*రామంతాపూర్ వెంకట్ రెడ్డి నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సమస్యలు*
*పేద ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందించడంలో అధికారులు,పాలకులు బాధ్యత మరిచారు*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే,నవంబర్ 04:
మేడ్చల్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ సర్కిల్ రామంతపూర్ నందుగల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ప్రజావాణి స్వచ్చంద సంస్థ ప్రతినిధుల బృందం పరిశీలనకు వెళ్లారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ హాస్పిటల్ నందు తిష్ట వేసుకున్న సమస్యలపై రెండు సంవత్సరముల క్రితమే అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది .ఈరోజుకి కూడా సమస్యలు అలాగే ఉన్నాయి .హాస్పిటల్ నందు- రోగులకు వైద్య నిమిత్తం పది పడకలు, పరీక్షలు చేయుటకు ల్యాబ్ కూడా ఉన్నది .ఆరు నెలల క్రితం ల్యాబ్ ఇంచార్జ్ ట్రాన్స్ఫర్ కావడంతో ల్యాబ్ నందు పరీక్షలు ఆగిపోయాయి, డ్రైనేజీ వ్యవస్థ కుంటుబడిపోయింది, భవనం పై కప్పు చెత్తాచెదారంతో నిండిపోయి వర్షం వచ్చినప్పుడు నీరు నిలిచి అట్టినీరు గదుల్లోకి చేరుకొని స్లాబ్ పాడైపోయింది.ఫాల్ సీలింగ్ ఎక్కడికి అక్కడ విరిగిపోయింది .రూములో నందు నీరు నిలిచి పోవడం వల్ల హాస్పిటల్కు సరియైన రూములు లేకపోవడం వల్ల అధికారులు ఇబ్బందులు పడుతున్నారు .హాస్పిటల్ పైకి వెళ్లడానికి మెట్లు కూడా ఏర్పాటు చేయలేదు .హాస్పిటల్ పైకప్పు పై చెట్లు నిలిచి స్లాబ్ అంతా పాడైపోయింది. రోగులకు త్రాగడానికి మంచినీటి సౌకర్యం కూడా లేకుండా పోయింది. ఇంత మంచి హాస్పిటల్ ప్రజల కోసం ఏర్పాటు చేసి వాటి పర్యవేక్షణను మరిచారు .అసలు డాక్టర్లు సమయానికి వస్తున్నారా లేదా ?ఈ హాస్పిటల్ పై ఏ అధికారులు పర్యవేక్షిస్తారు? అధికారులు నిద్రపోయారే అనుకుందాం కానీ ప్రజల జీవితాలను బాగు చేస్తామని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన పాలకులు ఏం చేస్తున్నారు? ప్రజావాణి స్వచ్ఛంద సంస్థ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు.? అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు .ఇప్పటికైనా అధికారులు పాలకుల సమన్వయంతో సమస్యలను వెంటనే బాగు చేసి రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ప్రజావాణి స్వచ్ఛంద సంస్థ విజ్ఞప్తి చేస్తుంది.ఈ కార్యక్రమంలో ఎర్రం శ్రీనివాస్, గోసుల విజయ్ కుమార్, తెడ్డు రవీందర్,వంపు లక్ష్మయ్య పాల్గొన్నారు.
No comments:
Post a Comment