https://twitter.com/Praja_Snklpm/status/1339774097434152960?s=08
Thursday, December 17, 2020
విజయవంతమైన PSLV C 50 రాకెట్ ప్రయోగం
హైదరాబాద్ : 17/12/2020
*భారత దేశ శాస్త్రవేత్తల కష్టానికి ఫలితం PSLV C 50 రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్ళింది.*
*ప్రజా సంకల్పం & link Media ఇస్రో శాస్త్రవేత్తలకు మొత్తం సిబ్బందికి అభినందనలు తెలువుతుంది 🎉👍🙏*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)
https://prajasankalpam1.blogspot.com/
Wednesday, December 16, 2020
ఉస్మానియా యూనివర్సిటీ ప్రశ్నించే గొంతుల మీద దాడి
హైదరాబాద్ : 17/12/2020
*ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ లో నిన్న అర్ధరాత్రి ప్రశ్నించే గొంతులు బడుగు వర్గాల విద్యార్థుల మీద తెరాస నాయకుల అనుచరుల దాడి.... ఈ దాడిని ప్రజా సంకల్పం & link Media తీవ్రంగా ఖండిస్తుంది*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)
***************************************
ఉస్మానియా విద్యార్థులారా ఇక ఉపేక్షించి లాభం లేదు. ఎంత కండ కావరము ఉంటే మీ మీద దాడికి దిగుతారు.
*కట్టేసి కొడితే పిల్లి కూడా పులి అవుతుంది*.
*బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము చలిచీమల చెంత చిక్కి చావదె సుమతి*
మీరందరూ ఒక సంఘటిత శక్తి గా మారి మీ బలమేమిటో చూపించే తరుణం ఆసన్నమైంది.
ఎవరైతే మీ పైన దాడి చేసారో వారికీ తగిన గుణపాఠం చెప్పండి.
*వెంకట రెడ్డి అమ్మన*
గౌరవ సలహాదారు
ప్రజా సంకల్పం
https://prajasankalpam1.blogspot.com/
మనిషి ఆర్థిక- సామాజిక స్థితికి, సంస్కారానికి సంబంధంలేదు.... ఋణం (మంచి కథ)
*ఋణం*
( మంచి కధ తప్పక చదవండి)
*అబ్బబ్బా ఈ కొబ్బరి ముక్కలు కాపలా కాయలేక ఛస్తున్నా! కన్ను మూసి తెరిచేలోగా తన్నుకుపోతున్నాయ్ వెధవ కాకులు. అయినా మీఛాదస్తానికి వేగలేక ఛస్తున్నాననుకోండి. ఈకాలంలోకూడా ఏమిటీ నూనె ఆడించుకోవడాలు, నాఖర్మకాకపోతే? పెచ్చులు తీయడం, ముక్కలు కోయడం, ఎండబెట్టడం.. నావల్లకాదుబాబూ. గుళ్ళోకొట్టినవన్నీ తెచ్చి నా నెత్తినపాడేస్తారు. ఇకనుంచి నా వల్లకాదు.*
*తెల్లవారుఝామున నాలుగింటికి గుడికెళ్ళిన శాస్త్రిగారు పదకొండుగంటలకి ఇంటికొచ్చారు. ఆచమనంతప్ప పచ్చిమంచినీళ్ళుకూడా తాగలేదు. ఈవిడ దండకంలో కొత్తేముంది? ఏదైనా మాట మాట్లాడితే దానికి ఉత్తరపీఠిక, స్తోత్రం, పూర్వపీఠిక, ఫలస్రుతి చెప్తేగాని ఆపదు.*
*నాక్కాస్త ఫలహారం పెడితే తిని కాసేపు నడుం వాలుస్తాను అన్నారు ఆవూరి శివాలయం పూజారి శాస్త్రిగారు*
