Saturday, November 21, 2026

విద్యావేత్త చుక్కా రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు నాయుడు_

*విద్యావేత్త చుక్కా రామయ్యకు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు నాయుడు*

హైదరాబాద్ / విజయవాడ, బాపట్ల కృష్ణమోహన్)నవంబర్ 20:

'ఐఐటీ రామయ్య'గా తెలుగు ప్రజలకు సుపరిచితులైన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. క్రమశిక్షణ, అత్యుత్తమ శిక్షణతో ఐఐటీల్లో సీట్లు పొందేందుకు వేలాది మంది విద్యార్థులకు రామయ్య మార్గం చూపారు అని అన్నారు.ఆయన తీర్చిదిద్దిన విద్యార్థులు నేడు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో గొప్ప గొప్ప హోదాల్లో పనిచేస్తున్నారు.చుక్కా రామయ్యతో నాకు ఎంతో కాలంగా ఆత్మీయ అనుబంధం ఉంది. విద్యార్థుల పట్ల ఆయనకు ఉన్న అంకితభావాన్ని నేను దగ్గరగా చూశాను. నిండు నూరేళ్ళు పూర్తి చేసుకున్న రామయ్య గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

No comments:

Post a Comment