Friday, November 13, 2026

గ్రూప్-1 మెయిన్స్ అవకతవకలపై టీజీపీఎస్సీ కార్యదర్శికి బీఆర్‌ఎస్ నేతల వినతిపత్రం_

*గ్రూప్-1 మెయిన్స్ అవకతవకలపై టీజీపీఎస్సీ కార్యదర్శికి బీఆర్‌ఎస్ నేతల వినతిపత్రం*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, నవంబర్ :9:
గ్రూప్-1 నియామక ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం నిర్ధారించాలని కోరుతూ బీఆర్‌ఎస్ నాయకులు అభ్యర్థులతో కలిసి టీజీపీఎస్సీ  TGPSC కార్యదర్శి శ్రీమతి హరిత, ఐఏఎస్ కు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, నాయకులు తుంగ బాలు, సతీష్ ఉపేంద్ర, కొడంగల్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

**ప్రధాన డిమాండ్లు:**

*(1)*: స్వతంత్ర ఉన్నతస్థాయి విచారణ: తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న డీఎస్పీ ట్రైనీలలో దాదాపు 35 శాతం మంది విఫలమైనట్లు వచ్చిన వార్తల నేపథ్యాన్ని, అలాగే హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని సమగ్ర ఉన్నతస్థాయి సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి.

*(2)*: ఫోరెన్సిక్ ఆడిట్ మరియు పునఃపరిశీలన: గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకన రికార్డులపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, జవాబు పత్రాలను పూర్తి పారదర్శకతతో పునఃపరిశీలించాలి.

*(3)*: అభ్యర్థులకు న్యాయం: నియామకాల్లో ప్రతిభకే ప్రాధాన్యతనిస్తూ, అర్హులైన ఏ ఒక్క అభ్యర్థికి అన్యాయం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి.

No comments:

Post a Comment