*తిన్న తరువాత కాసేపు పేపర్ తిరగేసి గదిలోకెళ్ళి మంచమ్మీద వాలారో లేదో... గుప్పున కొట్టింది చేపల వాసన. లలితా! ఏమిటీవాసన? గదిలోంచే అరిచారు శాస్త్రిగారు. ఆకిటికీ తలుపు తెరచుకోవచ్చుగా స్వచ్ఛమైన గాలి లోపలికొస్తుంది అని అరిచారు లలితమ్మ పెరట్లోంచే, సమాధానంగా.*
*కిటికీ తలుపు తెరచిన శాస్త్రిగారు ఒక్కనిముషం కూడా అక్కడ ఉండలేకపోయారు. అరగంట క్రితం తిన్నదంతా గొంతులోకొచ్చేసింది. గబగబా బయటికి వచ్చేసి, ఏంటోచూడు అరుగుమీద ఏముందో.... దుంపతెగ ప్రేగులు కూడా బయటికి వచ్చేసేటట్టున్నాయ్!" అనగానే....*
*ఇంద ఈ ముక్కల దగ్గర నుంచోండి చూసొస్తాను అని వీధితలుపు తెరచి మళ్ళీ ఏదో దండకం మొదలెట్టారు లలితమ్మ.* *ఈసారి ఎవరిమీదనో భద్రకాళిలా విరుచుకు పడిపోతోంది. విసురుగా పెరట్లోకొచ్చి శాస్త్రిగారికి చెప్పింది ఎవరో ముసలమ్మ.... చేపలగంప పెట్టుక్కూర్చుంది అరుగుమీద. ఇంకే అరుగు దొరకనట్టుంది. ఓ బకెట్టు నీళ్ళు పట్టుకెళ్ళి జల్లండి ఆవేశంగా చెప్పి వెళ్ళి మరల కొబ్బరి ముక్కలదగ్గర స్టూలుమీద కూర్చున్నారు లలితమ్మ.*
*వీధి అరుగు మీదికి నీళ్ళు పట్టుకెళ్ళేసరికి ఆ ముసలమ్మ అక్కడే ఉంది, లేచి నిలబడటానికి కూడా సత్తువలేనట్టుంది. గంప ఎత్తుకోబోయి తూలిపడి, ఎలాగో తమాయించుకుని లేచింది. ఏమ్మా, ఒంట్లో బాలేదా? ఏమయ్యింది? అడిగారు శాస్త్రిగారు.*
*అవును బాబయ్యా, జొరమొచ్చేసింది. గొంతెండిపోతుంది చాల నీరసంగా చెప్పింది ముసలమ్మ.*
*సరే ఆగంప అలా సందులో పెట్టుకుని వచ్చి కుర్చో! ఈలోగ మంచినీళ్ళు తెస్తాను అని లోపలికెళ్ళి, నీళ్ళు, గోరువెచ్చని పాలు చెరో గాజు గ్లాసులోనూ పట్టుకొచ్చారు శాస్త్రిగారు.* *సందులో ఆడుకుంటున్న ఓ పిల్లాణ్ణి పిలిచి పదిరూపాలిచ్చి కిరాణాకొట్టుకెళ్ళి ఒక రొట్టె తీసుకురమ్మన్నారు.*
*ఇంద ఈ రొట్టెతిని పాలుతాగు. తరవాత ఈ బిళ్ళవేసుకుని అలా కాసేపు ఒరుగు. అదే సర్దుకుంటుంది అని ఒక క్రోసిన్ టేబ్లెట్ కూడా ఇచ్చారు.*
*గంటతరవాత వచ్చిచూస్తే అమె అక్కడ లేదు. గంపతీసుకుని వెళ్ళిపోయింది.*
*విషయం తెలుసుకున్న లలితమ్మ మళ్ళీ దండకం మొదలెట్టారు. పళ్ళెంలో పడే రూపాయి దక్షిణకోసం పాకులాడే బ్రతుకులు మనవి. సంఘసేవొకటి. సాయంత్రం ప్రసాదంకోసం ఉంచిన పాలు అవి ఇప్పుడెక్కడి నుంచి తెస్తారు? కొబ్బరిముక్కలు ఎండబెట్టుకోవడానికి వలనేయించమని ఏళ్ళుగా మొత్తుకుంటున్నా. నన్ను ఎండలో కాపలా పెడతారు గాని ఓ వంద రూపాయలిచ్చి వల మాత్రం అల్లించరు. పదిరూపాయలిచ్చి రొట్టెకూడా కొనిచ్చేరంట. ఏంత ఉదారమో? వ్యంగ్యంగా అంటూ మూతి ముప్పై వంకర్లు తిప్పారు.*
*పోన్లేవే జ్వరంతో ఉంది. పాలదేముంది.. ప్రెసిడెంటుగారికి కబురెట్టి ఒక లీటరు పాలు పంపించమంటే సరి. ప్రసాదానికే కదా. సర్దిచెప్పడానికి చెపుదామనుకున్నారు గాని, తనలో తానే అనుకోగలిగారు.*
