Thursday, January 23, 2025

జాతీయ బాలికా దినోత్సవం...

జాతీయ బాలికా దినోత్సవం...

2008 జనవరి 24 వ తేదీ నుండి ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం "ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలకు సాధికారత"

 మన దేశంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కులు,విద్య, వైద్యం, పోషకాహారం,లింగ వివక్ష మొదలగు వాటిపై అవగాహన కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ జాతియ బాలికా దినోత్సవం జరుపుతున్నది.

లింగ వివక్ష తల్లి గర్భం నుండి ప్రారంభం అవుతుంది,ఫలితం భ్రూణ హత్యలు.అమ్మాయి పుట్టిన తర్వాత భారంగా భావించడం, చిన్న చూపు, విద్య విషయంలో అబ్బాయికి ఒకరకమైన విద్య అంటే ప్రైవేటు/ కాన్వెంటుకు పంపించడం, అమ్మాయిలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం లేదా బడికి పంపించకపోవడం,అమ్మాయిలు చదవడం వృధా అనే భావన.

మనం ఎంత అభివృద్ధి చెందినా అమ్మాయి అనగానే అన్ని రకాలుగా చిన్న చూపు. విద్యకు దూరం చేసి బాల్య వివాహాలు చేయటం. 

ప్రపంచంలో అధిక బాల్య వివాహాలు జరిగే దేశాల్లో భారతదేశం మూడో స్థానం ఉంది. తెలంగాణాలో సగటున రోజుకు మూడు బాల్య వివాహాలు అవుతున్నాయి. తెలంగాణలో బాలికలపై లైంగిక దాడులు అధికం, నిరుడు పోక్సోకేసులు 2434 నమోదు. 

పిల్లల అక్రమ రవాణాలో 80% బాలికలే ఉన్నారు. 

ప్రతి సంవత్సరం జాతీయ బాలికా దినోత్సవం జరుపుకొంటున్నాం. ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నాం, కానీ అవి ఏవి అమలు కావటం లేదు, ఎలాంటి మార్పు కనిపించటం లేదు.

ఆడ పిల్లలను పుట్టనిద్దాం, స్వేచ్ఛగా బతుకనిద్దాం, ఎదగనిద్దాం,చదవనిద్దాం.

 వారి కలలను సాకారం చేసుకోవడానికి మనం మన వంతు చేయూతనిద్దాం,

వాళ్ళు అన్ని రంగాల్లో ముందు ఉంటారు.

Courtesy / Source by :

Anuradha Rao 

President 

Balala Hakkula Sangham

https://youtu.be/ELA0lEio0Rs?si=JVjJxLBPjGzA6ChD

@AnooradhaR #balalahakkulasangham
@AchyutaRao6 @sridhartoons

@edu_commissonTG
@IPRTelangana

కలం యోధులు🪶
Bplkm✍️

https://x.com/Praja_Snklpm/status/1882652932786831726?t=eFPORSKk1ghJZAdzrSgkgw&s=19

No comments:

Post a Comment