Sunday, July 5, 2020

చెరువులు పరిరక్షణ

హైదరాబాద్ : 05/07/2020

పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాలు రక్షణకు మరో వినూత్న కార్యక్రమం

• ఇందుకోసం ప్రత్యేకంగా అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు
• ఇందుకు సంబంధించిన 1800-599-0099 టోల్ ఫ్రీ నెంబర్ ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
• హైదరాబాద్ పరిధిలోని చెరువులు, బహిరంగ స్థలాలు, పార్కుల రక్షణ కోసం ఫిర్యాదు లేదా సమాచారం టోల్ ఫ్రీ నెంబర్ కి అందించవచ్చు
• అన్ని పనిదినాల్లో 10 గంటల నుంచి 6 గంటల వరకు పనిచేస్తుంది
• సమాచారం అందించే వారి  వివరాలు కోరుకుంటే గోప్యంగా ఉంచబడతాయి

 హైదరాబాద్ నగరంలోని పార్కులు, చెరువులు మరియు బహిరంగ స్థలాలను కాపాడేందుకు ప్రభుత్వం మరో వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టింది. చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాల్లో ఎవరైనా కబ్జాకు పాల్పడినా, అందులో ఇతరత్రా కార్యక్రమాలు చేపట్టినా వెంటనే ప్రభుత్వానికి తెలిపేలా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని ప్రారంభించింది. ఇందుకోసం జిహెచ్ఎంసి డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ప్రత్యేకంగా అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ ను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన టోల్ ప్రీ నెంబర్ ని మరియు ఇతర వివరాలను ఈరోజు ప్రగతి భవన్ లో మంత్రి కే తారకరామారావు లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని నగరంలోని చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాల రక్షణకు ప్రభుత్వంతో కలిసి రావాలని మంత్రి కెటియార్ ప్రజలను కోరారు.

1800-599-0099 టోల్ ఫ్రీ నెంబర్ కి పౌరులు ఎవరైనా ఫోన్ చేసి సమాచారం అందించే వెసులుబాటుని అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ కల్పించనుంది. ఎవరైనా పౌరులు ఫిర్యాదు లేదా సమాచారం అందిస్తే వెంటనే ఒక ప్రత్యేకమైనన ఫిర్యాదుగా నమోదు అవుతుంది. ప్రతి సమాచారానికి లేదా ఫిర్యాదుకు ప్రత్యేకంగా ఒక ఒక విశిష్ట సంఖ్యను కేటాయించడం జరుగుతుంది. ఈ విశిష్ట సంఖ్య ద్వారా భవిష్యత్తులో తన ఫిర్యాదు పురోగతిని పౌరులు తెలుసుకునే వీలుంటుంది. ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే అసిస్టెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారికి సమాచారం వెళుతుంది. ఈయన తనకు అందిన సమాచారం లేదా ఫిర్యాదు పైన వెంటనే విచారణ మొదలు పెట్టి చెరువులు, పార్కులు, బహిరంగ ప్రదేశాలను కబ్జాల నుంచి కాపాడే కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ పరిధిలోని జోన్లు, సర్కిళ్లలో ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించారు. అయితే ఫిర్యాదు ఇచ్చే వ్యక్తి తన కోరుకుంటే తన వివరాలు బయటకు రాకుండా గొప్యత పాటించే వెసులుబాటు కూడా ఈ ప్రక్రియలో ఉన్నది. ఈమేరకు సమాచారం లేదా ఫిర్యాదు అందించిన వ్యక్తి వివరాలను బయటకి చెప్పకుండా కాపాడతాయి. పార్కులు, చెరువులు, బహిరంగ ప్రదేశాల అస్సెట్ ప్రొటెక్షన్ సెల్  అన్ని పని దినాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది.

ఈరోజు ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, ఈ వి డి ఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, జిహెచ్ఎంసి సిపిపి దేవేందర్ రెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

కరోనా ఎఫెక్ట్ తెలంగాణ లో

హైదరాబాద్ :05/07/3020

తెలంగాణలో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అత్యధిక కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదవుతున్నాయి. దీంతో అనేకమంది తమ సొంతూళ్లకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. మీ అభిప్రాయం ఏంటి?

మీ అభిప్రాయాలు @bbcnewstelugu కు ట్వీట్ చేయండి 👍🙏
#Coronavirus #Telangana #Hyderabad https://t.co/bm9Zb01HCH

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

Saturday, July 4, 2020

గురు పూర్ణిమ శుభాకాంక్షలు

హైదరాబాద్ : 05/07/2020

గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః 

ప్రజా సంకల్పం మరియు link Media ద్వారా గురువులందరికి గురుపూర్ణిమ శుభాకాంక్షలు 🙏

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

పోలీస్ సిబ్బంది ఆరోగ్యం కోసం

హైదరాబాద్ : 04/07/2020

*మానసిక సమస్యలపై రాచకొండ పోలీసులకు కౌన్సిలింగ్​*

రంగారెడ్డి జిల్లాలో రాచకొండ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని పోలీసులకు సీపీ మహేశ్​ భగవత్​ ఆధ్వర్యంలో మానసిక నిపుణులతో కౌన్సిలింగ్​ను నిర్వహించారు. వెబినార్​ ద్వారా మానసిక నిపుణుల సలహాలు అందించారు. ఇప్పటికే చాలా మంది డిప్రెషన్​, ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచనల నుంచి బయటపడినట్లు సీపీ భగవత్​ వెల్లడించారు.