*నెలరోజులు గడిచాయి. సాయంత్రం అయిదింటికి పంచె కట్టుకుని పళ్ళెం పట్టుకుని బయలుదేరారు శాస్త్రిగారు గుడితలుపులు తెరవడానికి.* *వీధి తలుపు తెరవగానే, గుమ్మంలో నుంచుని ఉంది ముసలమ్మ. అరుగుమీద గంప పెట్టి ఉంది. కానీ వాసన రావట్లేదు. చక్కగా వుతికి ఆరేసిన చీర కట్టుకుని పెద్ద కుంకుమబొట్టు పెట్టుకుని చేతులు జోడించి దణ్ణంపెట్టింది, శాస్త్రిగారిని చూసి.*
*ఏమ్మా ఇప్పుడెలాఉన్నావ్ అని అడిగారు శాస్త్రిగారు.*
*బాగున్నాను బాబయ్య. ఆపదలో కాపాడేరు. మీరుణం తీర్చుకోలేను.*
*ఏంపర్లేదమ్మా. నేనేంచేసాను. ఒక బిళ్ళ , కాసిని పాలు ఇచ్చాను అంతేకదా! వెళ్ళిరా! అని ముందుకి కదలబోయారు శాస్త్రిగారు.*
*లేదుబాబయ్యా. ఇది మీకోసమే తెచ్చాను అంది గంపచూపిస్తూ.*
*ఏముంది అందులో అడిగారు శాస్త్రిగారు.*
*మాయింటికాడ కొబ్బిరి సెట్టుందండి. పదికాయలు దింపించి ఒలిపించాను.* *మా ఆయన మోకుతాళ్లు అల్లుతాడండి పదిగజాల తాడు అల్లించాను. గిలకబావి సేద క్కట్టుకోవచ్చండి. మరేమోనండి సిక్కం కూడా అల్లించేనండి.*
*సిక్కమా, అదేంటి? అర్థంకాక అడిగారు శాస్త్రిగారు.*
*వలండీ వల. ఏవన్నా ఎండలో ఎండబెట్టుకుంటే సిక్కమేసేత్తే ఇంక కాకుల గొడవుండదండి. ఇంకా చింతచిగురు, సీమసింతకాయలు కూడా వున్నాయండి. కొత్త గంపండి. సేపలు గట్రా దీనికి అంటుకోలేదండి. గంపను ఉన్న పళంగా లోపలకట్టుకుపోండి. మీరు పంతులుగోరు కదండి బాబయ్యా. మడీ ఆశారం ఉంటాదని నేనే తానం సేసి కట్టేనండి అన్నీని. ఆయ్!*
*గుక్కతిప్పుకోకుండా చేప్పేస్తుంటే.. నిశ్చేష్టులై వింటున్నారు శాస్త్రిగారు. పువ్వుల పొట్లం మర్చిపోయారండీ అంటూ ఉంటే... శాస్త్రిగారి వెనకాలే వచ్చి అన్నీ విన్న లలితమ్మకు నోటమాటలు రాలేదు.*
*ఎల్లోత్తానండి పంతులుగోరు... దండాలండి అమ్మగోరు అని ఇద్దరికి దణ్ణాలు పెట్టేసి వెళ్ళిపోబోతుంటే ఆపి మొల సంచిలోంచి యాభై రూపాయలు తీసి ఇవ్వబోయారు శాస్త్రిగారు.*
*వద్దు బాబయ్య. తమలాంటి దర్మ పెబువుల దగ్గర మేం పుచ్చుకోగూడదు. వత్తానండయ్యా అని మళ్ళీ దణ్ణం పెట్టి వెళ్ళిపోయింది.*
*( *మనిషి ఆర్థిక- సామాజిక స్థితికి, సంస్కారానికి సంబంధంలేదు )*
link Media సౌజన్యంతో
🍃🌸🍃🌸🍃🌸
Shri. Mahesh Muralidhar Bhagwat ji*Commissioner of Police, Rachakonda.
*Shri. Mahesh Muralidhar Bhagwat ji*
Commissioner of Police, Rachakonda.
🙏
Dear Sir,
Thanks for rewarding the team involved in yesterday's timely execution of duties and saving a life.
