మల్కాజిగిరి పార్లమెంట్ : పోచారం మున్సిపాలిటీ పరిధిలో కొర్రెముల గ్రామంలో 1985 లో 149 ఎకరాలు భూమిని లేఅవుట్ చేసి 2076 మందికి అమ్మారు. కొన్న వారిలో మెజారిటీ వారు చిన్న ప్రభుత్వ ఉద్యోగులు. వారంతా బ్యాంకు లోన్ పెట్టి కొన్నారు.
ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి.. 2006లో దొంగ డాక్యుమెంట్ సృష్టించి గ్రామపంచాయతీలో ఉన్న చిన్న ఉద్యోగులను పట్టుకొని వ్యవసాయ భూమిగా కన్వర్ట్ చేసుకున్నారు.
ప్లాట్లు కొన్నవారు కోర్టుకు వెళితే కోర్టు వీడు దొంగ అని.. ప్లాట్లు కొన్న వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
2011లో మరోసారి ఇలాంటి ప్రయత్నమే జరిగింది.
మరోసారి కూడా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారికి మొట్టికాయలు పడ్డాయి.
అయినా వదిలిపెట్టకుండా కొద్దిమంది అధికారుల అండదండలతో.. డిపిఓ ను మేనేజ్ చేసి వ్యవసాయ భూమిగా మార్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ కోర్టుకు వెళ్తే కోర్టు మళ్ళీ కొట్టి వేసింది..
ధరణి వచ్చిన తర్వాత కలెక్టర్ అమాయ్ కుమార్ ని పట్టుకొని 9 ఎకరాల భూమిని రాయించుకున్నారు. దానితో పాటు పక్కన ఉన్న ప్లాట్లను కూడా దౌర్జన్యంగా కొన్నారు. 2076 ప్ట్లాట్లలో 206 తీసుకున్నారు.
ఏకశిలా నగర్ లో 700 ఇల్లు ఉన్నాయి.
మిగిలిన వారు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ కి వెళ్తే అనుమతి ఇవ్వడం లేదు. మున్సిపాలిటీ LRS ఇవ్వడం లేదు.
రియల్ ఎస్టేట్ బ్రోకర్ స్థానిక నాయకులను పట్టుకొని వందమంది గుండాలను, 10 కుక్కలను పెట్టి మరి ఈ ఏకశిలా నగర్ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఆడవాళ్లను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. గుండాలు ఎంత బెదిరించినా సంయమనం పాటించి పోలీస్ స్టేషన్ కి వెళ్లి బాధితులు కేసులు పెడుతున్నారు. పోచారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ సీఐ వాళ్లకే సపోర్ట్ చేస్తున్నారు. వాని ఎంగిలి మెతుకులకు ఆశపడి కబ్జాదారును పక్షం వహిస్తున్నారు తప్ప పేదల పక్షాన ఆలోచన చేయలేదు.
నిన్న నా దగ్గరికి బాధితులందరూ వచ్చి వారిని పెడుతున్న ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. నేను వెంటనే సిపి గారికి ఫోన్ చేసి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని చెప్పాను. కలెక్టర్ కి ఫోన్ చేసి రోజు ఏదో ఒక కబ్జా మీద ఫోన్ చేయాల్సి వస్తుంది. మీరేం చేస్తున్నట్టు అని అడిగాను.
నేనే స్వయంగా ఈరోజు వస్తా అని చెప్పా..
రాత్రిపూట వాళ్ల గుండాలు ఎంపీ వచ్చి ఏం పీకుతాడు అని చెప్పి మహిళలను బెదిరించారు. టెంట్ వెయ్యొద్దు కుర్చీలు వేయొద్దు మీటింగ్ పెట్టొద్దు అని హుకుం జారీ చేశారంట.
రియల్ ఎస్టేట్ బ్రోకర్ పెట్టిన గుండాల హుకుం. రాత్రి పోలీసు వాళ్లకు ఫోన్ చేస్తే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు.
పొద్దున్నే వచ్చాను వీళ్ళతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నాను.
అందులో ఒక చిరు ఉద్యోగి.. 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను ఈ గుండాలు కూలగొట్టారని నా ఇల్లు చూడమని కోరితే.. అటు వెళ్ళాను.
20 మంది గుండాలు బీరు సీసాలు పెట్టి తాగుతూ ఏం చేస్తారు రా అన్నట్టు చూస్తున్నారు.. రెండు నెలలుగా మా మీద దుర్మార్గాలు చేస్తున్నారు వీరే అని చూపించగానే.. వారి దగ్గరికి వెళ్ళాను.
పోలీసు ధర్మాన్ని కాపాడటంలో విఫలమైనప్పుడు..
రెవెన్యూ అధికారులు విఫలమైనప్పుడు..
ప్రజల ఓట్లతో గెలిచిన బిడ్డగా.. ధర్మాన్ని కాపాడటానికి.. వాళ్లకు అండగా ఉండడానికి వానికి పనిష్మెంట్ ఇచ్చాను.
నేను దీనిని తప్పుగా భావించడం లేదు.
ప్రజల పక్షాన నిలబడ్డాను అనుకుంటున్నాను.
పోలీసు, రెవెన్యూ అధికారులు ప్రజల ఆస్తులను, ప్రజలను కాపాడటంలో విఫలమైనప్పుడు ప్రజలే తిరగబడతారు.
మీరు సిగ్గుపడాలి.
ఇంతమంది ఇన్ని రోజులుగా దరఖాస్తులు ఇచ్చినా,
కోర్టు తీర్పులు ఉన్నా.. న్యాయం వీరి పక్కన ఉన్నా కూడా న్యాయం కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు అధర్మానికి కొమ్ము కాయడం సిగ్గుచేటు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. (1/2)
@BJP4India @BJP4Telangana
Courtesy / Source : https://x.com/Eatala_Rajender/status/1881704886863306974?t=Nj_pCTpyjhmNb1wBdp4uPQ&s=19
No comments:
Post a Comment