Wednesday, June 8, 2022

చరిత్ర సృష్టించిన.... మాలావత్ పూర్ణ....మౌంట్ డేనాలి ఎక్కి ప్రపంచ రికార్డ్

*చరిత్ర సృష్టించిన.... మాలావత్ పూర్ణ....మౌంట్ డేనాలి  ఎక్కి ప్రపంచ రికార్డ్*

*ఉత్తర అమెరికాలోని డెనాలి శిఖరారోహణతో 7-సమ్మిట్‌ చాలెంజ్‌ పూర్తి*

*ఈ ఘనత సాధించిన యంగెస్ట్‌ ఫిమేల్‌ ఇన్‌ ఇండియాగా గుర్తింపు*

నిజామాబాద్‌: మాలావత్‌ పూర్ణఅరుదైన ఘనత సాధించి మరోసారి చరిత్ర సృష్టించింది.ప్రపంచంలో 7 ఎత్తైన శిఖరాలను అధిరోహించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. ఈ నెల 5న ఉత్తర అమెరికాలోని డెనాలి పర్వత శిఖరం (6,190 మీటర్లు/20,310 అడుగులు) అధిరోహించడంతో ప్రపంచస్థాయి 7-సమ్మిట్‌ చాలెంజ్‌ను పూర్తి చేసింది. ఈ ఘనత సాధించిన 'యంగెస్ట్‌ ఫిమేల్‌ ఇన్‌ ఇండియా'గా రికార్డు సృష్టించింది. పూర్ణ మే 18న ఇండియా నుంచి బయల్దేరి, మే 19న అలస్కాలోని ఎంకరేజ్‌ నగరానికి చేరుకుంది. ఈ పర్వతారోహణలో పూర్ణతోపాటు మనదేశం నుంచి మరో నలుగురు సభ్యులున్నారు.

మే 23న బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నవారు శిఖర అధిరోహణ ప్రారంభించి, ఈనెల 5న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కోచ్‌ శేఖర్‌ బాబు ధ్రువీకరించారు. శిఖరం నుంచి కిందికి వస్తూ పూర్ణ శాటిలైట్‌ ఫోన్‌ ద్వారా ఈ సమాచారాన్ని పంచుకుంది. ఈ యాత్రకు స్పాన్సర్‌ చేసిన ఏస్‌ ఇంజనీరింగ్‌ అకాడమీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వైవీ గోపాలకృష్ణమూర్తి, తన గురువు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఐపీఎస్‌(వీఆర్‌ఎస్‌), సహకరించిన హైదరాబాద్‌ బీఎస్‌బీ ఫౌండేషన్‌ చైర్మన్‌ భూక్యా శోభన్‌బాబులకు పూర్ణ కృతజ్ఞతలు తెలిపింది.

పూర్ణ సాహస యాత్రకు హైదరాబాద్‌కు చెందిన 'ట్రాన్సెండ్‌ అడ్వెంచర్స్‌' సంస్థ తోడ్పాటునందించింది. ప్రపంచవ్యాప్తంగా ఆమె సాహస యాత్రలను నిర్వహించేందుకు అవసరమైన లైసెన్స్‌లు ఇప్పించి, 7-సమ్మిట్స్‌ చాలెంజ్‌ను పూర్తి చేయడంలోనూ కీలకపాత్ర పోషించింది. దెనాలి పర్వతారోహణలో పూర్ణతోపాటు అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత అజీత్‌ బజాజ్, ఆయన కుమార్తె దియా బజాజ్, విశాఖపట్నానికి చెందిన అన్మిష్‌ వర్మ కూడా ఉన్నారు.
*దక్షిణభారత దేశం నుంచి తొలి యువతి..*
కాగా, ప్రస్తుతం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న పూర్ణ 2014లో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన 'ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలు'గా చరిత్ర సృష్టించింది. ఆమె ఇప్పటివరకు ఎవరెస్ట్, ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్‌లోని ఎల్‌బ్రస్, దక్షిణ అమెరికాలోని అకోన్‌కాగస్, ఓసెనియాలోని కార్టెన్జ్‌ పిరమిడ్, అంటార్కిటికాలోని విన్సన్, తాజాగా ఉత్తర అమెరికాలోని దెనాలి శిఖరాలను అధిరోహించింది. దక్షిణ భారతదేశం నుంచి ఈ 7-సమ్మిట్‌ ఘనతను సాధించిన మొదటి యువతి పూర్ణ కావడం విశేషం.
*పూర్ణ అధిరోహించిన పర్వతాలు:*

