Friday, October 7, 2022

రేప‌ట్నుంచి టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

రేప‌ట్నుంచి టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం


రేప‌ట్నుంచి టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

హైద‌రాబాద్ : టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ ప్ర‌క్రియ శ‌నివారం నుంచి ప్రారంభం కానుంది. ఐసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థులంద‌రూ రేప‌ట్నుంచి బుధ‌వారం వ‌ర‌కు సంబంధిత వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని అధికారులు సూచించారు.

అక్టోబర్‌ 10 నుంచి 13 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. అక్టోబర్‌ 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు. 18న ఎంబీఏ, ఎంసీఏ అభ్యర్థులకు మొదటి విడుత‌ సీట్లు కేటాయించనున్నారు. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన అభ్య‌ర్థులు.. 18 నుంచి 21వ తేదీ మ‌ధ్య‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

23 నుంచి ఐసెట్‌ తుదివిడుత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరుగనున్నది. అక్టోబ‌ర్ 23 నుంచి 25 వ‌ర‌కు వెబ్ ఆప్ష‌న్ల‌కు అవ‌కాశం క‌ల్పించారు. 28వ తేదీన తుది విడుత సీట్ల‌ను కేటాయించ‌నున్నారు. 28 నుంచి 30వ తేదీ లోపు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. న‌వంబ‌ర్ 1వ తేదీ నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి.

Courtesy by : నమస్తే తెలంగాణ మీడియా 

BRS : ఢిల్లీలో అద్దె కార్యాలయం....సొంత భవనం పనులు వేగవంతం....!

*BRS : ఢిల్లీలో అద్దె కార్యాలయం....సొంత భవనం పనులు వేగవంతం....!*

దిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా (భారాస) మార్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలకు అనువుగా దేశ రాజధాని దిల్లీలో సాధ్యమైనంత త్వరగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించాలని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారుతెరాసకు దిల్లీ వసంత్‌ విహార్‌లో కేటాయించిన స్థలంలో ఇప్పటికే సొంత భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆ పనులు పూర్తయ్యేందుకు మరికొంత కాలం పట్టనుండడంతో అప్పటివరకు అద్దె భవనంలో భారాస కార్యకలాపాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం దిల్లీ సర్దార్‌ పటేల్‌ మార్గ్‌ సమీపంలోని పాలికా మిలాన్‌ కావెంటర్‌ లేన్‌లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. లోపల కొన్ని మార్పులు చేస్తున్నారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Wednesday, October 5, 2022

టీఆర్ఎస్ ను బీఆర్ ఎస్ గా మారుస్తూ తీర్మానం....!

*టీఆర్ఎస్ ను బీఆర్ ఎస్ గా మారుస్తూ తీర్మానం....!*
హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సమావేశం ముందు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రవేశపెట్టారుటీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు బలపర్చారు. అయితే మధ్యాహ్నం 1:19 గంటలకు కేసీఆర్ కూడా ఆమోదించనున్నారు. పార్టీ జెండా, ఎజెండాపై ఆయన వివరిస్తారు. కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్ఎస్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైనారు. జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజరైనారు. టీఆర్ఎస్ పేరు మార్పుపై తీర్మానం చేశారు. అనంతరం సంతకాల సేకరించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ.. ఇకపై భారత రాష్ట్ర సమితిగా మారనుంది. తెలంగాణ పరిధి నుంచి జాతీయ స్థాయి పార్టీగా రూపాంతరం చెందనుంది. ఉద్యమ పార్టీ నుంచి.. ప్రాంతీయ పార్టీ అధినేతగా మొదలైన కేసీఆర్‌ ప్రస్థానం జాతీయ పార్టీ అధ్యక్షుడి స్థాయికి చేరనుంది. విజయదశమి రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు కేసీఆర్‌ జాతీయ రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ జెండా ఇప్పుడున్నట్లు గులాబీ రంగులోనే ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడున్న జెండానే ఉండనుంది. పార్టీ గుర్తు కూడా కారే ఉంటుంది. ఆ గుర్తే ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడగనున్నారు. వాస్తవానికి టీఆర్‌ఎస్‌ పార్టీని 2001లో రిజిస్ట్రేషన్‌ చేసినప్పుడు.. పార్టీ పరిధిని తెలంగాణ ప్రాంతం వరకే పేర్కొన్నారు. పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితిగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పార్టీ పేరు స్థానంలో భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌)అని మార్చనున్నారు.

