*ట్రాన్స్జెండర్ వైద్యురాలిగా చరిత్ర సృష్టించిన - డాక్టర్ కొయ్యల రూత్ జాన్పాల్*
*డాక్టర్ జాన్పాల్ ను సత్కరించిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ వి. సజ్జనార్ ఐపీఎస్*
బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, అక్టోబర్, 28
ఎమర్జెన్సీ మెడిసిన్లో ఎండీ పూర్తిచేసి, దేశంలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ట్రాన్స్ మహిళగా నిలిచిన డాక్టర్ కొయ్యల రూత్ జాన్ పాల్ గారి సంకల్పాన్ని అభినందిస్తూ, వారిని సత్కరించిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ వి. సజ్జనార్ ఐపీఎస్.ఒకప్పుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఎన్నో కష్టాలు, వివక్షను ఎదుర్కొన్నప్పటికీ... పట్టుదలతో చదువుకుని, న్యాయపోరాటం చేసి పీజీ పూర్తిచేసిన ఆమె జీవన ప్రయాణం ప్రశంసనీయం.
ప్రస్తుతం సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి అత్యవసర విభాగంలో సేవలందిస్తూ ఎందరో రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. అన్ని అవరోధాలనూ అధిగమించి నిలిచిన ఈ తొలి ట్రాన్స్ వైద్యురాలి అకుంఠిత దీక్ష సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం. డాక్టర్ రూత్ గారి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని, తన లక్ష్యాలను చేరుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను అని సజ్జనార్ అన్నారు.ఈ ప్రయాణంలో డాక్టర్ రూత్ గారికి వెన్నుదన్నుగా నిలిచి సహకరించిన ముకుంద మాల గారికి, వైజయంతి వసంత గారికి, రచన ముద్రబోయిన గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
No comments:
Post a Comment