**అక్షరాల అంబరాన KKR సంతకం | జర్నలిస్టుల గుండెల్లో గౌరవ పతాకం!**
డాక్టర్ కే. కోటేశ్వరరావు (KKR) | చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ – మీడియా టుడే సంస్థలు | జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు – ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్.
కలం కదిలితే కథకు ప్రాణం | కవనం పలికితే భావానికి రూపం | వార్త వెలువడితే ప్రజలకు న్యాయం | జర్నలిస్టుకు గౌరవం దక్కితే వృత్తికే వైభవం.
అక్షరాలే ఆలయాలుగా |ఆలోచనలే ఆయుధాలుగా |నిజాలే నినాదాలుగా | ప్రజాస్వామ్యమే ప్రస్థానంగా సాగుతున్న *మీడియా టుడే* ప్రయాణంలో *పదిహేనేళ్ల* సంబరం.ఇది కాలం జరిపే వేడుక కాదు,కలాలు సాధించిన విజయాలకు కీర్తి కిరీటం.
తెలుగు పత్రికా రంగంలో తనదైన గుర్తింపుతో జాతీయ తెలుగు దినపత్రికగా,ఇంగ్లీష్ డైలీ న్యూస్ పత్రికగా,మీడియా టుడే టీవీగా,N24 న్యూస్ గా విస్తరించిన మీడియా సంస్థల ప్రస్థానం ఎన్నో వార్తలకు వేదికగా,ఎందరో పాత్రికేయులకు అండగా నిలిచిన అక్షర అనుబంధం.ఆ ప్రస్థానానికి సారథి *KKR.* ఆలోచనలో విశాలత | ఆచరణలో హుందాతనం | మాటలో మాధుర్యం | మనసులో మానవత్వం | పదవిలో బాధ్యత | పాత్రికేయుల పట్ల ఆత్మీయత.
*డాక్టర్ కే.కోటేశ్వరరావు* అంటే ఒక పేరు మాత్రమే కాదు జర్నలిస్టుల సమస్యలపై స్పందించే స్వరం.వారి హక్కుల కోసం నిలబడే సంకల్పం.వారి కష్టాలకు విలువనిచ్చే వ్యక్తిత్వం. మీడియా టుడే చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్గా,AWJA జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులుగా పాత్రికేయుల ఐక్యత,సంక్షేమం,ఆత్మగౌరవం కోసం ఆయన సాగిస్తున్న కృషి ప్రశంసనీయం.
జర్నలిస్టు రాసే వార్త వెనుక ఎంతటి శ్రమ ఉందో తెలిసిన మనసు.విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు తెలిసిన అనుభవం.సమస్య వచ్చినప్పుడు స్పందించాలనే బాధ్యత.కలం పట్టిన చేతికి గౌరవం దక్కాలనే ఆకాంక్ష.ఇవన్నీ కలిసినప్పుడే నాయకత్వం ఒక వ్యక్తిత్వమవుతుంది.
పదవి ఉంటేనే నాయకుడు కాదు పది మందికి అండగా నిలిస్తేనే నిజమైన నాయకుడు.హోదా ఉంటేనే గౌరవం కాదు ఎదుటివారి గౌరవాన్ని కాపాడితేనే హుందాతనం.ఆ విలువలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న *KKR* గారికి అక్షరాభినందనలు.
ఇప్పుడు రాబోతోంది నవంబర్ పదిహేను | అక్షరాల ఆనందానికి మరో పండుగ రోజు | హైదరాబాద్ గుండెల్లో జర్నలిస్టుల జాతర | *మీడియా టుడే* కుటుంబానికి మరచిపోలేని మధుర జ్ఞాపకం.
2026 నవంబర్ 15,ఆదివారం ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్లోని కోటి,ఉమెన్స్ కాలేజీ సమీపంలోని IMA ట్రస్ట్ బిల్డింగ్లో జరగనున్న 15వ వార్షికోత్సవ వేడుకలు పాత్రికేయుల ఆత్మీయ సమ్మేళనంగా రూపుదిద్దుకోనున్నాయి.
