Thursday, November 5, 2026

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పశుసంపద వైభవానికి ప్రతీకగా నిలిచే హైదరాబాద్ సదర్ ఉత్సవాలు_

*హైదరాబాద్ సదర్ ఉత్సవాలు యాదవుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రధాన సాంస్కృతిక వేడుక - సీఎం రేవంత్ రెడ్డి*

బాపట్ల కృష్ణమోహన్, మీడియా టుడే, నవంబర్ 04:

హైదరాబాద్ సదర్ ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి యాదవ సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పశుసంపద వైభవానికి ప్రతీకగా నిలిచే హైదరాబాద్ సదర్ ఉత్సవాలు యాదవుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, వారసత్వ గొప్పతనానికి ప్రతిబింబమని పేర్కొన్నారు.ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతుల ప్రదర్శనలు, వాటి ఠీవి, దర్పం, సందడి సదర్ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు. ఈ ఉత్సవాలు యాదవుల జీవన వైభవాన్ని చాటి చెబుతాయన్నారు. ఈ సదర్ ఉత్సవాలు ప్రతి యాదవ కుటుంబంలో ఆనందోత్సాహాలు నింపాలని, అందరికీ సిరిసంపదలు, ఆయురారోగ్యాలు కలగాలని, యాదవుల ఐక్యత, అభ్యున్నతి మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

No comments:

Post a Comment