Saturday, November 14, 2026

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లలకు గుక్కెడు బువ్వ పెట్టలేక పోతాంది - తెలంగాణ జనసేన పార్టీ_

*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లలకు గుక్కెడు బువ్వ  పెట్టలేక పోతాంది - తెలంగాణ జనసేన పార్టీ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, నవంబర్ 13:

ప్రపంచ స్థాయి ప్రభుత్వ విద్య అంటూ గొప్పలు చెబుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లలకు గుక్కెడు బువ్వ  పెట్టలేక పోతాంది. గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అట్టహాలంగా ప్రారంభమైన ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లోని పేద విద్యార్థులకు 22 రోజులుగా అల్పాహారం అందించలేని పరిస్థితి నెలకొన్నదన్న తెలిసింది అని తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది.ముఖ్యమంత్రి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమైన ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లోని పేద విద్యార్థులకు 22 రోజులుగా అల్పాహారం, బ్రేక్‌ఫాస్ట్ అందించడం లేదని తెలంగాణ జనసేన పార్టీ ఎక్స్ ఖాతా ద్వారా విమర్శించింది.ఆగస్టు నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉండగా, సెప్టెంబర్ నుంచి నిధులు విడుదల కాలేదు. పిల్లలు ఆకలితో ఉండకూడదని ఉపాధ్యాయులే అప్పులు చేసి పథకాన్ని కొనసాగించగా, సరుకులు, కూరగాయలకు కలిపి రూ.10 లక్షల బకాయిలు పేరుకు పోయాయని అంటున్నారు. ఆకలికి అలమడిస్తోన్న పిల్లలకు అప్పు చేసైనా అన్నం పెట్టాలనే ఆలోచన చేసిన హెడ్‌మాస్టర్‌పై చర్యలకు హెచ్చరికలు జారీ చేయడం చాలా బాధాకరం.
తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేసి, విద్యార్థులకు అల్పాహార పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి. పిల్లల కోసం అప్పులు చేసిన హెడ్‌మాస్టర్‌పై కక్షసాధింపు చర్యలను నిలిపివేయాలి అని తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ తెలిపింది.

No comments:

Post a Comment