Saturday, July 4, 2020

పోలీస్ సిబ్బంది ఆరోగ్యం కోసం

హైదరాబాద్ : 04/07/2020

*మానసిక సమస్యలపై రాచకొండ పోలీసులకు కౌన్సిలింగ్​*

రంగారెడ్డి జిల్లాలో రాచకొండ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని పోలీసులకు సీపీ మహేశ్​ భగవత్​ ఆధ్వర్యంలో మానసిక నిపుణులతో కౌన్సిలింగ్​ను నిర్వహించారు. వెబినార్​ ద్వారా మానసిక నిపుణుల సలహాలు అందించారు. ఇప్పటికే చాలా మంది డిప్రెషన్​, ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచనల నుంచి బయటపడినట్లు సీపీ భగవత్​ వెల్లడించారు.

*రాచకొండ పోలీసులకు మానసిక సమస్యలపై కౌన్సిలింగ్​ను ఏర్పాటు చేశారు. నిపుణుల సలహాలను పాటించి ఇప్పటికే చాలా మంది డిప్రెషన్​, ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచనల నుంచి బయటపడినట్లు రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ వెల్లడించారు.*

ఎంతో మంది సామాన్య ప్రజలు హెల్ప్​లైన్లకు ఫోన్​ చేయగా.. డా. అనిత, అమీనా హుస్సేన్, కవితా నటరాజన్, కీర్తిరెడ్డిలు వారికి మార్గదర్శకులుగా వ్యవహరించి.. డిప్రెషన్​ నుంచి బయటకు వచ్చేందుకు సహాయపడ్డారు. శనివారం పోలీసులకు, నిపుణులకు వెబినార్​ ఏర్పాటు చేశారు. మనిషికి స్వీయ ఒత్తిడి, వేరేవారి వల్ల ఒత్తిడి లక్షణాలు ఎలా వస్తాయి? వాటిని ఎలా గుర్తించవచ్చు అనే విషయాన్ని డా. అనిత వివరించారు. ఇవి దూరమవ్వడానికి చిట్కాలను, కొన్ని పద్ధతులను సూచించారు.లాక్​డౌన్​ దృష్ట్యా ప్రతి ఒక్కరూ పాజిటివ్​గా ఉండాలంటూ డాక్టర్ అమీనా హుస్సేన్ సూచించారు. ఇందుకోసం చేయాల్సిన కొన్ని అంశాలను ఆమె పోలీసులకు తెలిపారు. మనశ్శాంతిని పెంచే మూడు టెక్నిక్​లను అందరికీ చెప్పి వారిని ఉత్తేజపరిచారు డాక్టర్ కవితా నటరాజన్. డిప్రెషన్​ను గుర్తించడం, దానిని ఎదుర్కోవటానికి మార్గాల గురించి డాక్టర్ కీర్తీరెడ్డి వివరించారు.లాక్​డౌన్​లోనూ... హెల్ప్​లైన్ ద్వారా ఎంతో కృషి చేస్తున్న నిపుణులకు సీపీ మహేశ్​ భగవత్​ ధన్యవాదాలు తెలిపారు. *మనసులో ఆందోళన, ఒత్తిడి లాంటి సమస్యలకు సంబంధించి ఏ పోలీసు అధికారికి ఎలాంటి సహాయం కావాలన్నా 040-4821 4800 హెల్ప్​లైన్​ను సంప్రదించాలని సీపీ సూచించారు.*

Source : ఈtv తెలంగాణ 

ప్రజా సంకల్పం 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment