నా 25 సంవత్సరాల జీవితంలో ఎవరిమీద చెయ్యి ఎత్తలేదు. బూతులు తిట్టలేదు. కానీ ఈరోజు వ్యవస్థ చూసి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్న మీ నాయకుల అండదండలతో ఇదంతా జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే, వారిని రక్షించాలి అనుకుంటే సంపూర్ణమైన ఎంక్వయిరీ చేసి ఎవరి స్థలాలను వారికి ఇప్పించే ప్రయత్నం చేయాలి.
దీనిలో ఇన్వాల్వ్ అయిన వారి మీద అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. వారికి అండగా ఉన్న నాయకులను హెచ్చరించాలి.
ఏకశిలా నగర్ మాత్రమే కాదు బాలాజీ నగర్, జవహర్ నగర్, అరుంధతి నగర్.. ఆరు నెలలుగా పేదలు కన్నీళ్లకు పరిష్కారం కోసం తిరుగుతున్నాను. ఇదే నా పని అయ్యింది.
ఇవన్నీ చూసిన తర్వాత ఇంత దౌర్జన్యమా ఇంత దుర్మార్గమా అనిపిస్తుంది. ఇదే గ్రామాల్లో జరిగితే తోలు తీస్తారు. ఇక్కడ బయటి నుంచి వచ్చి వాళ్లు బ్రతుకుతున్నారు ఐక్యత ఉండదు భయపడే వాళ్ళు అని వారి భయాన్ని ఆసరా చేసుకుని ఇంత దౌర్జన్యం చేస్తున్నారు.
బాధితులు దరఖాస్తు ఇచ్చినా స్పందించని వారిపై చర్యలు తీసుకోవాలి.
మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాను.
ఈ సమస్య పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, నవీన్ మిట్టల్ గారికి, కలెక్టర్ మేడ్చల్ గారికి, సిపి రాచకొండ గారికి పంపిస్తా.
40 సంవత్సరాలుగా కోర్టు తీర్పు ఉన్నా కూడా ఆ భూములను అనుభవించకుండా బాధపడుతున్న వారి పక్షాన నేను నిలబడతా.
ఏ మాత్రం సోయి ఉన్నా..
ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నా..
ప్రజల పట్ల ప్రేమ ఉన్నా..
వెంటనే స్పందించి ప్రజల ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాను. (2/2)
@BJP4India @BJP4Telangana
Courtesy / Source by : https://x.com/Eatala_Rajender/status/1881705828279017842?t=Fk8QBlm_3h0P5gfw-xFDbQ&s=19
No comments:
Post a Comment