Monday, January 6, 2025

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

A Case of Criminal Misconduct has been registered against K. Jagadeesh, Circle Inspector of Police, Thorrur of Mahabubabad District for demanding #Bribe of Rs.4,00,000/- from the complainant, to show official favour of not arresting him, to give only notice and to not harass him in a registered case against the complainant. Initially the CI accepted Rs.2,00,000/- and further he demanded for the remaining amount.

“Dial 1064 for Reporting Corruption”

నమోదు కాబడిన ఒక కేసులో నిందితునిని అరెస్ట్ చెయకుండా, నోటీసు ఇవ్వడానికి మరియు అతనిపై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఫిర్యాదుదారుని నుండి రూ.4,00,000/- లంచం డిమాండ్ చేసి అందులో మొదటి విడుతగా రూ.2,00,000/- తీసుకొని మిగిలిన నగదును కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినందుకు గాను మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్  కె.జగదీష్‌ పై క్రిమినల్ దుర్వినియోగం కేసు నమోదు చేసిన #అనిశా.

“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”

Courtesy / Source by :  
https://x.com/TelanganaACB/status/1876234361881993516?t=5u4InvmuZAlacIpwYjDCYw&s=19
***-----***-----***-----***

*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*

*_శాంతి భద్రతలను సంరక్షిస్తూ,ప్రజల జీవితాలకు,ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ,నేరాలు,విధ్వంసాలు జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు.శాంతిభద్రతలను కాపాడటం,పౌరులను,వారి ఆస్తులను రక్షించడం,నేరాలను నిరోధించడం,దర్యాప్తు చేయడం, వారి అధికార పరిధిలో చట్టాలు, నిబంధనలను అమలు చేయడం వంటివి పోలీసుల బాధ్యత._*

*_👆పైన తెలిపినట్లు ఎంతమంది పోలీస్ అధికారులు సిబ్బంది ప్రజలకు జవాబుదారీతనంగా తమ విధులకు న్యాయం చేస్తుండ్రు ??._*

*_#Facts / #వాస్తవాలు : #తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ఈరోజు వరకు తెలంగాణ పోలీస్ శాఖ లోని చాలామంది అధికారులు సిబ్బంది పాలకులు / ప్రజాప్రతినిధులు చెప్పినట్లు నడుచుకుంటున్నారు. ఇది నిజం. అందుకు ఉదాహరణ నిత్యం సోషల్ మీడియా వేదికగా ఎన్నో సంఘటనలు వాస్తవాలతో చూస్తున్నారు ప్రజలు. తప్పుడు కేసులు.. విచారణ పేరుతో రోజుల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుకోవడం. ఇక అవినీతి గురించి చెప్పనక్కరలేదు. గౌరవ న్యాయస్థానాలు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా మారని అవినీతి పోలీస్ అధికారులు._*

*_భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు #Article19To21 కు అనుగుణంగా అన్యాయాలను, అవినీతిని ప్రశ్నించే గొంతుల మీద అక్రమంగా కేసులు పెట్టడం అందరికి తెలిసిందే. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే పాలకులకు / ప్రజాప్రతినిధులకు / బడాబాబులకు తొత్తులుగా ఉండడమే. చివరకు బలి అవుతుంది ఇలాంటి అధికారులే._*

*_#పోలీస్ అనే పదానికి వన్నె తెచ్చిన , తెస్తున్న పోలీస్ అధికారులు కొందరే మిగిలారు... వీరికి హ్యాట్సాఫ్. ఇలాంటి అధికారుల వల్ల ప్రజలకు ఇంకా నమ్మకం పోలీస్ అంటే._*

*_చివరిగా ఒక్కటే చెప్పేది #రాజ్యాంగం కు గౌరవం ఇచ్చి ప్రజాస్వామ్య బద్దంగా, ప్రజలకు జవాబుదారీతనంగా నడుచుకోవాలి ఎవరైనా....గౌరవ న్యాయస్తానాలు ఉన్నాయి అని మరిచిపోవద్దు._*

*#IndianConstitution*
*#SupremeCourtIND*
*#TelanganaHighCourt*
*#Article19To21*
*#HumanRights*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

*పరిమళించిన మానవత్వం..*

.... 
*పరిమళించిన మానవత్వం..*

*800 మంది విద్యార్థులకు....రేపటి  నుండి ప్రభుత్వ జూనియర్  కలశాలలో మధ్యాహ్న భోజనం.*

