*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*
*_శాంతి భద్రతలను సంరక్షిస్తూ,ప్రజల జీవితాలకు,ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ,నేరాలు,విధ్వంసాలు జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీసు.శాంతిభద్రతలను కాపాడటం,పౌరులను,వారి ఆస్తులను రక్షించడం,నేరాలను నిరోధించడం,దర్యాప్తు చేయడం, వారి అధికార పరిధిలో చట్టాలు, నిబంధనలను అమలు చేయడం వంటివి పోలీసుల బాధ్యత._*
*_👆పైన తెలిపినట్లు ఎంతమంది పోలీస్ అధికారులు సిబ్బంది ప్రజలకు జవాబుదారీతనంగా తమ విధులకు న్యాయం చేస్తుండ్రు ??._*
*_#Facts / #వాస్తవాలు : #తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ఈరోజు వరకు తెలంగాణ పోలీస్ శాఖ లోని చాలామంది అధికారులు సిబ్బంది పాలకులు / ప్రజాప్రతినిధులు చెప్పినట్లు నడుచుకుంటున్నారు. ఇది నిజం. అందుకు ఉదాహరణ నిత్యం సోషల్ మీడియా వేదికగా ఎన్నో సంఘటనలు వాస్తవాలతో చూస్తున్నారు ప్రజలు. తప్పుడు కేసులు.. విచారణ పేరుతో రోజుల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుకోవడం. ఇక అవినీతి గురించి చెప్పనక్కరలేదు. గౌరవ న్యాయస్థానాలు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా మారని అవినీతి పోలీస్ అధికారులు._*
*_భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు #Article19To21 కు అనుగుణంగా అన్యాయాలను, అవినీతిని ప్రశ్నించే గొంతుల మీద అక్రమంగా కేసులు పెట్టడం అందరికి తెలిసిందే. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే పాలకులకు / ప్రజాప్రతినిధులకు / బడాబాబులకు తొత్తులుగా ఉండడమే. చివరకు బలి అవుతుంది ఇలాంటి అధికారులే._*
*_#పోలీస్ అనే పదానికి వన్నె తెచ్చిన , తెస్తున్న పోలీస్ అధికారులు కొందరే మిగిలారు... వీరికి హ్యాట్సాఫ్. ఇలాంటి అధికారుల వల్ల ప్రజలకు ఇంకా నమ్మకం పోలీస్ అంటే._*
*_చివరిగా ఒక్కటే చెప్పేది #రాజ్యాంగం కు గౌరవం ఇచ్చి ప్రజాస్వామ్య బద్దంగా, ప్రజలకు జవాబుదారీతనంగా నడుచుకోవాలి ఎవరైనా....గౌరవ న్యాయస్తానాలు ఉన్నాయి అని మరిచిపోవద్దు._*
*#IndianConstitution*
*#SupremeCourtIND*
*#TelanganaHighCourt*
*#Article19To21*
*#HumanRights*
*కలం యోధులు🪶*
*Bplkm✍️*
No comments:
Post a Comment