. మన దేశం 75ఏళ్ల స్వతంత్ర మైలురాయి దాటుతున్న ఇంకా దేశంలో అనేక మంది ప్రజలు వలస జీవులుగా, యాచాకులుగా మరికొందరు రెక్కాడితే డొక్కాడని జీవులు జీవన పోరాటం చేయాల్సిన దుస్థితి ఎందుకు మిగిలిందనీ పాలకులను ఏనాడైనా ఈ ప్రతిపక్షాలు నిలదీశాయా...! లేదే..? ఎకరం భూమి లేనివాళ్లు వేల ఎకరాలు ఎలా వచ్చాయని, రబ్బర్ చెప్పులే గతిలేనివారు కోట్లకు ఎలాపడగాలేత్తారని, అప్పులు చేసి కొప్పులు పెడుతున్నారని, ఇలా నోటికీ తలుపు తాళం లేకుండా విమర్శలు ఆరోపణలు రాజకీయ నాయకులు చేసుకుంటున్న తీరును ప్రజలు గురివిందా గింజ తనకున్న నలుపు ఎరగదనట్టు ఉన్నాయని ప్రజలు హేళన చేస్తున్నారు.
----------------------------------
*సమస్యల సాధనకా మీ పోరాటం.. ఆరాటం..*
----------------------------------=
ప్రజా సమస్యల సాధనపై మీ పోరాటం ఆరాటమైతే ప్రతిపక్ష నాయకులారా మీరు పోరాటం చేయాల్సినది, ప్రధాని క్యాంప్ ఆఫీస్, పార్లమెంట్ ముందు, రాష్ట్రాలలో ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్, శాసనసభల ముందు చేయాలి ఎందుకు చేయడం లేదో... ప్రజలకు చెప్పాలి. కేవలం మీరు చేస్తున్న ఆరోపణలు నిందా ఆరోపణలే అని ప్రజలు భావించడమే కాక. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా గొచరిస్తున్నాయని ప్రజలు ఎద్దెవా చేస్తున్నారు.
-------------------------------------
*సుద్దపూసలమే కానీ... దగ్గరకు రానియ్యం..?*
-------------------------------------
ఏ రాజకీయ నాయకులు సుద్దపూసలమే కానీ దగ్గరకు రానియ్యం అనే ధోరణిలో ఉన్నారని ప్రజలు బల్లగుద్ది వాదిస్తున్నారు. అధికారంలో ఉంటే ఓ తీరు, ప్రతిపక్షంలో ఉంటే మరో తీరు ఉన్నట్లుగా ఈ ఇరువర్గ నాయకులు నటనలతో ప్రజలను బురిడీ కొట్టిస్తారని ప్రజలు విమర్శిస్తున్నారు. రాజకీయ నాయకుల పోకడ నేడు ఇలావుందని ప్రజలు గుర్తు చేయడం గమనార్హం. పగలు కాళ్ళు కొట్లాడుకుంటాయి.. రాత్రుల్లో మూతులు ముద్దాడుకుంటాయన్న సామెతను గుర్తు చేయడాన్ని ప్రతి పక్షాలు సిగ్గుపడాలి.
------------------------------------
*దోచుకొని దాచుకోవడమే..!*
-----------------------------------
దోచుకొని దాచుకోవడంలో ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ఒకర్ని మించి ఒకరు పోటీపడినట్టుగానే జాతి సంపదను దోచుకుతింటున్నది వాస్తవమేగా..! జాతీయ స్థాయిలో అధికారపార్టీ అదానీకి దోచిపెడుతుందని ప్రతిపక్షాలు, తెలంగాణాలో మైహోం, మెగా, సత్యం రామలింగరాజు బినామీలుగా దోచి పెడుతున్నారని ఇక్కడా ప్రతిపక్షాల గగ్గోలు... ఏ రాజకీయ నాయకుడు ఎంత సొమ్ము దిగమింగి వెనుకేసుకున్నది ప్రజల వద్దా లెక్కలు ఉన్నాయి. ప్రజలు అమాయకులు అనుకుంటే నాయకులను "అడుసు తొక్కనేలా కాళ్ళు కడగానేలా"ను చవిచూపిస్తారు.
---------------------------------------
*అబద్దాల బరువుకే రోడ్లు కుంగుతున్నాయి..*
----------------------------------------
పాలనలో ఉన్నా నాయకులు రోజు మాట్లాడే అబద్దాల బరువుకే నగర రోడ్డులు కుంగుతున్నాయని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఇది మన మహానగరం హైద్రాబాద్ లో రోడ్లు కుంగిపోతున్న తీరు అద్దం పడుతుంది.
వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు, ప్రగతి పనులు, పరిశీలించడానికి ప్రతిపక్షాలు, ప్రగతి కాముకులు అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ముందస్తు అరెస్టులు లేదా గృహ నిర్భందాలు ఎందుకు అని ప్రజలు పాలకులను ప్రశ్నిస్తున్నారు.? పనులలో పారదర్శకత ఉన్నప్పుడు పాలకులకి భయం ఎందుకని ప్రజలు నిలదీస్తున్నారు.! ఇతర ప్రాంతాల వారు వాటిని సందర్శించి కితాబులు ఇచ్చినపుడు మనవాళ్ళు వెళితే "లా అండ్ ఆర్డర్" సమస్య అని పేచీ ఎందుకు పెడుతున్నారు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-----------------------------------
*రానున్నది ఎన్నికల కాలం...*
----------------------------------
రానున్న కాలం ఎన్నికల కాలం పాలకులారా! మీ పాలనా! నిజాయితీని నిలబెట్టుకోవాలి లేకుంటే? మీ డోల్లా తనం ఎండగట్టి ఓట్లతో గుణపాఠం నేర్పుతాం అని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

*సకినాల సుధాకర్ పటేల్*
*సీనియర్ జర్నలిస్టు*

No comments:

Post a Comment