*రాచకొండ పోలీసులకు మానసిక సమస్యలపై కౌన్సిలింగ్​ను ఏర్పాటు చేశారు. నిపుణుల సలహాలను పాటించి ఇప్పటికే చాలా మంది డిప్రెషన్​, ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచనల నుంచి బయటపడినట్లు రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ వెల్లడించారు.*

ఎంతో మంది సామాన్య ప్రజలు హెల్ప్​లైన్లకు ఫోన్​ చేయగా.. డా. అనిత, అమీనా హుస్సేన్, కవితా నటరాజన్, కీర్తిరెడ్డిలు వారికి మార్గదర్శకులుగా వ్యవహరించి.. డిప్రెషన్​ నుంచి బయటకు వచ్చేందుకు సహాయపడ్డారు. శనివారం పోలీసులకు, నిపుణులకు వెబినార్​ ఏర్పాటు చేశారు. మనిషికి స్వీయ ఒత్తిడి, వేరేవారి వల్ల ఒత్తిడి లక్షణాలు ఎలా వస్తాయి? వాటిని ఎలా గుర్తించవచ్చు అనే విషయాన్ని డా. అనిత వివరించారు. ఇవి దూరమవ్వడానికి చిట్కాలను, కొన్ని పద్ధతులను సూచించారు.లాక్​డౌన్​ దృష్ట్యా ప్రతి ఒక్కరూ పాజిటివ్​గా ఉండాలంటూ డాక్టర్ అమీనా హుస్సేన్ సూచించారు. ఇందుకోసం చేయాల్సిన కొన్ని అంశాలను ఆమె పోలీసులకు తెలిపారు. మనశ్శాంతిని పెంచే మూడు టెక్నిక్​లను అందరికీ చెప్పి వారిని ఉత్తేజపరిచారు డాక్టర్ కవితా నటరాజన్. డిప్రెషన్​ను గుర్తించడం, దానిని ఎదుర్కోవటానికి మార్గాల గురించి డాక్టర్ కీర్తీరెడ్డి వివరించారు.లాక్​డౌన్​లోనూ... హెల్ప్​లైన్ ద్వారా ఎంతో కృషి చేస్తున్న నిపుణులకు సీపీ మహేశ్​ భగవత్​ ధన్యవాదాలు తెలిపారు. *మనసులో ఆందోళన, ఒత్తిడి లాంటి సమస్యలకు సంబంధించి ఏ పోలీసు అధికారికి ఎలాంటి సహాయం కావాలన్నా 040-4821 4800 హెల్ప్​లైన్​ను సంప్రదించాలని సీపీ సూచించారు.*

Source : ఈtv తెలంగాణ 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

పెట్రోల్ డీజిల్ ధరలు

Hyderabad : 04/07/2020

We youth Congress team had given Representation letter at UPPAL COMMISSIONER office behalf of to Reduce the Petrol nd Diesel prices charges in Corona situation 
@IYCTelangana @IYC @srinivasiyc @Allavaru @Ravindradass @AnilTpyc @BandiShyamGoud @shravan3303 @Secretary_IYC

Source : Bosani Pawan kumar 
https://prajasankalpam1.blogspot.com/

Friday, July 3, 2020

ప్రజా సంకల్పం

ఒక మంచి సంకల్పంతో  కొత్త ఆశయాలతో  నమ్మకంతో పట్టుదలతో ప్రయాణం లో  ముందుకెళ్తున్న ... 

*ప్రజా సంకల్పం* వాట్సాప్ 
*Praja_Snklpm* twitter 
*prj_snklpm9456* instagram 
*prajasankalpam1@gmail.com*
*Telegram **
*https://prajasankalpam1.blogspot.com/* website

వికారాబాద్ జిల్లా పోలీసుల ఔదార్యం

తాండూర్ నియోజకవర్గ ప్రాంతములో కురిసిన భారీ వర్షముతో కాగ్ననది ప్రాంతములో ఉన్నటువంటి రోడ్డుకు  భారీ గండి పడి రోజు వారీగా నడిచే రవాణా సౌకర్యాలు నిలిచిపోవడముతో    జిల్లా పరిపాలన ,పోలీసు ,అధికార యంత్రాంగము రంగములోకి దిగి తెగిపోయిన రోడ్డును బాగు చేశారు  @TelanganaDGP @TelanganaCOPs https://t.co/T6ku6oT6yz

https://prajasankalpam1.blogspot.com/