*ఎమ్మెల్యే సొంత ఖర్చులతో పెద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.* 


షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుండి  ఉన్నత  చదువుల నిమిత్తం షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువును కొనసాగిస్తున్న 800 మంది  విద్యార్థులకు తన సొంత ఖర్చులతో షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ మధ్యాహ్నం భోజన వసతిని కల్పిస్తున్నారు.  గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వల్ల ఇబ్బంది  పడుతున్న దుస్థితి తెలుసుకున్న ఆయన మానవత్వంతో స్పందించి నేటి నుండి విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యే వరకు భోజనాన్ని తన సొంత ఖర్చులతో పెట్టిస్తున్నారు.

*గంతల నాగరాజు రిపోర్టర్*

***----***-----***-----***-----***

*_ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు అన్నదాత గా అండగా ఉన్న #షాద్నగర్ MLA గారికి అభినందనలు తెలియచేస్తుంది 'ప్రజాసంకల్పం Group Link Media '_*

*#Shadnagar #షాద్నగర్*

*@edu_commissonTG @Murali_IASretd @ShankarannaJ @ShankarMla40000*

*@TelanganaCMO @TelanganaCS @IPRTelangana @cyberabadpolice @MC_Shadnagar @acpshadnr_cyb @INCTelangana*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*

Sunday, January 5, 2025

Happy birthday Kapil Dev sir 💐

@therealkapildev

Happy birthday sir 💐

#kapildev #HaryanaHaricane

#BCCI #IndianCricket #ICC
#Legend

@PTI_News @BCCI @BCCIWomen @virender_swag

Bplkm✍️

https://x.com/Praja_Snklpm/status/1876169485608231020?t=EuBZNhlpTb-78M88J35r8w&s=19


*_లిక్కర్ కవితమ్మా.... ఏందీ బీసీ ముసుగు ??_*


*_లిక్కర్ కవితమ్మా.... ఏందీ బీసీ ముసుగు ??_*

*#BackwardClassesInTelangana* *#KCR* *#KTR* *#BRS*
*#kalvakuntlakavitharao*

*@ahir_hansraj*
*@NCBC_INDIA*

*@GpkOfficial_ @Bmaheshgoud6666 @TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @IPRTelangana* *@CPRO_TGCM*
*@seethakkaMLA* *@Ponnam_INC @OffDSB* *@INCTelangana*
*@ProfKodandaram*

*@KCRBRSPresident @KTRBRS @RaoKavitha @BRSHarish @sravandasoju @RakeshReddyBRS*   

*@ryagakrishnaiah*
*@Voice2Bc*

*#pashamyadagiri #anamchinnivenkateshwararao #kkrAWJA #TJSS #AWJA*

https://x.com/Praja_Snklpm/status/1875845322871845222?t=ok7vskvHXtvMU3vcT6CNDA&s=08

Saturday, January 4, 2025

*_లిక్కర్ కవితమ్మా... ఏందీ బిసీ ముసుగు.!_*

*_లిక్కర్ కవితమ్మా... ఏందీ బిసీ ముసుగు.!_*

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_కవిత రాజకీయాల ధోరణే విచిత్రం.! అప్పుడప్పుడూ మరో షర్మిల అనిపిస్తుంటుంది.! దొందూ దొందే.! లిక్కర్ స్కాంలో నిండా మునిగినప్పుడు 'జై తెలంగాణ' అంటూ, 'తెలంగాణ తల వంచదు' అంటూ తన స్కాంకు తెలంగాణతనాన్ని ముడిపెట్టడం చిరాకు తెప్పించింది. అదో వెగటు సినిమా టిక్ డ్రామా.! డబ్బు కోసం నానా అడ్డదార్లూ తొక్కి, తనేదో 'వీర తెలంగాణ వనిత' అన్నట్టు, ఆ మద్యం కుంభకోణం కూడా 'తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం' అన్నట్టు కలరింగు ఇవ్వడాన్ని యావత్ తెలంగాణ సమాజం ఏవగించుకుంది. తనకున్న ఫీడ్ బ్యాక్ ఏమిటో గానీ..!! అదో పెద్ద దరిద్రం._*

*_మీ 'అయ్య'గారి రివ్యూ చూసుకో..?_*
అప్పట్లో 'మహిళా రిజర్వేషన్లు, పోరాటం' అంటూ అప్పట్లో తను ఓ వీరవనిత అన్నంత ఫోజు, కలరింగు ఇచ్చింది మీడియాలో.! మరి తన డాడీ ఎన్ని టికెట్లు ఇచ్చాడు మహిళలకు, తన మొదటి హయాంలో అసలు మహిళకు కేబినెట్‌లోనే చోటు లేదు కదా.! అదంతా అటక మీదకు పారేసింది ఇప్పుడు.!