తెలంగాణలోని 33 జిల్లాల నుంచి తరలివచ్చే స్టాఫ్ రిపోర్టర్లు,బ్యూరో ఇన్చార్జిలు,మీడియా టుడే కుటుంబ సభ్యులందరికీ యాజమాన్యం తరఫున ఘన సన్మానం,గౌరవప్రదమైన పురస్కారాలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ఈ వేడుకల ప్రత్యేకత.
ఎన్నో ఊళ్లలో తిరిగిన అడుగులకు | ఎన్నో వార్తలు మోసిన భుజాలకు | ఎన్నో నిజాలు వెలుగులోకి తెచ్చిన కలాలకు | ఈ సన్మానం ఒక మధురమైన జ్ఞాపకం.
జిల్లాలు ముప్పై మూడు అయినా మనసులన్నీ ఒక్కటే |బాధ్యతలు వేర్వేరు అయినా బాట ఒక్కటే | కలాలు ఎన్నో అయినా లక్ష్యం ఒక్కటే | ప్రజల పక్షాన నిలవడమే పాత్రికేయుడి నిజమైన గెలుపు.
సన్మానం అంటే శాలువా కాదు శ్రమకు ఇచ్చే సంతకం | పురస్కారం అంటే జ్ఞాపిక కాదు ప్రతిభకు పెట్టే పట్టాభిషేకం | వేదిక అంటే నాలుగు గోడలు కాదు వృత్తి గౌరవం వెల్లివిరిసే ఆత్మీయ లోకం.
*పదిహేనేళ్ల* ప్రయాణం మరో పదిహేను విజయాలకు పునాది కావాలి.*మీడియా టుడే* కీర్తి మరింత దూరం వినిపించాలి.జర్నలిస్టుల జీవితాల్లో గౌరవం,భద్రత,సంక్షేమం కొత్త వెలుగులు నింపాలి.
అక్షరానికి అలుపు లేదు | ఆశయానికి అంతం లేదు | నిజం కోసం నడిచే కలానికి ఓటమి లేదు | ఆ కలాన్ని గౌరవించే సంస్థకు విజయాలకు కొదవ లేదు.*మీడియా టుడే* పదిహేనేళ్ల ప్రస్థానానికి అక్షర నీరాజనం డాక్టర్ కే.కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనం.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పాత్రికేయ మిత్రుడికీ ఆత్మీయ అభివందన సుస్వాగత శుభాకాంక్షలు.
--------------------
PRESENTATION BY
--------------------
విజయసంకల్పం ప్రసాద్
సీనియర్ ఫ్రీలాన్స్ పొయట్ జర్నలిస్ట్ | ఉత్తమ కలం యోధ అవార్డు గ్రహీత | జర్నలిస్ట్ జాతీయ పురస్కార గ్రహీత | సోషల్ ఫైటర్ | హైదరాబాద్ | తిరుపతి.
--------------
బాపట్ల కృష్ణ మోహన్
జర్నలిస్ట్ అవార్డు గ్రహీత | జర్నలిస్ట్ జాతీయ పురస్కార అవార్డు గ్రహీత | తెలుగు మాధురీ పురస్కారం అవార్డు గ్రహీత | మీడియా టుడే జాతీయ తెలుగు దినపత్రిక హైదరాబాద్ బ్యూరో | అల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ AWJA సోషల్ మీడియా కన్వినర్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ | ప్రజాసంకల్పం స్వచ్చంద సంస్థ & యూట్యూబ్ ఛానెల్ ఫౌండర్ | మానవ హక్కుల బాద్యులు(HRF) | సామాజిక కార్యకర్త | హైదరాబాద్
-----------
నీలాజ్యోతి
ఫ్రీలాన్స్ పొయట్ జర్నలిస్ట్ | రాష్ట్ర ప్రధాన కార్యదర్శి – మహిళా విభాగం, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ | డివిజనల్ జనరల్ సెక్రటరీ – ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ | ఫ్యామిలీ మోటివేటర్ | రిజిస్టర్డ్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ & మిడ్వైఫరీ | తెలంగాణ.
----------
T.రాధికా రాణి
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ | సైకాలజిస్ట్ | జీవిత సాపల్య అవార్డు గ్రహిత | సోషల్ వర్కర్ | తిరుపతి.
No comments:
Post a Comment