హైదరాబాద్ : 16/12/2020
*ఎల్ఆర్ఎస్ పై సుప్రీంలో విచారణ*
ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం)పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సరైన అధ్యయనం లేకుండా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తున్నారని *జనగాం వాసి జువ్వాడి సాగర్‌రావు సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.*
పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు సహా *ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది*.
ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా అక్రమాలకు పాల్పడిన రియల్ ఎస్టేట్ వాళ్లను, అధికారులను వదిలేసి ప్లాట్లు కొన్న వారు, ఇళ్లు కట్టుకున్న వారిని శిక్షిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
అక్రమ లేఔట్ల వల్ల వరదలతో సహా అనేక సమస్యలు వస్తాయని హైదరాబాద్, చెన్నైలో వచ్చిన వరదలు రుజువు చేస్తున్నాయని పిటిషనర్ వివరించారు. అక్రమ లే ఔట్లకు అనుమతి ఇచ్చిన వారిపై విచారణ జరపాలని కోరారు.
*link Media*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment