Saturday, November 14, 2026

చిన్నారులందరికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు - అనురాధ రావు బాలలహక్కుల సంఘం ప్రెసిడెంట్_

*చిన్నారులందరికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు - అనురాధ రావు బాలలహక్కుల సంఘం ప్రెసిడెంట్*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, నవంబర్ 13:

14 నవంబర్ అంటే మనకు గుర్తుకు వచ్చేది బాలలు.
పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యంగా, సంతోషంగా పెరగాలి,మంచి విద్య, సమాన అవకాశాలు పొందాలి. పిల్లలందరు సమానమే కదా ! 
పేద, ధనిక భేదం లేదు, చిన్నారులందరు సమానము. కానీ వాస్తవం ఏంటి?
పిల్లలకు అవసరమైన ప్రాథమిక వస్తువులపై పన్నుల భారం ఎందుకు?ధనిక వర్గాల పిల్లలకు, పేద వర్గాల పిల్లలకు ఆకలి, అనారోగ్యం, పరిశుభ్రత ఒక్కటే. వారి ఆర్థిక పరిస్థితిని బట్టి మారదు. పిల్లలకు పాలు, పాలపొడి, డైపర్లు, పాల బాటిళ్లు,నిప్పల్స్, అవసరమైన మందులు అన్ని కూడా కావల్సినవే, అవేమి విలాస వస్తువులు కాదు. ప్రాథమిక అవసరాలు. వీటిపై GST ని పూర్తిగా నిషేదించడం ప్రభుత్వ బాధ్యత. కొందరు పిల్లలకు లాక్టోజ్ పడదు. వారికి లాక్టోజ్ ఫ్రీ ఇన్ఫంట్ ఫార్ములా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. HSN 1901 కింద వచ్చే ఫార్ములా పై 12శాతం - 18శాతం 
అది విలాస వస్తువు కాదు, వారికి కడుపు నింపే ఆహరం. 
కొందరు పిల్లలకు తల్లిపాలు రాక, ఫార్ములా పై ఆధారపడతారు, కొందరు పుట్టగానే తల్లిని కోల్పోయిన పిల్లలు ఉంటారు. వారికి ఖచ్చితంగా పాల ఫార్ములా కావాలి.శుభ్రత కోసం డైపర్లు కావాలి, ఎదైన క్లాత్ ఉపయోగిస్తే డెలికేట్ ఉన్న పిల్లలకు ఇన్ఫెక్షన్లు రావోచ్చు, మళ్లీ అదనపు మందులు కొనాలి. ఇలా పిల్లలకు అవసరమైన అన్నిటి పై  GST ని ఎత్తివేయాలి. డపైర్స్ - 5శాతం 
ఫిడింగ్ బాటిల్ నిప్పల్స్ పై 5శాతం,పాల ఫార్ములా - 5శాతం,స్పెషల్ ఫార్ములా . 12-18శాతం .GST 
పిల్లల మందులపై 5శాతం GST.
ఇవన్ని ధనిక వర్గాలు భరించ గలుగుతారు కాని మనం పేద ప్రజల పిల్లల గురించి ఆలోచించాలి. ఎక్కువ కొనుగొలు చేసేది పేద ప్రజలు,వీరి సంఖ్యఅధికం. అవి చిన్నారుల విలాస వస్తువులు కావు. నేను బోమ్మల గురించి,ఇతర వస్తువుల గురించి అడగడం లేదు. కాబట్టి 0శాతం GST స్లాబ్ లోకి తీసుకురావాలని, ఈ 2027 బడ్జెట్లో పిల్లల నిత్యావసర వస్తువుల పై 0శాతం GST చేయాలి బాలల హక్కుల సంఘం కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ప్రతి సంవత్సరం బడ్జెట్ ను Feb 1న ఉదయం 11గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెడతారు. దీనికోసం  ప్రణాళికలను ఆగస్టు నుండే సిద్దం చేస్తారు.పన్నుల మార్పు, కొత్త పధకాల కేటాయింపులు అన్ని డిసెంబర్ మాసంలో జరుగుతాయి. పిల్లలే దేశ సంపద,ఆ సంపదను రక్షించు కోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
వారి తరపున మనం మన గొంతు వినిపిద్దాం.

No comments:

Post a Comment