*హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మరియు ఉస్మానియా మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ల సమ్మె*
బాపట్ల కృష్ణమోహన్,మీడియా టుడే, అక్టోబర్ 28:
హైదరాబాద్లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మరియు ఉస్మానియా మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు మౌలిక వసతుల కొరత మరియు పెండింగ్ స్టైపెండ్ల సమస్యలపై అక్టోబర్ 27, 2026 నుండి తమ సమ్మెను తిరిగి ప్రారంభించారు.అక్టోబర్ 12-13 తేదీల్లో జరిగిన మొదటి విడత సమ్మె సమయంలో సమస్యలను 10 రోజుల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, వాటిని నెరవేర్చకపోవడంతో డాక్టర్లు మళ్లీ ఆందోళనకు దిగారు.ఆస్పత్రిలో అవసరమైన వైద్య పరికరాలు, మందులు మరియు సరైన సౌకర్యాలు లేకపోవడం.నెలవారీ స్టైపెండ్లు సకాలంలో విడుదల కాకపోవడం, ఫైనాన్స్ విభాగంలో బిల్లులు పెండింగ్లో పడటం.
*డిమాండ్లు :*
*(1)*: పెండింగ్ ఉన్న స్టైపెండ్లను బకాయిలతో సహా వెంటనే విడుదల చేయాలి.
*(2)*: బ్యూరోక్రటిక్ జాప్యాన్ని నివారించడానికి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME)కి నేరుగా స్టైపెండ్లు పంపిణీ చేసే అధికారం ఇవ్వాలి.
*(3)*: ప్రతి నెలా సక్రమంగా స్టైపెండ్లు అందేలా ఒక పక్కా షెడ్యూల్ అమలు చేయాలి
No comments:
Post a Comment