Saturday, November 21, 2026

ఇజ్రాయెల్–తెలంగాణ బిజినెస్ మీట్‌ను వ్యతిరేకించినందుకు SIO నేతల నిర్భంధాలా??_

*పత్రికా ప్రకటన* 

*ఇజ్రాయెల్–తెలంగాణ బిజినెస్ మీట్‌ను వ్యతిరేకించినందుకు SIO నేతల నిర్భంధాలా??*

*టి-హబ్‌లో ఇజ్రాయెల్–తెలంగాణ బిజినెస్ మీట్‌ను వ్యతిరేకించినందుకు ఎస్.ఐ.ఓ SIO తెలంగాణ నాయకులను రాత్రిపూట అక్రమంగా నిర్బంధించడాన్ని మానవ హక్కుల వేదిక  HRF తీవ్రంగా ఖండిస్తోంది*

హైదరాబాద్ బ్యూరో బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, నవంబర్ 16:

నవంబర్ 16, 2026న టి-హబ్ T-Hub వేదికగా జరగనున్న ఇజ్రాయెల్–తెలంగాణ బిజినెస్ మీట్ నేపథ్యంలో, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ SIO తెలంగాణ నాయకులను ఎటువంటి వారెంట్ లేకుండా రాత్రిపూట హైదరాబాద్ సిటీ మీర్  చౌక్ పోలీసులు నిర్బంధించడాన్ని మానవ హక్కుల వేదిక HRF తీవ్రంగా ఖండిస్తోంది. పోలీసుల ఈ దుందుడుకు, ఏకపక్ష మరియు అప్రజాస్వామిక చర్య అత్యంత గర్హనీయం.ఇజ్రాయెల్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న వాణిజ్య సంబంధాలపై సూత్రప్రాయమైన వ్యతిరేకతను వ్యక్తం చేసిన విద్యార్థి నాయకుల గొంతు నొక్కడానికి, ముందస్తుగా, ఎటువంటి వారెంట్లు లేకుండా నిర్బంధాలకు పాల్పడటం భావ ప్రకటనా స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కుపై జరిగిన  దాడి. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో, ప్రజా సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును గమనిస్తూ విమర్శించడం జరగాలి. . శాంతియుత ప్రజాస్వామ్య వ్యతిరేకతను శాంతిభద్రతల సమస్యగా పరిగణించడం అనేది రాష్ట్ర నిఘా మరియు పోలీసుల బెదిరింపు సంస్కృతికి నిదర్శనం.పౌరులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినంత మాత్రాన పోలీసులు ముందస్తు నిర్బంధాలను Preventive Detention ప్రయోగించకూడదు. ఇటువంటి హక్కుల ఉల్లంఘనలు పునరావృతం కాకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము.

**ఎం. సురేష్ బాబు**
అధ్యక్షుడు,
మానవ హక్కుల వేదిక (HRF) - హైదరాబాద్
**సంజీవ్*
ప్రధాన కార్యదర్శి,
మానవ హక్కుల వేదిక (HRF) - హైదరాబాద్

No comments:

Post a Comment