హైదరాబాద్లో అంబర్పేట్ వైపు ఉండేటోళ్లకు తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు
- నాలుగేండ్లు కొనసాగిన పనులు
- 1.6 5కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్లతో నిర్మాణం
- రూ.445 కోట్ల ఖర్చు
హైదరాబాద్ సిటీ, వెలుగు: అంబర్ పేట్ ఫ్లై ఓవర్ త్వరలోనే వాహనదారులకు అందుబాటులోకి రానుంది. నాలుగేండ్ల కింద మొదలైన పనులు ఈ మధ్యే పూర్తయ్యాయి. రూ.445 కోట్లతో గోల్నాక నుంచి ఛే నంబర్ జంక్షన్ మీదుగా ముఖ్రం హోటల్ వరకు 1.625 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్లతో ఈ ఫ్లై ఓవర్ను నిర్మించారు. కోర్ సిటీలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నేషనల్ హైవే అథారిటీ నిర్మించిన మొట్టమొదటి ఫ్లై ఓవర్ ఇది. అయితే భూసేకరణకు కావాల్సిన రూ. 140 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది.
2018లో శంకుస్థాపన..2021లో పనులు షురూ
ఫ్లైఓవర్ నిర్మాణ పనులను 2018లో శంకుస్థాపన చేయగా, 2021లో పనులు మొదలయ్యాయి. 2023 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదట అంచనా వ్యయం రూ.216 కోట్లుగా అనుకున్నారు. ఇందులో రూ.117 కోట్లు స్ర్టెచర్ కాస్ట్ కాగా, రూ.99 కోట్లు భూసేకరణ కోసం ఖర్చవుతుందని భావించారు. అయితే, రెండు వర్గాలకు చెందిన కట్టడాలపై నుంచి ఫ్లై ఓవర్ కట్టడానికి ఒప్పుకోలేదు. దీంతో కొంతమేర రూట్ మార్చడం, భూసేకరణ ఎక్కువ కావడం, టైం కూడా మించి పోవడంతో రూ.445 కోట్ల అంచనాతో రివైజ్ చేశారు. ఇందులో రూ.265 కోట్లు స్ర్టెచర్ కాస్ట్ , రూ.180 కోట్లు భూ సేకరణ కోసం ఖర్చయ్యాయి. భూసేకరణ కోసం రూ.140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.
ట్రాఫిక్ లేని జర్నీ
ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఉప్పల్ నుంచి ఎంజీబీఎస్వెళ్లేవారితో పాటు సిటీ నుంచి వరంగల్ హైవే వైపు వెళ్లే వాహనదారుల ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుంది. ఇంతకుముందు ఛే నంబర్, శ్రీరమణ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోయేది. ఫ్లై ఓవర్వస్తే చాదర్ఘాట్ నుంచి సిగ్నల్ తగలకుండా రామాంతాపూర్, హబ్సిగూడ స్ర్టీట్ నెంబర్ 8 వరకు ఈజీగా చేరుకోవచ్చు. ప్రధాని మోడీ లేదా కేంద్రమంత్రి గడ్కరీ ఈ ఫ్లైఓవర్ ని ప్రారంభించే అవకాశముంది. వారు హాజరుకాలేని పక్షంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కలిసి ప్రారంభిస్తారని తెలుస్తోంది.
Courtesy / Source by : https://www.v6velugu.com/after-a-long-wait-amberpet-flyover-to-be-thrown-open-to-citizens-soon
No comments:
Post a Comment