Thursday, November 5, 2026

సామాజిక కార్యకర్త కప్పల రమేష్ చేస్తున్న నిరంతర పోరాటానికి తొలి విజయం_

*పత్రికా ప్రకటన*

*సామాజిక కార్యకర్త కప్పల రమేష్ చేస్తున్న నిరంతర పోరాటానికి తొలి విజయం*

*నిరుద్యోగులు, కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగుల సమస్యపై సామాన్యుడి పోరాటానికి కేంద్రం స్పందన - లేబర్ కమిషన్ నుండి కీలక లేఖ*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, నవంబర్ 03:

దేశంలో లక్షలాది మంది నిరుద్యోగులు, కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అన్యాయంపై తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, శాలిగౌరారం మండలం, ఉట్కూర్ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త *కప్పల రమేష్* చేస్తున్న నిరంతర పోరాటానికి తొలి విజయం లభించింది.

*విషయం ఏమిటి?*

రాష్ట్ర ప్రభుత్వాల్లో 8-10 సంవత్సరాలుగా శాంక్షన్డ్ పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తక్కువ జీతం ఇచ్చి, ఉద్యోగ భద్రత లేకుండా దోపిడీ చేస్తున్నారని, సుప్రీంకోర్టు ఇచ్చిన *సమాన పనికి సమాన వేతనం Equal Pay for Equal Work  తీర్పును అమలు చేయాలని, దీనికోసం ఒక *జాతీయ విధానం National Policy తీసుకురావాలని కోరుతూ నేను గత *12.09.2026న* భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖకు వినతిపత్రం సమర్పించాను.ఈ వినతిపత్రంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు *భోళా నాథ్ వర్సెస్ స్టేట్ అఫ్ జార్ఖండ్ 30.01.2026, 2026 INSC 99* ను ఉటంకిస్తూ, 10 సంవత్సరాలు పనిచేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్న ఆదేశాలను అమలు చేయాలని కోరాను. లేబర్ కమిషన్ తో పాటు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు మరియు పీ.ఎం.ఓ ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా వినతి సమర్పించడం జరిగింది. ఇట్టి కేసు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్   ఎన్. హెచ్. ఆర్సీ లో రిజిస్టర్ అయినది NHRC డైరీ నెంబర్ .110806/CR/2026.

*కేంద్రం స్పందన:*

నా వినతిని పరిశీలించిన *భారత ప్రభుత్వ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయం, న్యూఢిల్లీ* వెంటనే స్పందించింది.

*File No. 31(05)2026-OSH (e-203177), Date: 02.11.2026* ద్వారా *Regional Labour Commissioner (C), శ్రీ హరి ప్రసాద్ చౌరాసియా* గారు నా వినతిపత్రాన్ని *LRC Section (Labour Reforms Cell), Ministry of Labour & Employment, Rafi Marg, New Delhi* కి "తగు చర్యలు తీసుకోవాలని" కోరుతూ అధికారికంగా పంపించారు. దీని కాపీని నాకు కూడా పంపించారు.
ఒక సాధారణ గ్రామానికి చెందిన వ్యక్తి పెట్టిన వినతిని కేంద్ర కార్మిక శాఖ ఇంత త్వరగా పరిగణనలోకి తీసుకొని పాలసీ విభాగానికి పంపడం హర్షణీయం.

*కప్పల రమేష్   డిమాండ్లు:*

*(1)*:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న లక్షలాది ఖాళీ శాంక్షన్డ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
*(2)*:  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 10 సంవత్సరాలు దాటిన కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలి.
*(3)*:  "సమాన పనికి సమాన వేతనం" సూత్రాన్ని కఠినంగా అమలు చేయాలి, కాంట్రాక్ట్ దోపిడీని అంతం చేయాలి.
*(4)*:  దేశవ్యాప్తంగా ఒకే విధమైన జాతీయ కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకురావాలి.
*(5)*: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పార్టీ విధానంలో నియామకాలు చేపట్టే కాంట్రాక్ట్ నియమావళిని, కేంద్ర స్థాయిలో సెంట్రల్ లేబర్ కమిషన్ నుండి మరియు రాష్ట్రస్థాయిలో స్టేట్ లేబర్ కమిషన్ నుండి అనుమతితో కాంట్రాక్ట్ విధానాన్ని రూపొందించాలి.
*(6)*: కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ మరియు పార్ట్ టైం వివిధ రకాల ఉద్యోగాలలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కేంద్ర స్థాయిలో కేంద్ర లేబర్ కమిషన్ బ్యాంక్ అకౌంట్ ద్వారా  మరియు రాష్ట్రస్థాయిలో రాష్ట్ర లేబర్ కమిషన్ బ్యాంక్ ఎకౌంట్ ద్వారా ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్లో జీతాలు అందించాలి.

ఈ విషయంలో కేంద్ర కార్మిక శాఖ త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాను. దేశంలోని నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ ఈ ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను.
    *ఇట్లు,*
*కప్పల రమేష్*
*సామాజిక కార్యకర్త, ఉట్కూర్ గ్రామం,
శాలిగౌరారం మండలం
*నల్గొండ జిల్లా, తెలంగాణ - 508210*

No comments:

Post a Comment