1 ఎవరెస్టు (ఆసియా)
2. మౌంట్‌ కిలిమంజారో (ఆఫ్రికా)
3. మౌంట్‌ ఎల్‌బ్రస్‌ (యూరప్‌)
4. మౌంట్‌ అకోన్‌కగువా (దక్షిణ అమెరికా)
5. మౌంట్‌ కార్టెన్జ్‌ (ఓషియానియా)
6. మౌంట్‌ విన్‌సన్‌ (అంటార్కిటికా)
7. మౌంట్‌ డెనాలి (ఉత్తర అమెరికా)

link Media ప్రజల పక్షం🖋️ 

బస్ చార్జీలు భారీగా.... పెంపు....?

*బస్ చార్జీలు భారీగా.... పెంపు....?*
హైదరాబాద్: సాధారణ ప్రయాణికులే లక్ష్యంగా డీజిల్‌ సెస్, టిక్కెట్‌ ధరల రౌండాఫ్‌ నెపంతో ఇప్పటికే నగరంలో చార్జీల మోత మోగిస్తున్న ఆర్టీసీ..తాజాగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంది.
బస్‌పాస్‌ చార్జీలను భారీగా పెంచింది. ఇప్పటి వరకు ఉన్న చార్జీలను ఇంచుమించు రెట్టింపు చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది.

నగరంలో సాధారణ నెలవారీ బస్‌పాస్‌లతో (జీబీటీ)పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ పాస్‌లు, సాధారణ క్వార్టర్లీ పాస్‌లు, గ్రేటర్‌ హైదరాబాద్‌ క్వార్టర్లీ పాస్‌లను ఎక్కువ మంది విద్యార్థులు వినియోగిస్తున్నారు. అలాగే ఇంటి నుంచి కాలేజీ వరకు వెళ్లి వచ్చేందుకు రూట్‌ పాస్‌లకు కూడా డిమాండ్‌ బాగా ఉంటుంది. ఇలా వివిధ రకాల పాస్‌లను వినియోగిస్తున్న విద్యార్థుల సంఖ్య 5 లక్షలకు పైగా ఉన్నట్లు అంచనా.

ఈ విద్యార్థులు బస్‌పాస్‌ల కోసం ప్రతి నెలా ఆర్టీసీకి ప్రస్తుతం రూ.8.5 కోట్ల వరకు చెల్లిస్తుండగా తాజా పెంపుతో మరో రూ.5 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ప్రస్తుతం సాధారణ నెల వారీ పాస్‌ రూ.165 ఉండగా, తాజాగా రూ.300 వరకు పెరిగే అవకాశం ఉంది. అలాగే క్వార్టర్లీ పాస్‌ రూ.495 నుంచి రూ.650 వరకు పెరగవచ్చునని అంచనా. ఏ బస్‌పాస్‌పైన ఎంత వరకు చార్జీలు పెరిగాయనే అంశాన్ని బుధవారం అర్ధరాత్రి వరకు కూడా ఆర్టీసీ స్పష్టం చేయకపోవడం గమనార్హం.

link Media ప్రజల పక్షం🖋️ 

కోవిడ్ టెస్టులు పెంచాలి.... తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశం.....

