Friday, May 27, 2022

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్... కళ్యాణ్ రామ్....!

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్... కళ్యాణ్ రామ్....!

హైదరాబాద్‌: తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు.ఈ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు చేరుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు పుష్పగుచ్ఛాలు ఉంచి తాతను స్మరించుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌ జయంతి వేళ ఆయన అభిమానులు, తెదేపా కార్యకర్తలు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.

link Media ప్రజల పక్షం🖋️ 

నదిలో పడ్డ వాహనం....7గురు జవాన్ల దుర్మరణం

*నదిలో పడ్డ వాహనం....7గురు జవాన్ల దుర్మరణం*

శ్రీనగర్‌: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జవాన్లు ప్రయాణిస్తోన్న ఓ వాహనం నదిలో పడి ఏడుగురు దుర్మరణం చెందారు.మరో 19 మంది గాయపడ్డారు. శుక్రవారం ఉదయం పార్థాపూర్‌ శిబిరం నుంచి 26 మంది సైనికులు వాహనంలో హనీఫ్‌ సబ్‌ సెక్టార్‌ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

టుర్టుక్‌ సెక్టార్‌ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదవశాత్తు రోడ్డుపై నుంచి జారి షియోక్‌ నదిలో పడింది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన జవాన్లను ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌ అంబులెన్స్‌లో సైనికులను పశ్చిమ కమాండ్‌కు తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది.

link Media ప్రజల పక్షం🖋️ 

పోలీసు నియమకాలు....7:33 లక్షల మంది అభ్యర్థులు 12:91 లక్షల దరఖాస్తులు

*పోలీసు నియమకాలు....7:33 లక్షల మంది అభ్యర్థులు 12:91 లక్షల దరఖాస్తులు*

హైదరాబాద్‌: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు 7.33 లక్షల మంది అభ్యర్థులు 12.91 లక్షల దరఖాస్తులు చేసుకున్నట్లు పోలీసు నియామక మండలి వెల్లడించింది. వీటిలో ఎస్సై పోస్టులకి 2.47 లక్షలు, కానిస్టేబుల్‌ పోస్టులకు 9.50 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు నియామక మండలి తెలిపింది. 3.55 లక్షల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖాస్తుల్లో 2.76 లక్షల మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఆగస్టు 7న ఎస్సై, 21న కానిస్టేబుల్ పోస్టులకు ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.తేదీల్లో ఏమైనా మార్పులు ఉంటే ముందే ప్రకటిస్తామని నియామక మండలి ఛైర్మన్‌ శ్రీనివాస్‌ రావు తెలిపారు.

మొత్తం దరఖాస్తుల్లో.. 7.65% ఓసీలు, 8.27% బీసీ (ఏ), 17.7% బీసీ (బీ), 0.26% బీసీ (సీ), 20.97% బీసీ (డీ), 4.11% బీసీ (ఈ), 22.44 % ఎస్సీ, 18.6% ఎస్టీ అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, నారాయణపేట్, జనగాం, సిరిసిల్ల జిల్లాల నుంచి తక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్లు నియామక మండలి తెలిపింది. తెలుగులో పరీక్ష రాసేందుకు 67 శాతం మంది అభ్యర్థులు, ఆంగ్లంలో పరీక్ష రాసేందుకు 32.8 శాతం మంది ఆప్షన్‌ ఎంచుకున్నట్లు నియామక మండలి తెలిపింది.

link Media ప్రజల పక్షం🖋️ 

Thursday, May 26, 2022

మోదీ హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వని.... ఏవియేషన్ అధికారులు....!

*మోదీ హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వని.... ఏవియేషన్ అధికారులు....!*

హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి బేగంపేట వెళ్లేందుకు హెలికాఫ్టర్‌లో వెళ్లాల్సి ఉండగా ఏవియేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు.హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారి భారీగా ఈదురుగాలులు వీచాయి. దీనికి తోడు పలు చోట్ల వాన కూడా పడింది. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో మోదీ హెలికాఫ్టర్‌కు ఏవియేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ప్రధాని మోదీ రోడ్డు మార్గం గుండా 18 కిలోమీటర్లు ప్రయాణించి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి చెన్నై బయలుదేరారు.

link Media ప్రజల పక్షం🖋️

Wednesday, May 25, 2022

నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురి చేసింది..... ఎమోషనల్ అయిన రాహుల్ గాంధీ

*నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురి చేసింది..... ఎమోషనల్ అయిన రాహుల్ గాంధీ*

కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురిచేసిందని, అయినప్పటికీ ఆ ఘటన నా జీవితంలో ఎంతో జీవిత అనుభవాలను నేర్పించిందని అన్నారుబ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ క్రేం బ్రిడ్జ్ లో ఏర్పాటు చేసిన ఓ ముఖాముఖి కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత సంతతి విద్యావేత్త డాక్టర్ శ్రుతి కపిలా రాజీవ్ గాంధీ వర్ధంతిని ప్రస్తావించి హింస, వ్యక్తిగతంగా మనుగడ సాగించడం ఎలా అని ప్రశ్నించారు. దీనికి రాహుల్ గాంధీ బదులిస్తూ.. నా జీవితంలో అతిపెద్ద అభ్యసన అనుభవం మా నాన్న మరణం. అంతకంటే అతిపెద్ద ఘటన ఏదీలేదు. అయితే మా నాన్నను చంపిన దళం చేసిన పని నాకు అత్యంత బాధను మిగిల్చింది. ఓ కొడుకుగా నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురిచేసిందిఅయినప్పటికీ ఆ ఘటన నా జీవితంలో ఎంతో జీవిత అనుభవాలను నేర్పించింది. అందుకే మీరు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నంతకాలం దుర్మార్గులు ఎలా ఉన్నా పర్వాలేదు అంటూ రాహుల్ గాంధీ బదులిచ్చారు. బలమైన శక్తులను ఎదుర్కొనే సమయం ఎప్పుడూ బాధపడాల్సి వస్తుంది. అదే సమయంలో అటువంటి శక్తులపై ఎలా పోరాడాలో తెలుస్తుందంటూ రాహుల్ పేర్కొన్నారు. రాజకీయాలు అనేవి సరదాగా చేసుకొనే వ్యాపారం మాత్రం కాదు. రాజకీయ నాయకుడు ప్రజల కోసం, ప్రజల మధ్య ఉండి వారి బాగోగుల కోసం ఎల్లప్పుడూ పని చేయాలి అంటూ రాహుల్ పేర్కొన్నారు. భారత ప్రత్యేకతను చాటే కీలక వ్యవస్థలపై ప్రణాళికాబద్ధ దాడి జరుగుతోందని రాహుల్ ఆరోపించారు. కీలక వ్యవస్థల గొంతు నొక్కేసి, ఆ స్థానంలోకి ప్రవేశించిన తెరవెనుక శక్తులు, తమ సొంత బాణీని వినిపిస్తున్నాయన్నారు.దేశానికి ఆత్మగా భావించే కీలకమైన పార్లమెంట్, ఎన్నికల సంఘం, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఒకే సంస్థ గుప్పిట్లో ఉంచుకుందని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ చెప్పే దార్శనికత దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలను సమ్మిళితం చేసేది కాదన్న రాహుల్.. 20 కోట్ల మంది ప్రజలను ఏకాకులుగా మారుస్తూ వారిని దుష్టులుగా చిత్రీకరించడం అత్యంత ప్రమాదకరమని ముస్లింలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ విధానాలపై అవసరమైతే జీవితకాలం పోరాడతామంటూ రాహుల్ తెలిపారు

link Media ప్రజల పక్షం🖋️ 

ఎమ్మెల్యే అండతో నా ఇల్లు కబ్జా చేశారు జవాన్

https://twitter.com/major_pawan/status/1529014387217813504?t=HRz2HGep9VFJxjcT8fZWpA&s=08            Sorry can you tell me how can I help you...Major Pawan Kumar

---------------------------------------------------------------

Major,Khureshi has grabbed the property of a soldier while he was delivering his duties. The matter was reported to the additional collector in a program called 'Praja Wani' seeking immediate justice. Need your interference and helping hand in the matter to do justice.... AVR(Prajasankalpam Honorary Advisor)

  ప్రజావాణి లో అదనపు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ని కలిసి భారత జాతీయ జెండా ను చేత బూని ఒక సైనికుడు ఫిర్యాదు చేసాడు అంటే నిజానిజాలు వెంటనే తెలుసుకొని ఖురేషి పై చట్టపరమైన చర్యలు చేపట్టి బాధితునికి న్యాయం చేయాలి. సమస్య తీవ్రముగా ఉంటే రాజకీయ వత్తిడులు ఉంటే సైన్యం సహాయం కోరాలి.... AVR(ప్రజా సంకల్పం గౌరవ సలహాదారులు)

https://twitter.com/Praja_Snklpm/status/1529012671810441216?t=4OHlUxclgol1PguP44z8pQ&s=19

 prajasankalpam1.blogspot.com

Tuesday, May 24, 2022

చెల్లికి న్యాయం కోసం.... ఢిల్లీకి..తల్లితో కలిసి ఎడ్లబండిపై ప్రయాణం

*చెల్లికి న్యాయం కోసం.... ఢిల్లీకి*

*తల్లితో కలిసి ఎడ్లబండిపై ప్రయాణం*

*బోనకల్‌....*
అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన చెల్లిని చూసి కుమిలిపోయాడా అన్న.కుటుంబ సభ్యులతో కలిసి పోరాడినా.. తమ రాష్ట్రంలో న్యాయం దొరకదన్న ఆవేదనతో తల్లితో కలిసి ఎడ్ల బండిపై దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామ యువకుడు నేలవెల్లి నాగదుర్గారావు వ్యథ ఇది. తన సోదరికి న్యాయం చేయాలని వేడుకుంటూ ఈ నెల 23న తల్లి జ్యోతితో కలిసి ఢిల్లీ యాత్ర ప్రారంభించాడు.

మంగళవారం సాయంత్రం ఖమ్మం జిల్లా బోనకల్‌ గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. తన సోదరి నవ్యతను అదే మండలంలోని చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌కిచ్చి 2018లో వివాహం చేశామని చెప్పాడు. కట్నంగా రూ.23 లక్షల నగదు, 320 గ్రాముల బంగారం, 3 ఎకరాల పొలం ఇచ్చామని తెలిపాడు.

పెళ్లి తర్వాత భర్త సక్రమంగా లేడని, పైగా అత్తింటివారు నవ్యతను బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారని, ఆ తర్వాత ఆమెను వేధిస్తుండడంతో పుట్టింటికి వచ్చేసిందన్నాడు. జరిగిన ఘటన గురించి చందర్లపాడు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారని.. నవ్యత అత్తమామలు తమ పరపతి ఉపయోగించడంతో కేసులో ఎలాంటి పురోగతీ లేకపోయిందని వాపోయాడు. దీంతో విసిగిపోయిన తాను ఇక తమకు ఏపీలో న్యాయం దొరకదని భావించి, తన తల్లితో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీ చేరుకుని సుప్రీంకోర్టు, హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.

link Media ప్రజల పక్షం🖋️