*_లిక్కర్ కవితమ్మా... ఏందీ బిసీ ముసుగు.!_*
Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, 9440000009)_
*_కవిత రాజకీయాల ధోరణే విచిత్రం.! అప్పుడప్పుడూ మరో షర్మిల అనిపిస్తుంటుంది.! దొందూ దొందే.! లిక్కర్ స్కాంలో నిండా మునిగినప్పుడు 'జై తెలంగాణ' అంటూ, 'తెలంగాణ తల వంచదు' అంటూ తన స్కాంకు తెలంగాణతనాన్ని ముడిపెట్టడం చిరాకు తెప్పించింది. అదో వెగటు సినిమా టిక్ డ్రామా.! డబ్బు కోసం నానా అడ్డదార్లూ తొక్కి, తనేదో 'వీర తెలంగాణ వనిత' అన్నట్టు, ఆ మద్యం కుంభకోణం కూడా 'తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం' అన్నట్టు కలరింగు ఇవ్వడాన్ని యావత్ తెలంగాణ సమాజం ఏవగించుకుంది. తనకున్న ఫీడ్ బ్యాక్ ఏమిటో గానీ..!! అదో పెద్ద దరిద్రం._*
*_మీ 'అయ్య'గారి రివ్యూ చూసుకో..?_*
అప్పట్లో 'మహిళా రిజర్వేషన్లు, పోరాటం' అంటూ అప్పట్లో తను ఓ వీరవనిత అన్నంత ఫోజు, కలరింగు ఇచ్చింది మీడియాలో.! మరి తన డాడీ ఎన్ని టికెట్లు ఇచ్చాడు మహిళలకు, తన మొదటి హయాంలో అసలు మహిళకు కేబినెట్‌లోనే చోటు లేదు కదా.! అదంతా అటక మీదకు పారేసింది ఇప్పుడు.!
*_ఇదే బాగోలేదు_*
తాజాగా బీసీ నినాదం ఎత్తుకుంది. 55 శాతం బీసీలకు రాజ్యాధికారంలో సరైన వాటా దక్కాలనేది న్యాయమైన డిమాండ్.! కానీ అది కవిత నోటి వెంట రావడమే అబ్సర్డ్.!ఎందుకంటే..? బీసీలకు కేసీయార్ చేసిన న్యాయం ఏముంది రాజ్యాధికారంలో..? కాంగ్రెస్, బీజేపీ దొంగ నాటకాలు ఆడుతున్నాయి బీసీ కోర్కెల విషయంలో అంటోంది ఇప్పుడామె.! ఔరా.!!
*_పదేళ్లపాటు...:_*
ఓకే, కానీ పదేళ్ల పాలనలో కవిత డాడీ బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చాడా..? పోనీ, ఎలాగూ రాజకీయ నైతికతను బొందపెట్టి ఫామ్ హౌజులోనే పడుకుంటున్నాడు కదా.! తన అధ్యక్ష స్థానాన్ని చురుకైన బీసీ నాయకుడికి ఇవ్వొచ్చు కదా.! ఇవ్వడు.! అదో స్వార్థపూరిత డిఫరెంట్ క్యారెక్టర్.
*_ఇలా అడుగు_*
డాడీ, నువ్వు బీసీలకు చేసిన న్యాయం ఏమిటి..? కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సరే, బీఆర్ఎస్ నుంచి 'నువ్వేం హామీలు ఇస్తావో చెప్పు' అని ప్రధానంగా ప్రశ్నించాల్సిది తను డాడీనే కదా.! అధికారం ఉన్నప్పుడు ఏమీ ప్రజాస్వామిక ధోరణి ఉండదు. ఇప్పుడు మాత్రం ‘ఆదర్శాల కవరింగులు’..!
*_నీకే తగులుతోంది_*
'ఇది చేయాలి, ఇది చేయలేదు' అని బీజేపీని, కాంగ్రెస్‌ను అడుగుతున్న ప్రతి సందర్భంలో 'నీ పార్టీ ఏం చేసిందో మొదట చెప్పు' అనే ఉల్టా ప్రశ్న తగులుతుంది. సహజం కదా.! హఠాత్తుగా తెలంగాణతనం, తెలంగాణ జనం గుర్తుకు రావడం ఓకే, కానీ 'ఇదెందుకు గత పదేళ్లలో లేదు' అనే విమర్శ సూటిగా తనకే తగులుతుంది..!! జర జాగ్రత్త మరి.!
*_మిర్రర్ ఎఫెక్ట్_*
ఫామ్ హౌజులో 'ఏం చేస్తున్నావ్ అధ్యక్షా.!' అని ఒక్క మాట బీఆర్ఎస్ అజ్ఞాత అధ్యక్షుడిని అడిగితే తన రాజకీయ కార్యాచరణకు క్రెడిబులిటీ. అడిగితే బాగుండు..! శుష్క వాదనలు, అసభ్య మాటతీరుతో కేటీయార్ నానాటికీ జనంలో ఆదరణను కోల్పోతున్నాడు కాబట్టి, కాబోయే సీఎంగా కవితనూ తీసిపారేయలేం కాబట్టి… ఆమె కాస్త రీజనబుల్ కార్యాచరణను చూపిస్తే బాగుండు..!!
బాక్స్:
*_ధర్నా ఎందుకు కవితమ్మా..!_*
# ఈ డ్రామాలకు 'తెర' ఎప్పుడు.?
# ఎమ్మెల్సీ కవిత వీటికి జవాబు చెప్పగలవా.?
1) కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచడం కోసం చర్యలు తీసుకొని, అందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నందుకు మీరు ధర్నా చేస్తున్నారా?
2) బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ద్వారా పంచాయతీలు, మున్సిపాల్టీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు ప్రాతినిధ్యం లభించే అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా?
3) స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు చర్యలు చేపడుతున్నందుకు ధర్నా చేస్తున్నారా?
4) స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించడానికి గాను ప్రజా ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని నియమించినందుకు ధర్నా చేస్తున్నారా?
5) జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేందుకు రాష్ట్రంలో కులగణన చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా?
6) గత బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమ బడ్జెట్ను 2971.32 కోట్ల రూపాయలకు పెంచినందుకు ధర్నా చేస్తున్నారా?
7) కాంగ్రెస్ ప్రభుత్వం గీతన్నల ఆవేదనను గుర్తించి తాడి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా?
8) గీతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కార్మక్రమాన్ని ప్రారంభించినందుకు ధర్నా చేస్తున్నారా?
9) బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 10 సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా?
10) ఎమ్‌బీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా?
11) మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల్లోని వివిధ విభాగాల్లో 5136 మంది ఉద్యోగులను నూతనంగా నియమించినందుకు ధర్నా చేస్తున్నారా?
12) బీసీ హాస్టళ్లకు పక్కా భవనాల నిర్మాణాల్లో భాగంగా ఇప్పటికే 20 నిర్మాణాలకు కోసం 100 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా?
13) గురుకులాల్లో డైట్ కాస్మోటిక్ చార్జీలు 40 శాతానికి పెంచినందుకు ధర్నా చేస్తున్నారా?
14) 28 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నూతనంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నందుకు ధర్నా చేస్తున్నారా?
15) బీసీ కార్పొరేషన్ కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 73 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా.?
No comments:
Post a Comment