*_ఇదే బాగోలేదు_*
తాజాగా బీసీ నినాదం ఎత్తుకుంది. 55 శాతం బీసీలకు రాజ్యాధికారంలో సరైన వాటా దక్కాలనేది న్యాయమైన డిమాండ్.! కానీ అది కవిత నోటి వెంట రావడమే అబ్సర్డ్.!ఎందుకంటే..? బీసీలకు కేసీయార్ చేసిన న్యాయం ఏముంది రాజ్యాధికారంలో..? కాంగ్రెస్, బీజేపీ దొంగ నాటకాలు ఆడుతున్నాయి బీసీ కోర్కెల విషయంలో అంటోంది ఇప్పుడామె.! ఔరా.!!

*_పదేళ్లపాటు...:_*
ఓకే, కానీ పదేళ్ల పాలనలో కవిత డాడీ బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చాడా..? పోనీ, ఎలాగూ రాజకీయ నైతికతను బొందపెట్టి ఫామ్ హౌజులోనే పడుకుంటున్నాడు కదా.! తన అధ్యక్ష స్థానాన్ని చురుకైన బీసీ నాయకుడికి ఇవ్వొచ్చు కదా.! ఇవ్వడు.! అదో స్వార్థపూరిత డిఫరెంట్ క్యారెక్టర్.

*_ఇలా అడుగు_*
డాడీ, నువ్వు బీసీలకు చేసిన న్యాయం ఏమిటి..? కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సరే, బీఆర్ఎస్ నుంచి 'నువ్వేం హామీలు ఇస్తావో చెప్పు' అని ప్రధానంగా ప్రశ్నించాల్సిది తను డాడీనే కదా.! అధికారం ఉన్నప్పుడు ఏమీ ప్రజాస్వామిక ధోరణి ఉండదు. ఇప్పుడు మాత్రం ‘ఆదర్శాల కవరింగులు’..!

*_నీకే తగులుతోంది_*
'ఇది చేయాలి, ఇది చేయలేదు' అని బీజేపీని, కాంగ్రెస్‌ను అడుగుతున్న ప్రతి సందర్భంలో 'నీ పార్టీ ఏం చేసిందో మొదట చెప్పు' అనే ఉల్టా ప్రశ్న తగులుతుంది. సహజం కదా.! హఠాత్తుగా తెలంగాణతనం, తెలంగాణ జనం గుర్తుకు రావడం ఓకే, కానీ 'ఇదెందుకు గత పదేళ్లలో లేదు' అనే విమర్శ సూటిగా తనకే తగులుతుంది..!! జర జాగ్రత్త‌ మరి.!

*_మిర్రర్ ఎఫెక్ట్_*
ఫామ్ హౌజులో 'ఏం చేస్తున్నావ్ అధ్యక్షా.!' అని ఒక్క మాట బీఆర్ఎస్ అజ్ఞాత అధ్యక్షుడిని అడిగితే తన రాజకీయ కార్యాచరణకు క్రెడిబులిటీ. అడిగితే బాగుండు..! శుష్క వాదనలు, అసభ్య మాటతీరుతో కేటీయార్ నానాటికీ జనంలో ఆదరణను కోల్పోతున్నాడు కాబట్టి, కాబోయే సీఎంగా కవితనూ తీసిపారేయలేం కాబట్టి… ఆమె కాస్త రీజనబుల్ కార్యాచరణను చూపిస్తే బాగుండు..!!

బాక్స్:

*_ధర్నా ఎందుకు కవితమ్మా..!_*
# ఈ డ్రామాలకు 'తెర' ఎప్పుడు.?
# ఎమ్మెల్సీ కవిత వీటికి జవాబు చెప్పగలవా.?

1) కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచడం కోసం చర్యలు తీసుకొని, అందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నందుకు మీరు ధర్నా చేస్తున్నారా?

2) బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ద్వారా పంచాయతీలు, మున్సిపాల్టీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు ప్రాతినిధ్యం లభించే అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా?

3) స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు చర్యలు చేపడుతున్నందుకు ధర్నా చేస్తున్నారా?