*కోవిడ్ టెస్టులు పెంచాలి.... తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశం.....*

హైదరాబాద్: కరోనా ఫోర్త్ వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో కొవిడ్ టెస్టులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బుధవారం కోవిడ్ 19పై హైకోర్టులో విచారణ జరిగింది.కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా చూడాలని ధర్మాసనం సూచించింది. కోవిడ్‌పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కోవిడ్ బారిన పడి చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియాపై నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ... తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది.

link Media ప్రజల పక్షం🖋️ 

Tuesday, June 7, 2022

40 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు..... నో టికెట్....?

*40 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు..... నో టికెట్....?*

*టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలపై 'ఐ ప్యాక్‌' నివేదికలు*

*అన్ని కోణాల్లో అధినేత కేసీఆర్‌కు ఫీడ్‌బ్యాక్‌*

*పార్టీ పరిస్థితి, నేతల పనితీరు, సమర్థతపై బృందాల అంచనా*

*విపక్ష నేతల వివరాలూ సేకరణ*

*పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న వారితో జాబితా*

*ఇప్పటికే 70 చోట్ల వివరాలు రెడీ*

*20లోగా మరో 40 నివేదికలు....*

*సమాచారాన్ని క్రోడీకరించి దిద్దుబాటు చర్యలు... ఎన్నికల వ్యూహానికి ఇప్పటినుంచే పదును*

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రత్యర్థి పారీ్టల రాజకీయ ఎత్తుగడలను నిశితంగా గమనిస్తున్న అధికార టీఆర్‌ఎస్‌ మరోవైపు సొంత పార్టీ నేతల పనితీరుపైనా దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్‌ ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ఐ ప్యాక్‌ నివేదికల నేపథ్యంలో 40 మందికి పైగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి అవకాశం దక్కక పోవచ్చని తెలుస్తోంది. శాసనసభ నియోజకవర్గాలవారీగా ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు సెగ్మెంట్‌ పరిధిలోని ఇతర ముఖ్య నేతల పనితీరు, గుణగణాలపై టీఆర్‌ఎస్‌ లోతుగా వివరాలు సేకరిస్తోంది.

ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన 'ఐ ప్యాక్‌'బృందం ఈ మేరకు నివేదికలు రూపొందిస్తోంది. ఇప్పటికే సుమారు 70 నియోజకవర్గాలకు సంబంధించిన నివేదికలు టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్దకు చేరాయి. మరో 40కి పైగా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నేతల పనితీరుపై నివేదికలకు ఈ నెల 20లోగా తుది రూపు వచ్చే అవకాశముంది. వివిధ కోణాల్లో సేకరిస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి రూపొందిస్తున్న ఈ నివేదికల ఆధారంగా క్షేత్ర స్థాయిలో దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహానికి కూడా ఇప్పటినుంచే పదును పెట్టాలని అధినేత కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలిసింది.

*మీడియా సంబంధాలపైనా విశ్లేషణ*
ప్రధాన మీడియా, వాటి ప్రతినిధులతో పార్టీ పరంగా ఉన్న సంబంధాలు, సమాచారం పంపిణీ, సామాజిక మాధ్యమాల్లో పార్టీకి అనుకూలం, ప్రతికూలంగా జరుగుతున్న ప్రచారం తదితరాలను కూడా ఐ ప్యాక్‌ బృందాలు అంచనా వేస్తున్నాయి. మీడియాలో వస్తున్న ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఎలాంటి కంటెంట్‌ (అంశాలు) అవసరమనే కోణంలోనూ మదింపు జరుగుతోంది.

మరోవైపు వివిధ సందర్భాల్లో పార్టీ తరఫున మీడియాలో గళం విప్పుతున్న ప్రతినిధుల సమర్ధత, వారికి వివిధ అంశాలపై ఉన్న అవగాహన, వారి భాషా పరిజ్ఞానం తదితరాలను కూడా ఐ ప్యాక్‌ విశ్లేషిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌ పారీ్టలు ఏ తరహా ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి, ఆ పారీ్టకి ఉన్న మీడియా సంబంధాలపై కూడా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఇటీవల నివేదికలు అందజేసింది.
*అన్ని వైపుల నుంచీ ఆరా.....*
పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పూర్తి వివరాలను ఐ ప్యాక్‌ బృందం సేకరిస్తోంది. వైవాహిక స్థితి, కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారా, ఏయే పదవుల్లో ఉన్నారు? ఎలాంటి పనితీరు కనపరుస్తున్నారు? వంటి కోణాల్లో బృందాలు ఆరా తీస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలు, నేతల ఆర్థిక స్థితిగతులు, వారికి ఉన్న వ్యాపార నిర్వహణ బాధ్యతలు చూస్తున్నదెవరు?, పార్టీ, సామాజిక కార్యక్రమాల్లో ఎంత మేర చురుగ్గా పనిచేస్తున్నారు? తదితర వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఒకవేళ సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై ప్రతికూలత ఉండే పక్షంలో ఎవరు సరైన ప్రత్యామ్నాయం అనే కోణంలోనూ సమాచార సేకరణ జరుగుతోంది.

పార్టీలో అంతర్గత గ్రూపులు, వీటి వెనుక ఉన్న కీలక నేతలు, పార్టీ యంత్రాంగంపై గ్రూపు రాజకీయాల ప్రభావం తదితర అంశాలను కూడా నివేదికలో పొందుపరుస్తున్నారు. ఇలావుండగా ఇతర పారీ్టల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతలు లేదా ఇతర పారీ్టల్లో బలమైన నేతల వివరాలు కూడా ఈ నివేదికల్లో ఉన్నట్టు తెలుస్తోంది. విపక్ష ఎమ్మెల్యేల పనితీరు, వారి బలాబలాలను కూడా అంచనా వేస్తున్న ఐ ప్యాక్‌ బృందాలు ఆ మేరకు నివేదికలు రూపొందిస్తున్నట్టు సమాచారం.

link Media ప్రజల పక్షం🖋️ 

ప్రభుత్వ డాక్టర్ల.... ప్రైవేట్ ప్రాక్టీస్ పై నిషేధం.....జీవో విడుదల

*ప్రభుత్వ డాక్టర్ల.... ప్రైవేట్ ప్రాక్టీస్ పై నిషేధం.....జీవో విడుదల*

*తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం....!*

హైదరాబాద్‌: ప్రభుత్వ వైద్యుల విషయంలో తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వైద్యులకు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ నిషేధం విధించింది.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఒక జీవో విడుదల చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు.. ఇకపై ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేయడానికి వీల్లేదు. ఈ మేరకు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ నిబంధనలను సవరించింది ప్రభుత్వం.

రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్‌ సిబ్బందిని నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకోసం కసరత్తు చేపట్టింది. ఈ తరుణంలో నియామక మార్గదర్శకాల్లో ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్‌ రద్దు అంశం కీలకంగా మారింది.

link Media ప్రజల పక్షం🖋️

3వసారి బీజేపీ కీ అధికారం ఇస్తే దేశం ముక్కలు అవ్వడ్డం.... ఖాయం.... వీహెచ్

*3వసారి బీజేపీ కీ అధికారం ఇస్తే దేశం ముక్కలు అవ్వడ్డం.... ఖాయం.... వీహెచ్*

భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపికి మూడవసారి అధికారం ఇస్తే భారతదేశం ముక్కలు కావటం ఖాయం అంటూ విమర్శించారుదేశాలన్ని ముక్కలు చేయాలని బీజేపీ ఆలోచనగా కనిపిస్తోందని అందుకే బీజేపీ నేతలు మతాల మధ్య విధ్వేషాలు కలిగించే వ్యాఖ్యలు చేస్తుంటారని మండిపడ్డారు. బీజేపీ నేతలు రోజుకో రకమైన వ్యాఖ్యలు చేసి వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇతర మతాలను కించపరచటమే బీజేపీ ఎజెండాగా ఉందని అన్నారు. మతాల మధ్య విద్వేషాలు కలిగించేవారిపై చర్యలు తీసుకోవాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు వీహెచ్.

దేశాన్ని ముక్కలు చేయటమే బీజేపీ ఎజెండా అని..కానీ కాంగ్రెస్ మాత్రం దేశాన్ని ఏకత్రాటిపై నడిపించే పార్టీ అని ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి ఓటు వేయాలని కోరారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ జోడో యాత్ర చేపడుతున్నాం అని వీహెచ్ తెలిపారు. దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది అని ముఖ్యంగా అత్యాచారలు పెరుగుతున్నాయని అన్న వీహెచ్చ అత్యాచారానికి పాల్పడినవారిని మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే దారుణాలు తగ్గుతాయని అన్నారు. కోర్టుకు వెళ్లిన అత్యాచారాల కేసుల్లో తీర్పులు త్వరితగతిన వెలువడాలని అన్నారు. అలా చేస్తే నేరాల సంఖ్య తగ్గుతుందని అన్నారు.

కాగా..2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతోంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో నిర్వహించిన చింతన్ శివిర్ లో వచ్చే ఎన్నికల కార్యాచరణపై చర్చించారు కాంగ్రెస్ నేతలు. దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్రకు ప్రణాళికలు వేశారు. దీంట్లో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలు కానుంది. భారత్ జోడో యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. రాహుల్ పాదయాత్రను సక్సెస్ చేసేందుకు ప్రత్యేక కమిటీలను నియమించింది. పొలిటికల్ అఫైర్స్ కమిటి, టాస్క్ ఫోర్స్ 2024 గ్రూప్ తో పాటు భారత్ జోడో యాత్ర ప్లానింగ్ మరియు కో ఆర్డీనేషన్ కోసం ప్రత్యేక కమిటీలను ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ ప్రకటించారు.

ఏఐసీసీ ప్రకటించిన పొలిటికల్ అఫైర్స్ కమిటిలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్, అంబికా సోని, దిగ్విజయ్ సింగ్, అనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, జితేందర్ సింగ్ ఉన్నారు. టాస్క్ ఫోర్స్ 2024 గ్రూప్ లో పి చిదంబరం, ముకుల్ వాస్నిక్, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, ప్రియాంక గాంధీ వాద్రా,రణదీప్ సింగ్ సూర్జేవాలా, కే సునీల్ ను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. భారత్ జోడో యాత్ర సెంట్రల్ ప్లానింగ్ మరియు కో ఆర్డీనేషన్ గ్రూప్ లో దిగ్విజయ్ సింగ్, సచిన్ పైలెట్, శశి థరూర్, రణవీత్ సింగ్ భట్టు, కేజే జార్జ్, జోతి మని,ప్రద్యుత్ బోర్డోలూయి, జితూ పత్వారి, సలీమ్ అహ్మద్ ను అపాయింట్ చేసింది.

link Media ప్రజల పక్షం🖋️ 

Monday, June 6, 2022

తెలంగాణ లో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అని ప్రజా సంకల్పం గ్రూప్ ద్వారా PMO ఆఫీస్ కు వాస్తవాలతో ఫిర్యాదు చేయడం జరిగింది

👆తెలంగాణ లో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అని ప్రజా సంకల్పం గ్రూప్ ద్వారా PMO ఆఫీస్ కు వాస్తవాలతో ఫిర్యాదు చేయడం జరిగింది.
Bplkm🪶

Your Communication has been registered with registration number - PMOPG/E/2022/0_____. Please visit at: https://pgportal.gov.in/status for further details.
Copy to Group link Media
 07/06/2022 prajasankalpam1.blogspot.com