My special thanks to IT cell for their immediate response for utilising the technology in locating the person who was in trouble.
Without this the problem could not have been solved.
We have been firing around the bush without knowing the target. B. Ravikanth Neta was not responding to our calls and we were trying vigorously to identify this boy and spreading the news in social media.
Simultaneously we called 100 for help and things worked out very well. However it ended up nicely.
At this juncture may I request your good selves to keep an eye on this boy's movements and I suggest he has to be sent to a rehabilitation center for further treatment.
Thank you.
*Ammana Venkat Reddy*
Honorary Advisor
Praja Sankalpam
Tuesday, December 15, 2020
LRS ఫై సుప్రీం కోర్ట్ లో విచారణ
హైదరాబాద్ : 16/12/2020
*ఎల్ఆర్ఎస్ పై సుప్రీంలో విచారణ*
ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం)పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సరైన అధ్యయనం లేకుండా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తున్నారని *జనగాం వాసి జువ్వాడి సాగర్‌రావు సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.*
పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు సహా *ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది*.
ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా అక్రమాలకు పాల్పడిన రియల్ ఎస్టేట్ వాళ్లను, అధికారులను వదిలేసి ప్లాట్లు కొన్న వారు, ఇళ్లు కట్టుకున్న వారిని శిక్షిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
అక్రమ లేఔట్ల వల్ల వరదలతో సహా అనేక సమస్యలు వస్తాయని హైదరాబాద్, చెన్నైలో వచ్చిన వరదలు రుజువు చేస్తున్నాయని పిటిషనర్ వివరించారు. అక్రమ లే ఔట్లకు అనుమతి ఇచ్చిన వారిపై విచారణ జరపాలని కోరారు.
*link Media*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)
https://prajasankalpam1.blogspot.com/
Monday, December 14, 2020
ప్రజా నాయకుడు అంటే సోమశేఖర్ రెడ్డి
హైదరాబాద్ : 15/12/2020
*ప్రజలకోసం తపించే నాయకులు ఈ రోజుల్లో కొందరే వున్నారు... వారిలో సోమశేఖర్ రెడ్డి (AS రావు నగర్ కార్పొరేటర్ భర్త) ఒకరు. ప్రజా సంకల్పం & link Media అభినందనలు తెలుపుతుంది సోమశేఖర్ రెడ్డి గారు సేవలకు 🙏.*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)
https://prajasankalpam1.blogspot.com/
Subscribe to:
Posts (Atom)