4) స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించడానికి గాను ప్రజా ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని నియమించినందుకు ధర్నా చేస్తున్నారా?

5) జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేందుకు రాష్ట్రంలో కులగణన చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా?

6) గత బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమ బడ్జెట్ను 2971.32 కోట్ల రూపాయలకు పెంచినందుకు ధర్నా చేస్తున్నారా?

7) కాంగ్రెస్ ప్రభుత్వం గీతన్నల ఆవేదనను గుర్తించి తాడి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా?

8) గీతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కార్మక్రమాన్ని ప్రారంభించినందుకు ధర్నా చేస్తున్నారా?

9) బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 10 సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా?

10) ఎమ్‌బీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా?

11) మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల్లోని వివిధ విభాగాల్లో 5136 మంది ఉద్యోగులను నూతనంగా నియమించినందుకు ధర్నా చేస్తున్నారా?

12) బీసీ హాస్టళ్లకు పక్కా భవనాల నిర్మాణాల్లో భాగంగా ఇప్పటికే 20 నిర్మాణాలకు కోసం 100 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా?

13) గురుకులాల్లో డైట్ కాస్మోటిక్ చార్జీలు 40 శాతానికి పెంచినందుకు ధర్నా చేస్తున్నారా?

14) 28 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నూతనంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నందుకు ధర్నా చేస్తున్నారా?

15) బీసీ కార్పొరేషన్ కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 73 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా.?

*_విదేశాలలో ఉన్న తెలుగువారికి అండగా హెల్పింగ్ హ్యాండ్స్_*

https://x.com/Praja_Snklpm/status/1875512013428027648?t=LAh8_UoCk4WD6vCQO-Jlsg&s=19   

*_విదేశాలలో ఉన్న తెలుగువారికి ఆపదలో ఉన్నప్పుడు మేమున్నాం అని ధైర్యంగా ముందుకొస్తున్న పొన్నం సత్యం,దుబాయ్ గారికి &(యూఏఇ తెలుగు హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్) సభ్యులకు అభినందనలు ✊._*

*దుబాయ్ 04/01/2025*

*అల్ కొజ్: నిర్మల్ జిల్లా, దిల్వపూర్ మండలము గుండంపల్లి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్, మతి స్థిమితం కోల్పోయి ఎయిర్పోర్ట్ లో బోర్డింగ్ పాస్ మరియు పాస్పోర్ట్ పోగొట్టుకున్నాడు, ఇంటికి రావలసిన సంతోష్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంపెనీ వారిని ఆర తియగా వారు అన్ని క్లియరెన్స్ చెసి ఎయిర్ పోర్టులో వదిలినట్లు తెలియజేశారు...సంతోష్ ఏమైనడు, అని కుటుంబ సభ్యులు ఆందోళన గురై..యూఏఈ తెలుగు హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ సంప్రదించారు. వెంటనే గ్రూప్ సభ్యులు అతని వెతికే పని చేసి దుబాయ్ రషీద్ హాస్పిటల్ లో కనుక్కున్నారు. చేర దీసి  రూము భోజనం వసతి కల్పించారు.. ఇండియన్ అంబాసి కౌన్సిలింగ్ సూచనల ద్వారా అధికార పత్రాలు తయారుచేసి పంపించారు....ఇంటికి చేరుకున్న తరువాత కుటుంబ సభ్యులు సంతోషంతో అతని బాగోగులు చూసుకున్నందుకు, సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపినారు.....✍🏼 పొన్నం సత్యం, దుబాయ్ (యూఏఇ తెలుగు హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్)_*

*@cgidubai*

*#dubai #HelpingHandsUAE* 
*#UAEteluguPeople*

*@Collector_NML*
*@IPRTelangana*
*@satyan559* 

*కలం యోధులు🪶*
Bplkm✍️

SSA ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి... CITU

https://x.com/Praja_Snklpm/status/1875501640255701173?t=DaiNKPr9iHLoEpmOQwM99w&s=08  

*#CITU* 
*@cituhq*

*_సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు ఇచ్చిన మాట తప్పిన #RevanthreddyCM గారు._*

*@GpkOfficial_ @Bmaheshgoud6666* *@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS* *@IPRTelangana @seethakkaMLA* *@Ponnam_INC*
*@edu_commissonTG* *@ProfKodandaram @K_Nageshwar @INCTelangana*

*కలం యోధులు🪶*
*Bplkm✍️*