సభ్యత్వం పెంచాలి

జాతీయ పార్టీగా ఏర్పడ్డాక తెలంగాణలో కూడా ఇప్పుడున్న సభ్యత్వం సరిపోదని, భారీగా పార్టీ సభ్యత్వం పెంచాలని కేసీఆర్‌ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. బయటి రాష్ట్రాల నుంచి కూడా మంచి స్పందన ఉందని.. పార్టీ పెట్టిన సత్వరమే ఆదరణ లభిస్తుందని తెలిపారు. పార్టీ నేతలకు జాతీయ స్థాయి కూడా అవకాశాలు వస్తాయని.. వివిధ రాష్ట్రాల్లో పార్టీ తరఫున ఇన్‌చార్జులుగా పనిచేసే అవకాశం, అదేవిధంగా జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైతే గవర్నర్‌ అవకాశాలు తదితరాలు వస్తాయని అన్నట్లు తెలిసింది. పార్టీలోని కీలక నేతలకు ఏయే బాధ్యతలు అప్పగించాలన్న దానిపైనా చర్చించినట్లు సమాచారం.

*సుజీవన్ వావిలాల*🖋️ 

Monday, October 3, 2022

అవి రాజకీపార్టీలు కావుదోపిడీ దొంగల ముఠాలు

అవి రాజకీపార్టీలు కావు
దోపిడీ దొంగల ముఠాలు
   ఒక్కొక రాజకీయ పార్టీ దగ్గర ఒక్కొక రాజకీయ నాయకుడి 
    దగ్గర వందల కోట్లు వేల కోట్లు
ఎక్కడి నుండి వస్తున్నాయి,
           వందల వేల యేకరాలు
లక్షలు నెలకు కిరాయి వచ్చే కమర్షియల్ భవనాలు
ఒక్కొకడు యేమి చేసి సంపాదిస్తున్నాడు
     అవినీతి నిరోధక సంస్థలు సీబీఐ లాంటి సంస్థలు యేం చేస్తున్నాయి మూసి నదిలో గడ్డి పీకుతున్నాయా?
      ప్రజల సొమ్మును అతి దారుణంగా దోచుక తింటున్నారు
    ఈ దొంగలకు అభిమానులు అభిమాన సంఘాలు
     వందల కోట్లు కేవలం యాడ్స్ కు ఖర్చు పెట్టే సంపాదనను ఎవ్వడు ఎక్కడి నుండి సంపాదిస్తున్నాడు
      సిగ్గుండాలి ప్రభుత్వాలకు
అధికారులకు అవినీతిని అరి కట్ట లేని అసమర్థత దేశానికి తీవ్ర నష్టం
కలిగిస్తుంది
    దోపిడీ దొంగలు ఓట్ల కోసం పోటీ పడి ధనం తో ఓట్లు కొనుక్కొని 
   అధికారం సంపాదిస్తున్నారు
   అక్రమ సంపాదన చేయడం కోసమే అక్రమ సంపాదనను నిల పెట్టుకోవడం కోసం రాజకీయ నాయకుల అవతారం 
ఎత్తుతున్నారు
      కేంద్ర ప్రభుత్వం లో ఉన్న నాయకుల అసమర్ధతకు స్థానిక పార్టీల స్థానిక నాయకుల అక్రమ సంపాదన నిదర్శనం ఈ పాపం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం లో ఉన్న నాయకులది అధికారులది
    రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్న నాయకుల కేంద్ర ప్రభుత్వం లో నాయకుల విచ్చల విడి అక్రమ సంపాదనను అరి కట్ట లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉండీ ఎందుకు? లేకుంటే ఎందుకు?
       అవినీతి ఎక్కడ జరుగుతుందో యెవ్వరి వద్ద యెంత సంపాదన ఉందో తెలుసుకో లేరా? చర్యలు ఏవి
    అవినీతి పరుడికి అవినీతి పార్టీకి ఓటు వేసే వాడు కూడా అవినీతి పరుడు మూర్కుడు అయి ఉంటాడు
     లక్షల కోట్లు ప్రజల ధనం దోచ బడుతుంటే
  దోచుకున్న నాయకులనే దోపిడీ దొంగలనే
      పొగిడే గొంతులు మూసీనది కంటే చెడిపోయినవి అని అందరు గుర్తు పెట్టు కోవాలి
    ఆ అవినీతి దరిద్రులను కొందరు దరిద్రులు పొద్దున లేస్తే పొగిడి ప్రజలకు నిజా నిజాలు తెలియకుండా చేస్తున్నారు
     అవినీతి పరుడు ప్రజా సామ్యానికి చేద పురుగు లాంటి వాడు మొక్కకు పట్టిన పురుగును చంపి వేసినట్లుగా అవినీతి పరులను జీవిత కాలం జైల్లో పెడితే తప్ప దేశం బాగుపడదు
    అవినీతి పరులకు ఓటు వేస్తే ఓటరు కూడా పాపం చేసినట్టే
 ..... నారగోని ప్రవీణ్ కుమార్

దేవాలయభూములు... ఆక్రమణలు

#GHMC ఉప్పల్ సర్కిల్ #రామంతాపూర్ డివిజన్ లో #దేవాలయం భూమి అక్రమణకు గురి అయింది అని భక్తులు అంటున్నారు. కావున @Dc_Ghmc మేడం గారు #TownPlanning అధికారులు విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

Bplkm🪶

Sunday, October 2, 2022

పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కేటీఆర్...?

*పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కేటీఆర్...?*

*తెరాసను జాతీయ పార్టీగా మార్చేందుకు ఈ నెల 6న ఈసీకి దరఖాస్తు*

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన మేరకు జాతీయ పార్టీగా పేరు మార్పిడి ప్రక్రియ ఈ నెల 5న ప్రారంభమవుతుంది.ఆ రోజు తెరాస విస్తృతస్థాయి సమావేశం ఆమోదం అనంతరం మరుసటి రోజు అంటే ఈ నెల ఆరున దిల్లీకి తెరాస ప్రతినిధుల బృందం వెళ్తుంది. తెరాస పేరును జాతీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీ) దరఖాస్తు చేసుకుంటుంది. దాన్ని ఆమోదిస్తే వెంటనే అమల్లోకి వస్తుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జాబితాలో మారుతుంది.

పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ ఉంటారు. తెలంగాణ విభాగానికి అధ్యక్షుడిగా ప్రస్తుత తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను నియమించే అవకాశం ఉంది. జాతీయ పార్టీగా పేరుకు ఆమోదం తెలిపిన తర్వాత ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. దాన్ని అనుసరించి పార్లమెంటులో, శాసనసభలో, మండలిలో పార్టీ పేరు మారుతుంది.

శాసనసభలో పార్టీ పక్ష నేతగా కేసీఆర్‌ కొనసాగుతారని తెలుస్తోంది. జాతీయ పార్టీ తరఫున తొలుత సమన్వయకర్తలను నియమించి ఆ తర్వాత రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించే అవకాశముందని సమాచారం. దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలతో పాటు సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాలను వివిధ దశల్లో చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

*సుజీవన్ వావిలాల*🖋️ 

గాంధీ ప్రతిమాట.... ప్రతి అడుగూ... ఆచరణీయం.... సీయం కేసీఆర్

*గాంధీ ప్రతిమాట.... ప్రతి అడుగూ... ఆచరణీయం.... సీయం కేసీఆర్*

హైదరాబాద్: కరోనా విపత్తు వేళ గాంధీ ఆస్పత్రి అందించిన సేవలు ప్రశంసనీయమని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ఆవరణలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన 16 అడుగుల బాపూజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. దేశానికి గాంధీజీ అందించిన సేవలను స్మరించుకున్నారు.

గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బంది ఆయన ఆదర్శాలను కొనసాగిస్తున్నారని సీఎం ప్రశంసించారు. కరోనా సమయంలో రోగులను మిగతా ఆస్పత్రుల్లో తిరస్కరించినా ఇక్కడికి తీసుకొచ్చి వారి ప్రాణాలను కాపాడారన్నారు. వసతులు లేకున్నా ప్రజలకు సేవ చేశారని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. ధ్యానముద్రలో ఉన్న ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం గొప్ప విషయమని.. దీని ఏర్పాటు అంశంలో మంత్రి శ్రీనివాస్‌కు చిరస్థాయి కీర్తి దక్కుతుందని చెప్పారు.గాంధీ పుట్టిన దేశంలో మనందరం జన్మించడం గొప్ప విషయం. బాపూజీ చూపిన అహింసా మార్గం శాశ్వతమైనది. మానవోత్తముడు, విశ్వమానవుడు మహాత్మాగాంధీ. కరుణ, ధైర్యంతో నిస్సహాయతను ఎదుర్కోవచ్చని ఆయన చాటారు. కుల, మత, వర్గ రహితంగా ప్రతి ఒక్కరినీ స్వాతంత్ర్యం వైపు నడిపిన సేనాని గాంధీ. ఆయన ప్రతి మాటా.. ప్రతి అడుగూ ఆచరణీయం.

అందుకే స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శించాం. 5వేల షోలలో సుమారు రెండున్నర కోట్ల మంది చూశారు.

*సుజీవన్ వావిలాల*🖋️