*85 శాతం అధికారులు, ఉద్యోగులు, 90 శాతం మంత్రులు ఎమ్మెల్యే లు లంచగొండులు*
*ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ IAS అధికారి సంచలన వ్యాఖ్యలు*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే హైదరాబాద్ బ్యూరో, నవంబర్ 20:
ఎక్కడ చూసినా లంచగొండులు. 85 శాతం అధికారులు, ఉద్యోగులు, 90 శాతం మంత్రులు ఎమ్మెల్యే లు ఇందులో ఉన్నారు.అందరూ కలిసి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అని ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ట్విట్టర్ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.అవినీతి చేస్తే ఉద్యోగం పోతుంది, ఎమ్మెల్యే గిరి పోతుంది , శిక్షలు ఉంటాయి అనే భయం ఉందా అసలు ? ఎమ్మెల్యే గారు ఏం చేద్దాం ? ముఖ్యమంత్రికి మీకు అంటే అందరూ ఎమ్మెల్యే లకు చిత్త శుద్ధి ఉంటే గట్టి అవినీతి నిరోధక చట్టం తెద్దాము అని ప్రశ్నించారు.ఈ చట్టం పరిధిలోకి ఐఏఎస్ , ఐపీఎస్ , అందరూ అధికారులను,ఎమ్మెల్యే లను, మంత్రులను, ఎంపీ లను, జడ్జీలను, కాంట్రాక్టర్లను కూడా తీసుకొద్దాము అని అన్నారు.పది స్పెషల్ కోర్టులు పెడదాము. రాజకీయాలకు అతీతంగా ఒక స్వతంత్ర చట్టబద్ధమైన చట్టబద్ధమైన కమిషన్ పెడదాము. మెజిస్టీరియల్ పవర్స్ ఇద్దాము అని సూచించారు. ఏసీబీ ని కూడా కమిషన్ పరిధి లోకి తీసుకొద్దాము. నెల రోజులలో శిక్షలు పడేటట్లు, శిక్షలు గట్టిగా ఉండేటట్లు, అవినీతి జరుగకుండా ముందే అరికట్టేటట్లు గట్టి చట్టాన్ని రూపొందిద్దాము.
మీరు చెయ్యరు ఎందుకంటే మీరందరూ అందులో భాగం. ఏదో చిన్న చిన్న ఉద్యోగులను పట్టుకొని ఏదో చేస్తున్నట్లు మొక్కుబడి పనులు చేస్తారు. కెసిఆర్ ఆ మొక్కుబడి పనులు కూడా చెయ్యలేదు మహానుభావుడు
రోజు రోజు కు అవినీతి విస్తరిస్తుంది. సమాజం నాశనం అవుతుంది. కోట్ల మంది డైరెక్ట్ గా గా ఇండైరెక్టుగా కష్టాలను, పేదరికాన్ని , అవమానాలను అనుభవిస్తున్నారు అని తెలిపారు.
No comments:
Post a Comment